టాలీవుడ్ బోల్డ్‌ మూవీ.. థియేటర్లకు ఆరుగురు ప్రతివ్రతలు | Aaruguru Pathivrathalu Movie Re Release In Theatres On This Date | Sakshi
Sakshi News home page

Aaruguru Pathivrathalu Movie: ఆరుగురు ప్రతివ్రతలు.. మరోసారి థియేటర్లో చూసే ఛాన్స్

Oct 2 2026 2:44 PM | Updated on Oct 2 2026 3:05 PM

Aaruguru Pathivrathalu Movie Re Release In Theatres On This Date

ఈవీవీ సత్యనారాయణ బోల్డ్ అండ్ రియలస్టిక్ కామెడీ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన మూవీ 'ఆరుగురు పతివ్రతలు'. దాదాపు 20 ఏళ్ల క్రితం థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీకి ఈవీవీ సత్యనారాయణ దర్శకనిర్మాతగా వ్యవహరించారు. పెళ్లి పేరిట జరిగే మోసాలు, వైవాహిక బంధంలో భార్యభర్తల మధ్య ఉండే ఈగోలు, రకరకాల పరిస్థితులు, మనస్పర్థలని బోల్డ్‌గా ఇందులో చూపించారు. ఇప్పుడు ఈ చిత్రం మరోసారి బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది.

ఈ చిత్రాన్ని మరోసారి బిగ్‌ స్క్రీన్‌పై చూసే అవకాశం కల్పించనున్నారు. ఈ నెల 29న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ షేర్ చేశారు మేకర్స్.

'ఆరుగురు పతివ్రతలు' కథేంటంటే..

పదో క్లాస్ కలిసి చదువుకున్న ఆరుగురు అమ్మాయిలు.. పెరిగి పెద్దయిన తర్వాత చాలా ఏళ్లకు ఓ పెళ్లి సందర్భంగా కలుస్తారు. అలా కలిసిన సందర్భంలో తమ పెళ్లి జీవితాల్లో ఎదుర్కొంటున్న కష్టసుఖాలు, భర్తల ప్రవర్తన గురించి ఒకరికొకరు పంచుకుంటారు. అయితే భర్తలని అర్థం చేసుకోవడంలో భార్యల ఆలోచనలు ఎలా ఉంటాయి? భర్తల అనుమాన స్వభావం వల్ల వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి? ‍అనే అంశాలే స్టోరీ.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement