బిగ్‌బాస్ 10: అమన్‌కి అన్యాయం.. వర్షిణి దెబ్బకు మైండ్ బ్లాక్ | Bigg Boss 10 Telugu Day 26, Oct 2nd 2026 Full Episode Highlights, Varshini Takes Captaincy From Aman, Vamsi And Sudheer Get Immunity | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Telugu Day 26: పాపం అమన్.. కష్టపడి కెప్టెన్ అయ్యాడు గానీ

Oct 3 2026 10:01 AM | Updated on Oct 3 2026 10:33 AM

Bigg Boss 10 Telugu Day 26 Episode Highlights

నోటివరకు వచ్చిన కూడు అందకుండాపోతే ఆ బాధ వర్ణనాతీతం. బిగ్‌బాస్ హౌస్‌లో అమన్ విషయంలో సరిగ్గా ఇదే సీన్ రిపీటైంది. కష్టపడి కెప్టెన్ అయితే వర్షిణి దాన్ని ఎగరేసుకుపోయింది. మరోవైపు ఆరోవారం ఇమ్యూనిటీ కోసం ఆ ఇద్దరూ గెలిచారు. ఇంతకీ శుక్రవారం(అక్టోబర్ 02) ఎపిసోడ్‌లో అసలేం జరిగింది? అనేది హైలైట్స్‌లో చూద్దాం.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

గురువారం నాడు బిగ్‌బాస్ 10 హౌస్‌లోని రెండు టీమ్స్ మధ్య టాస్క్‌లు జరిగి భైరవ టీమ్(రెడ్ టీమ్) కెప్టెన్సీ టాస్క్‌లకు అర్హత సాధించింది. ఆరోవారం వరకు ఎవరి దగ్గర మూడు కత్తులు ఉంటే వాళ్లకు ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి అందరి మధ్య కత్తులు(డాగర్స్) గురించి డిస్కషన్ జరిగింది. మరోవైపు బిగ్‌బాస్ భైరవ టీమ్‌లో ఎవరైనా ఐదుగురు మాత్రమే కెప్టెన్సీ పోరులో పాల్గొనాలని చెప్పాడు. అమన్ కెప్టెన్ అవుతానంటే రోహిత్ వద్దన్నాడు. చాలాసేపు గొడవలు, డిస్కషన్స్ జరిగిన తర్వాత వర్షిణి, ఝాన్సీ, రాంప్రసాద్, అపూర్వ, అమన్.. కెప్టెన్సీ పోటీలకు సిద్ధమయ్యారు.

కెప్టెన్సీ కోసం 'పాత్ టూ పవర్' అనే పోటీని మూడు లెవల్స్‌లో పెట్టారు. చివరవరకు ఎవరు నిలిస్తే వాళ్లు కెప్టెన్ అవుతారు. ఒక కర్రతో పోల్స్‌కి వేలాడుతున్న బ్యాగ్స్‌ని కిందకు పడేసి అందులోని తాడులు తీసుకొని ఎదురుగానున్న డబ్బాలపై తాడుతో బ్రిడ్జ్ తయారుచేయాలి. ముందుగా వచ్చే ముగ్గురు తర్వాత దశకి వెళ్తారు. రెండో లెవల్‌లో తాడు‌పై బాల్స్ కదిలించి చేసే టాస్క్. అందులో ముందు చేసిన ఇద్దరు తర్వాత దశకి వెళ్తారు. చివరి లెవల్లో బిగ్‌బాస్ ముక్కలతో ఐ లోగో పూర్తిచేయాలి. ఎవరు మొదటగా చేస్తే వాళ్లు కెప్టెన్ అవుతారు.

(ఇదీ చదవండి: 'తెల్లకాగితం' సినిమా రివ్యూ)

అయితే ఈ గేమ్ అంతా ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగానే సాగింది. మొదటి దశలో అమన్, రాంప్రసాద్, ఝాన్సీ గెలవగా నెక్స్ట్ లెవల్‌కి అమన్, ఝాన్సీ వెళ్లారు. ఫైనల్‌గా అమన్ గెలిచాడు. కెప్టెన్ అయ్యాడు. ఝాన్సీ ఓడిపోయినందుకు ఏడ్చింది. అయితే వర్షిణి తన మ్యాజికల్ పవర్ వాడతానని బిగ్‌బాస్‌ని అడగ్గా ఓకే చెప్పి ఆమె తాళాలు పంపించాడు. వర్షిణి మ్యాజిక్ పవర్ ఏంటంటే ఎవరు గెలిస్తే వాళ్ల దగ్గరున్న శక్తిని తీసేసుకోవచ్చు. దీంతో వర్షిణి అమన్ కెప్టెన్సీ తీసుకుంది. ఇక కెప్టెన్ అయినందుకు ముకేశ్ కాళ్లు పట్టుకొని తనని ఆశీర్వదించమంది. 

ఇక డాగార్లు(కత్తులు) ఉన్నవాళ్లకే ఇమ్యూనిటీ ఛాలెంజ్‌లో పాల్గొనే అవకాశముందని బిగ్‌బాస్ చెప్పాడు. తర్వాత ఇమ్యూనిటీ గేమ్ పెట్టాడు.  డాగార్లు ఉన్నోళ్ల ఫొటోలు ముందు పెట్టి రెండు లేదా ఎక్కువ డాగర్స్ ఉన్నవాళ్లు ఎవరు ఇమ్యూనిటీ ఇవ్వాలో నిర్ణయిస్తారని చెప్పాడు. దానికి ఓ టాస్క్ పెట్టాడు. మొదట సృష్టి.. వంశీ ఫోటో తీసేసి తన ఫొటో పెడతానంది. సుధీర్.. సృష్టి ఫొటో తీసేసాడు. ఝాన్సీ త్రిగున్ ఇమ్యూనిటీ తీసేసుకుంది. వంశీ.. చరణ్ ఇమ్యూనిటీ తీసుకున్నాడు. దీంతో ఫైనల్‌గా వంశీ, సుధీర్.. ఆరో వారానికి ఇమ్యూనిటీ పొందారు. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ బుగ్గ గిల్లిన అభిమాని.. వీడియో వైరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement