ఈ వీకెండ్ చాలానే తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మించిన 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్', దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తీసిన 'సిగ్మా', రోషన్ 'తెల్లకాగితం'తోపాటు అనకాపల్లి, కీర్తి సురేశ్ 'డోరతి' తదితర మూవీస్ ఉన్నాయి. ఇంతకీ వీటికి ఎలా స్పందన వస్తోంది? కలెక్షన్స్ సంగతేంటి?
రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మించిన 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' మూవీలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ హీరో. అయితే ప్రమోషన్ల గట్టిగా చేయడంతో అంచనాలు పెరిగిపోయాయి. కానీ వీటిని అందుకోవడంలో మూవీ, యావరేజ్ మార్క్ దగ్గరే ఆగిపోయిందని ప్రేక్షకులు అంటున్నారు. దీనికి తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.1.65 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఫహాద్ 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' సినిమా రివ్యూ)
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కొడుకు జేసన్ సంజయ్.. దర్శకుడిగా మారి తీసిన సినిమా 'సిగ్మా'. సందీప్ కిషన్ హీరో. దీనికి రిలీజ్‌కి ముందు మంచి హైప్ ఏర్పడింది. తీరా చూస్తే టైటిల్ ట్రెండీగా ఉన్నా కంటెంట్ పాతగా ఉందని టాక్ వినిపించింది. ఇకపోతే ఈ చిత్రానికి తొలిరోజు రూ.2.35 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
(ఇదీ చదవండి: జేసన్ సంజయ్ 'సిగ్మా' తెలుగు రివ్యూ)
'కోర్ట్' ఫేమ్ హర్ష్ రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ ప్రేమకథా సినిమా 'తెల్లకాగితం'. గతంలో జరిగిన ఓ నిజజీవిత సంఘటన ఆధారంగా దీన్ని తీశారు. అయితే క్లైమాక్స్ బాగానే ఉన్నప్పటికీ మిగతాదంతా చల్తా చల్తా. ఇది డీసెంట్ మూవీ అని ప్రేక్షకులు తీర్పు ఇచ్చారు. దీనికి తొలిరోజు రూ.1.58 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు నిర్మాత అధికారికంగా ప్రకటించుకున్నారు.
(ఇదీ చదవండి: 'తెల్లకాగితం' సినిమా రివ్యూ)
కీర్తి సురేశ్ టైటిల్ రోల్ చేసిన సినిమా 'డోరతి'. గతవారం తమిళనాడులోని థియేటర్లలోకి వచ్చింది. ఈ వీకెండ్ తెలుగులో రిలీజైంది. స్వలింగ ప్రేమ అనే భిన్నమైన కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇదో డిఫరెంట్ మూవీ అని చూసిన చాలామంది మెచ్చుకుంటున్నారు. దీనికి తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు ఎంతొచ్చాయనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: కీర్తి సురేశ్ 'డోరతి' సినిమా రివ్యూ)
ప్రముఖ నిర్మాత లగటపాటి శ్రీధర్ కొడుకు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన సినిమా 'అనకాపల్లి'. యాక్షన్ ప్రేమకథగా దీనిని తెరకెక్కించారు. అయితే ప్రెజెంటేషన్ పర్లేదనిపించిందని, కత్తి పట్టిన వాడు చివరికి కత్తిపోటుకే ఎలా బలవుతాడు? పిల్లలు చేసే తప్పులకు తల్లిదండ్రులు పడే వేదన ఎలా ఉంటుంది? ప్రేమకు, ఆకర్షణకు మధ్య ఉన్న తేడా ఏంటి? అనే అంశాలని ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. దీనికి కూడా తొలిరోజు వసూళ్లెంతనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: 'అనకాపల్లి' సినిమా రివ్యూ)


