రష్మిక వంట చేస్తే.. ఓ యుద్ధం చేసినట్లే: విజయ్‌ దేవరకొండ | Vijay Deverakonda Opens Up About Rashmika Cooking Skills During Ranabaali Promotions, Watch Video Went Viral | Sakshi
Sakshi News home page

Vijay Deverakonda: మిమ్మల్ని చూస్తే ముచ్చటగా ఉంది: సుమ

Oct 3 2026 3:35 PM | Updated on Oct 3 2026 3:52 PM

Vijay Deverakonda About Rashmika Cooking Skills

టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్‌ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్‌ 16 ఈ సినిమా విడుదల  కానుంది.  ఈమేరకు మూవీ ప్రమోషన్స్‌ కూడా మొదలు పెట్టేశారు. 

తాజాగా సుమతో చేసిన మూవీ ప్రమోషన్స్‌లో రష్మికపై విజయ్‌ దేవరకొండ తనదైన శైలిలో కామెంట్స్‌ చేశాడు. రష్మిక వంట చేస్తే ఓ యుద్ధం చేసినట్లేనని సరదాగా అన్నారు. సుమ.. మిమ్మల్ని చూస్తుంటే చూడ ముచ్చటగా ఉందని వారిపై ప్రశంసలు కురిపించింది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా టీమ్‌ విడుదల చేసింది. పూర్తి ఇంటర్వ్యూ ఆదివారం  రానుంది.
ఇదీ చదవండి: వర్షిణికి ముద్దు పెడుతూ దొరికిపోయిన ముకేష్‌..

కాగా సినిమా ఎలా ఉండబోతుందనేది ఇప్పటికే  డాక్యుమెంటరీ సిరీస్‌ని నాలుగు భాగాలుగా రిలీజ్ చేసింది చిత్రబృందం.  ఈ చిత్రం1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కింది. విజయ్‌ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. విజయ్‌, రష్మిక పెళ్లి తరువాత వస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి అజయ్‌, అతుల్‌ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 

Ranabaali and Jayamma invite @ItsSumaKanakala home. And what follows is a beautiful conversation about #Ranabaali and more ❤️

Welcome to our Seema promo out now. Full conversation out tomorrow 🤩#Ranabaali GRAND RELEASE WORLDWIDE ON 16.10.26.#NeverForget#RanabaaliOnOct16th… pic.twitter.com/E9WtqPXoUP

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement