భావోద్వేగాల ఇరుముడి | Ravi Teja Irumu Movie Latest Updates | Sakshi
Sakshi News home page

భావోద్వేగాల ఇరుముడి

Aug 9 2026 12:47 AM | Updated on Aug 9 2026 12:47 AM

Ravi Teja Irumu Movie Latest Updates

ఒకవైపు నోటిలో కత్తితో, మరోవైపు అయ్యప్ప మాల ధరించి... ఇలా రెండు రకాల లుక్స్‌లో రవితేజ కనిపించనున్న చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీశంకర్‌ హీరోయిన్‌గా నటించగా, ఆయన కుమార్తెగా బేబీ నక్షత్ర నటించింది. ఈ నెల 21న ‘ఇరుముడి’ చిత్రం విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఈ 12న భీమవరంలో ఓ భారీ ఈవెంట్‌ని నిర్వహించి, ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు ‘‘ఇరుముడి’లో రవితేజ ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించనంత  ఫ్యామిలీ ఓరియంటెడ్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ముఖ్యంగా తన కుమార్తెతో ఆయనకు ఉండే అనుబంధం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుంది. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు ప్రధానంగా సాగే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement