'టాక్సిక్' లేడీస్ స్పెషల్.. రొమాన్స్ ప్లస్ వయలెన్స్ | Toxic Movie Actress Teaser | Sakshi
Sakshi News home page

Toxic Movie: ఒక్కొక్కరిగా వస్తారా? ఒకేసారి వస్తారా? 'టాక్సిక్' కొత్త టీజర్

Jul 1 2026 12:41 PM | Updated on Jul 1 2026 1:09 PM

Toxic Movie Actress Teaser

'కేజీఎఫ్' తర్వాత యష్ హీరోగా చేసిన సినిమా 'టాక్సిక్'. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడింది. ఎట్టకేలకు ఆగస్టు 26న రిలీజ్ అని ప్రకటించారు. ఇప్పటికే టీజర్, ఓ పాట వదలగా అవేం పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. ఇప్పుడు సడన్‌గా లేడీస్ స్పెషల్ పేరిట హీరోయిన్లతో ఓ టీజర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: మళ్లీ థియేటర్లలోకి 'ఆరుగురు పతివ్రతలు'?)

టాక్సిక్ మూవీలో హీరోయిన్లు నయనతార, రుక్మిణి వసంత్, కియారా అడ్వాణీ, తారా సుతారియా, హ్యుమా ఖురేషి ఉన్నారు. అయితే వీళ్లలో ఎవరు హీరోయిన్? ఎవరికి కీలక పాత్రలు అనేది తెలియాల్సి ఉంది. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో అయితే నయనతార, రుక్మిణి వసంత్ గన్స్ పట్టుకుని కనిపించగా.. కియారా, హ్యూమా, తారా గ్లామర్ చూపించారు.

యష్.. లేడీ ఫైటర్స్ చేసిన యాక్షన్ ఇందులో చూపించారు. మధ్యమధ్యలో రొమాన్స్ చూపిస్తూ మరోవైపు ఫైట్స్ చూపిస్తూ ఆసక్తి కలిగించారు. గీతూ మోహన్ దాస్ ఈ చిత్రానికి దర్శకురాలు.

(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోలు గమనిస్తున్నారా? 95 శాతం ఫ్లాపులు, డిజాస్టర్లే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement