‘మరకతమణి 2’ సినిమా చిత్రీకరణకు గుమ్మడికాయ కొట్టారు ఆది పినిశెట్టి. ఆయన హీరోగా సత్యరాజ్, ప్రియా భవానీశంకర్, నిక్కీ గల్రాణి పినిశెట్టి, మునీష్‌కాంత్, ఆనంద్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఏఆర్‌కే శరవణన్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా యూనిట్ గుమ్మడికాయ కొట్టింది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్స్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ట్రైలర్, విడుదల తేదీ గురించిన విషయాలను తెలియజేస్తామని యూనిట్ పేర్కొంది. ఇక ఆది పినిశెట్టి హీరోగా ఏఆర్‌కే శరవణన్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘మరకతమణి’ (తమిళంలో ‘మరగద నాణ్యం’)కి సీక్వెల్‌గా ‘మరకతమణి 2’ రూపొందింది.


