నీచులారా.. ఎవరినీ వదిలిపెట్టను : ఎన్టీఆర్‌ సంచలన ట్వీట్‌ | Jr NTR Fires On chuttamalle Morphed Video | Sakshi
Sakshi News home page

ఆ నీచులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను: ఎన్టీఆర్ వార్నింగ్‌

Oct 3 2026 1:51 PM | Updated on Oct 3 2026 2:18 PM

Jr NTR Fires On chuttamalle Morphed Video

గత కొన్ని గంటలుగా సోషల్‌ మీడియాలో ‘చుట్టమల్లే’(దేవర సినిమా) పాట తెగ వైరల్‌ అవుతుంది. ఏఐ ద్వారా అత్యంత నీచంగా ఎడిట్‌ చేసిన ఈ వీడియోని కొంతమంది సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. అలాంటివారిపై హీరో ఎన్టీఆర్‌  ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏఐ ద్వారా ఎడిట్‌ చేసిన ఆ వీడియోని షేర్‌  చేసిన వారిపై లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటామని హెచ్చరించాడు. ఒక ఆడపిల్లను అత్యంత అవమానకరంగా చూపేందుకు ఏఐని ఉపయోగించడం సిగ్గు చేటు అని.. ఎట్టిపరిస్థితుల్లోనూ వారిని వదిలిపెట్టబోనని హెచ్చరించాడు. ఈ మేరకు ఎక్స్‌లో సుధీర్గమైన పోస్ట్‌ పెట్టాడు.

(ఇదీ చదవండి: కొత్త తెలుగు సినిమాలు ఎలా ఉన్నాయి? కలెక్షన్స్ ఎంత?)

‘మహిళలను తల్లులుగా, దేవతలుగా గౌరవించే దేశంలో.. ‘మాతృదేవోభవ’ అనేది కేవలం ఒక మాట మాత్రమే కాదు, మన సంస్కృతిలో భాగం. అలాంటి సమాజంలో కొందరు ఇంత దిగజారి.. ఒక మహిళను అత్యంత అవమానకరంగా చూపించేందుకు ఏఐ (AI) సాంకేతికతను దుర్వినియోగం చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఇలాంటి దారుణమైన మార్ఫింగ్ వీడియోను రూపొందించేందుకు ఏఐని ఉపయోగించడం సిగ్గుచేటు.

‘చుట్టమల్లే’ వీడియోను మార్ఫింగ్ చేసి, అసభ్యకరంగా రూపొందించిన ఆ నీచులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. ఈ వీడియోను రూపొందించిన వారితో పాటు దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై కూడా అన్ని రకాల చట్టపరమైన చర్యలు తీసుకుంటాను.

దయచేసి ఇలాంటి కంటెంట్‌ను ఎవరూ చూడొద్దు.. షేర్ చేయొద్దు.. ఎంగేజ్ అవ్వొద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు బాధితురాలు మరొకరు కావచ్చు.. రేపు అది మీ తల్లి, సోదరి, భార్య లేదా కుమార్తె కావచ్చు. ఇది చాలా తీవ్రమైన సమస్య. ఏఐ సాంకేతికత దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రం కూడా కఠినంగా వ్యవహరించాలని, పటిష్ఠమైన నిబంధనలు తీసుకురావాలని కోరుతున్నాను’ అని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement