‘‘ప్రస్తుత సమాజంలో మహిళలు ఎంత పరిపూర్ణులైనప్పటికీ ప్రజలు ఆమెలో ఏదో ఒక లోపాన్ని వెతుకుతూనే ఉంటారు’’ అంటున్నారు కృతీ శెట్టి. ‘ఉప్పెన’తో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ ఆ తర్వాత పలు తెలుగు సినిమాలతో పాటు తమిళ్, మలయాళ చిత్రాల్లో నటించి, ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
‘‘సమాజంలో, వెండితెరపై పురుషులు తాము చేసే పనులకు పెద్దగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ వాళ్లను ప్రజలు ఇష్టపడుతుంటారు. అయితే ఒక మహిళ ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నప్పటికీ కొందరు ఎప్పుడూ ఆమెలో ఏదో ఒక లోపాన్ని వెతుకుతూనే ఉంటారు’’ అని కృతీ శెట్టి చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
వివాదాలకు దూరంగా ఉండే కృతి ఇప్పుడు ఎందుకు ఇలా పోస్ట్ చేశారు? ఇందుకు కారణం ఏమై ఉంటుంది? అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే... కృతీ శెట్టి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, కల్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న ‘జనవరి 12 విడుదల’లో కల్యాణ్ రామ్‌కి జోడీగా నటిస్తున్నారు. తమిళంలో ‘జీనీ’ చిత్రంలో నటిస్తున్నారు.


