‘కాంతారా’ ఫేమ్ రుక్మిణి వసంత్ శుక్రవారం సందడి చేశారు. నగరంలోని హోటల్ తాజ్‌డెక్కన్ వేదికగా తనిష్క్ఆ ధ్వర్యంలో ఫెస్టివల్ సీజన్ ‘మల్లె’ జ్యువెలరీ కలెక్షన్‌ను ఆమె ఆవిష్కరించారు. సినిమా వంటి గ్లామర్ ఫీల్డ్ అమ్మాయిలకు అందం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, దీనికి ఆభరణాలు మరింత ప్రాధాన్యం చేకుర్చుతాయన్నారు. తనకు వజ్రాలన్నా, బంగారు ఆభరణాలన్నా ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ రీజినల్ బిజినెస్ మేనేజర్ వాసుదేవ రావు పాల్గొని.. వజ్రాలపై వంద శాతం ఎక్సే్ఛంజ్ వాల్యుయేషన్ అందిస్తున్నట్లు వెల్లడించారు.


