‘టాక్సిక్‌’లో కియారా విధ్వంసం.. యశ్‌ స్పందన ఇదే! | Kiara Advani Toxic Performance Set To Become A Major Milestone In Her Career, Yash And Nayanthara Praise Her Acting | Sakshi
Sakshi News home page

‘టాక్సిక్‌’లో కియారా విధ్వంసం.. యశ్‌ స్పందన ఇదే!

Aug 9 2026 11:08 AM | Updated on Aug 9 2026 1:05 PM

Yash, Nayanthara Praise Kiara Powerful Performance in Toxic

కియారా అద్వానీకి టాక్సిక్‌ సినిమా కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుందా..? అంటే ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో యశ్‌, నయనతార చేసిన వ్యాఖ్యలు చూస్తే అవుననే అనిపిస్తోంది. సినిమాలో కియారా నటన, ఆమె అంకితభావంపై వీరిద్దరూ ప్రశంసలు కురిపించారు. వేదికపై కియారాను ఉద్దేశించి యాశ్‌ మాట్లాడుతూ..‘ ఈ సినిమాలో నీ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డావు.  నీ అంకితభావాన్ని నేను దగ్గర నుంచి చూశాను.  ఈ సినిమాలో నువ్వు చూపించిన నటన భవిష్యత్తు కంటే ముందుంది.  ఇప్పుడు చాలా మంది ఎదో మాట్లాడొచ్చు.  కానీ సినిమా రిలీజ్‌ అయ్యాక వాళ్లే ప్రశంసలు కురిపిస్తారు’ అన్నారు.  నయనతార సైతం కియారా కోసం ఆకాశానికెత్తేశారు. ‘ ఇది నీ కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటి.  టాక్సిక్‌కు ముందు కియారా.. తరువాత కియారా అనేలా నీ కెరీర్‌ మారిపోతుంది.  ఈ సినిమాలో నువ్వు అద్భుతంగా నటించావు’ అని ప్రశంసించారు. 

కాగా గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రంలో యాశ్‌ తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించననున్నాడు. తండ్రీతనయుల మధ్య సంఘర్షణ, వారి భిన్నమైన ఆలోచనలు, కోపం నేపథ్యంలో కథ సాగినట్లు ట్రైలర్‌ చూస్తే స్పష్టం అవుతోంది. చివర్లో తండ్రీకొడుకులు ఒకరిని ఒకరు కొట్టుకోవడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ పతాకాలపై వెంకట్‌ కె.నారాయణ, యశ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement