వెంకటేశ్‌-కల్యాణ్‌రామ్‌ మూవీకి క్రేజీ టైటిల్‌.. ‘జనవరి 12 విడుదల’ | Anil Ravipudi, Venkatesh, Kalyan Ram Movie Title Fix | Sakshi
Sakshi News home page

వెంకటేశ్‌-కల్యాణ్‌రామ్‌ మూవీకి క్రేజీ టైటిల్‌.. ‘జనవరి 12 విడుదల’

Aug 19 2026 7:02 PM | Updated on Aug 19 2026 7:13 PM

Anil Ravipudi, Venkatesh, Kalyan Ram Movie Title Fix

అనిల్ రావిపూడి ప్రమోషన్స్ అంటే మామూలుగా ఉండవు..తన సినిమాల ప్రచారంలోనూ కొత్తదనం చూపించే ఆయన.. తాజాగా మరోసారి తనదైన స్టైల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వెంకటేశ్‌, నందమూరి కల్యాణ్‌రామ్‌ కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్‌ ప్రకటించే విషయంలోనూ ఓ ఫన్నీ ఐడియాను తీసుకొచ్చారు. టైటిల్‌తో పాటు సినిమా విడుదల తేదీని కూడా ఒకేసారి రివీల్ చేసి ఆసక్తి పెంచారు.

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్‌, కల్యాణ్‌రామ్‌ హీరోలుగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేశ్‌, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్‌, కల్యాణ్‌రామ్‌ బావా బామ్మర్ది పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది.


తాజాగా చిత్రబృందం సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించింది. ‘జనవరి 12 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసింది. అంతేకాదు.. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే క్యాప్షన్‌ను కూడా జత చేసింది. టైటిల్‌ వినగానే ఇది సినిమా విడుదల తేదీ అనుకుంటే.. అదే సినిమా పేరుగా ఉండటం విశేషం.

టైటిల్‌ ప్రకటన కోసం రూపొందించిన వీడియోలో వెంకటేశ్‌, కల్యాణ్‌రామ్‌, కీర్తి సురేశ్‌, కృతి శెట్టి.. అనిల్‌ రావిపూడిని సినిమా పేరేంటని అడుగుతారు. అందుకు ఆయన పదే పదే ‘జనవరి 12 విడుదల’ అని చెబుతుంటారు. తొలుత అది రిలీజ్‌ డేట్‌ అని భావించిన హీరోలు.. చివర్లో అదే సినిమా టైటిల్‌ అని తెలుసుకుని సరదాగా స్పందిస్తారు.

టైటిల్‌ రివీల్‌ వీడియోలో దర్శకుడు అనిల్‌ రావిపూడి ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు ప్రత్యేకంగా నివాళి అర్పించారు. ఈవీవీ తెరకెక్కించిన ‘అప్పుల అప్పారావు’లోని కామెడీ సీక్వెన్స్‌ను గుర్తు చేసేలా వీడియోను రూపొందించారు. ఇలా తన కామెడీ మార్క్‌తో పాటు పాత తరం హాస్యాన్ని కలిపి టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ను కూడా ఓ ఎంటర్‌టైనింగ్‌ వీడియోగా మార్చారు.

సంక్రాంతి బరిలో..
‘జనవరి 12 విడుదల’ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అనిల్‌ రావిపూడి సినిమాలకు సంక్రాంతి సీజన్‌తో మంచి అనుబంధం ఉండటంతో ఈ చిత్రంపైనా అంచనాలు పెరుగుతున్నాయి. వెంకటేశ్‌, కల్యాణ్‌రామ్‌ కాంబినేషన్‌, అనిల్‌ రావిపూడి కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, శ్రీమతి ఆర్చన, జీ స్టూడియోస్‌ సమర్పిస్తున్నాయి. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement