రామ్ చరణ్ పెద్ది మూవీ.. ఆ రోల్‌పై మరో నటి విమర్శలు | Ram Charan Peddi Sparks Fresh Controversy, Aditi Balan Questions The Purpose Of Janhvi Kapoor Character, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Peddi Movie: అసలు ఎందుకు రాశారో అర్థం కాలేదు: పెద్దిపై ఘాటు కామెంట్స్

Aug 9 2026 8:59 AM | Updated on Aug 9 2026 11:25 AM

Actress Aditi Balan comments On Ram Charan Peddi Movie

మెగా హీరో రామ్ చరణ్‌ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా మెప్పించగా.. జగపతి బాబు, శివరాజ్‌కుమార్‌ కీలక పాత్రలు పోషించారు.  

అయితే ఈ మూవీలో హీరోయిన్ పాత్రపై అప్పట్లో విమర్శలొచ్చాయి. ఆ తర్వాత కొన్ని సీన్స్ కూడా తొలగించారు. జాన్వీని కేవలం గ్లామర్‌ కోసమే తీసుకున్నారా? అని పలువురు విమర్శించారు. తాజాగా మరో నటి జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు చేసింది. కోలీవుడ్, టాలీవుడ్‌లో పలు సినిమాల్లో మెప్పించిన ఆదితి బాలన్ పెద్దిలో హీరోయిన్‌ పాత్రను తప్పుబట్టింది.

తాను ఇటీవలే పెద్ది మూవీ చూశానని ఆదితి బాలన్ అన్నారు. అసలు జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఎందుకు రాశారో అర్థం కాలేదన్నారు. ఆ పాత్ర కరెక్ట్ కాదని నాకు అనిపించిందన్నారు. ఆమె పాత్రను అలా కాకుండా కొంచెమైనా ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటే బాగుండేగని ఆదితి బాలన్ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement