కాంతార 3 కోసం లొకేషన్స్‌ వెతుకుతున్నారా..? | Rishab Shetty Vacation Pictures Viral: Pragathi Shetty Shares Family Trip Clicks | Sakshi
Sakshi News home page

కాంతార 3 కోసం లొకేషన్స్‌ వెతుకుతున్నారా..?

Aug 8 2026 4:40 PM | Updated on Aug 8 2026 4:52 PM

Rishab Shettys Latest Family Vacation Pictures

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కన్నడ స్టార్‌ రిషబ్ శెట్టి కాస్త బ్రేక్‌ తీసుకుని ఫ్యామిలీతో ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నారు. ఈ మేరకు వీరు ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలను భార్య ప్రగతి శెట్టి సోషల్‌ మీడియాలో పంచుకోగా వైరల్‌ అవుతున్నాయి. ఫొటోలను చూసిన అభిమానులు రిషబ్ నిజంగానే ఫ్యామిలీ ట్రిప్‌కు వెళ్లారా..? లేక కాంతార 3 కోసం లొకేషన్స్‌ వెతుకుతున్నారా..? అని కామెంట్స్‌ చేస్తున్నారు.  

కాంతార చిత్రంతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు రిషబ్‌ శెట్టి. 2017లో పెద్దల అంగీకారంతో ప్రేమవివాహం చేసుకోగా ఇద్దరు పిల్లలు( రాధ్య, రణ్విత్‌). సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించడంలో ముందు వరుసలో ఉంటారీయన. ప్రస్తుతం ప్రకృతి అందాల మధ్య ప్రశాంతంగా గడుపుతున్న ఫొటోలు వైరల్‌ కావడంతో అభిమానులు సోషల్‌ మీడియాకు పని చెప్తున్నారు.  ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు రిషబ్‌ చేతిలో ఉన్నాయి. ‘జై హనుమాన్‌’ చిత్రంలో ఆంజనేయుడిగా, ‘ది ప్రైడ్‌ ఆఫ్‌ భారత్‌- ఛత్రపతి శివాజీ మహారాజ్‌’లో ఛత్రపతి శివాజీగా సినీ ప్రేక్షకులను పలకరించనున్నాడు.  వీటితో పాటు ‘కాంతార ఛాప్టర్‌ 3’ పైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement