ధురంధర్‌ ‘పీక్ డీటెయిలింగ్’ కోసం ఇన్ని కోట్లు ఖర్చా..! | R Madhavan Reveals Aditya Dhar’s Massive Effort, Says Dhurandhar Peak Detailing Costs ₹10 Crore Extra, Deets Inside | Sakshi
Sakshi News home page

ధురంధర్‌ ‘పీక్ డీటెయిలింగ్’ కోసం ఇన్ని కోట్లు ఖర్చా..!

Aug 8 2026 10:05 AM | Updated on Aug 8 2026 11:00 AM

Dhurandhar Spent Rs 10 Crore Extra on Peak Detailing Reveals R Madhavan

అదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’, ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే సినిమాల విజయంతో పాటు సోషల్ మీడియాలో మరో విషయం విపరీతంగా వైరల్ అయింది. అదే ‘పీక్ డీటెయిలింగ్’. ప్రతి సన్నివేశంలోని చిన్న చిన్న అంశాలపై దర్శకుడు చూపించిన శ్రద్ధను ప్రేక్షకులు ప్రశంసిస్తూ ఈ పదాన్ని మీమ్స్‌గా మార్చేశారు.. తాజాగా నటుడు ఆర్.మాధవన్ ఈ ‘పీక్ డీటెయిలింగ్’ వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సినిమాల్లోని డీటెయిలింగ్‌ కోసం అదిత్య ధర్ ఏకంగా రూ.10 కోట్లు అదనంగా ఖర్చు చేశారని చెప్పారు.

ఓ ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ.. ‘దాదాపు ఎనిమిది గంటల నిడివి ఉన్న ప్రాజెక్ట్‌లో ప్రతి చిన్న విషయాన్ని తెరపై చూపించేందుకు దర్శకుడు ఎంతో సమయం, డబ్బు ఖర్చు పెట్టారు. సినిమా కోసం రూ.10 కోట్లు అదనంగా కేవలం డీటెయిలింగ్‌ కోసమే ఖర్చు చేశారని  నాకు తెలిసింది. ‘నీకు పిచ్చా? అవన్నీ ఎవరు చూస్తారు? కనిపించవు కదా?’ అని అనేవాడిని’ అని అన్నారు.

ఇక ‘పీక్ డీటెయిలింగ్ బై అదిత్య ధర్’ అనే పదం ట్రెండ్‌పై అదిత్య ధర్ కూడా స్పందించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఎక్స్‌లో చేసిన పోస్టులో మీమ్స్‌ను ప్రస్తావిస్తూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఆర్‌. మాధవన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘G.D.N.’ ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైంది. జీడీ నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్‌కు కృష్ణకుమార్‌ రామకుమార్‌ దర్శకత్వం వహించారు. మాధవన్‌తో పాటు సత్యరాజ్‌, జయరామ్‌, ప్రియమణి, దుషారా విజయన్‌ కీలక పాత్రల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement