సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ నిత్యం ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటారు ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి. ఈయన మరోసారి వార్తల్లో నిలిచారు. తనపై వచ్చే ట్రోలింగ్స్, కాంట్రవర్సీలపై ఎవరూ ఊహించని రీతిలో సమాధానం ఇచ్చారు. తాజాగా జరిగిన ‘చంద్రయాన్’ సినిమా ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడిన మాటలు, తనను తాను బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌తో పోల్చుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బతకాలంటే..
తెలుగు రాష్ట్రాల్లో బతకాలంటే 2+2=4 అంటే కుదరదు. 2+2=5 అనాల్సిందే! నేను నీ బట్టలు విప్పొచ్చు కానీ నువ్వు నావి విప్పడానికి వీల్లేదు.అలా ఉంది పరిస్థితి. అసలు దుకాణమే రోడ్డు మీద పెట్టుకున్నాం. నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా.. ఇక నాదగ్గర కొత్తగా విప్పడానికి ఏం లేదు. కాంట్రవర్సీ చేస్తేనే సోషల్ మీడియాలో పైకి వెళ్తాం’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇదీ చదవండి: విజయ్‌ను ఇమిటేట్ చేసిన రష్మిక.. ఈ క్యూట్ వీడియో చూశారా..?
నేను Sunny Leone లాంటోడిని… ఇప్పటికే అన్నీ విప్పేశా, ఇక దాచడానికి కూడా ఏమీ లేదు!
— Venu Swamy pic.twitter.com/C0W6NAGgYk— No Filter (@nofilter207) October 3, 2026


