ఆమె ఒక రాణి.. ఓ యువరాజుని పెంచారు: ‍జ్యోతిక | Jyotika Speech About Surya Mother Lakshmi Viral News | Sakshi
Sakshi News home page

Jyotika: మళ్లీ ట్రెండింగ్‌లో జ్యోతిక.. అత్తపై కామెంట్స్ వైరల్

Oct 2 2026 1:41 PM | Updated on Oct 2 2026 1:45 PM

Jyotika Speech About Surya Mother Lakshmi Viral News

సెలబ్రిటీ జంటలు అనగానే చాలామందికి మొదటగా గుర్తొచ్చేది సూర్య-జ్యోతికనే. ఎందుకంటే కలిసి సినిమాలు చేశారు. ప్రేమలో పడ్డారు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పిల్లల్ని కన్నారు. వాళ్లని పెంచి పెద్దచేశారు. ఇప్పుడు కెరీర్ పరంగా ఇద్దరూ బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా తమ బంధానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తమ పిల్లల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు. సూర్య తండ్రి శివకుమార్ చెప్పిన కొన్ని విషయాల వల్ల జ్యోతిక మళ్లీ వార్తల్లో నిలిచింది. అలానే ఈమెకు అత్త లక్ష్మి(సూర్య తల్లి)తో ఉన్న బాండింగ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత జ్యోతిక నా కొడుకుని తీసుకెళ్లిపోయి ఉండొచ్చు కానీ)

2017లో ఓ అవార్డ్ వేడుకలో పాల్గొన్న జ్యోతిక.. తన అత్త, సూర్య తల్లి లక్ష్మీ శివకుమార్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సంప్రదాయాలు, విలువలను నేర్పడంతో పాటు కుటుంబం, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో అత్తయ్య నాకు ఎంతో సహాయపడ్డారు.ఆమె ఒక రాణి. ఒక యువరాజును పెంచారు. ఆయన(సూర్య) నా ప్రతి నిర్ణయానికి, నేను చేసే ప్రతిపనికి అండగా నిలుస్తారు. నేను ఈ రోజు ఇక్కడ ఉండటానికి ఆయన ఇచ్చే మద్దతు ఒక కారణం. ఆయనను ఇలా తీర్చిదిద్దినందుకు నా అత్తకు ధన్యవాదాలు' అని జ్యోతిక.. సూర్య తల్లి గురించి ఎవరికీ తెలియని సంగతులు చెప్పి ఆకాశానికెత్తేసింది.

జ్యోతిక గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు మళ్లీ వైరల్ కావడానికి ఓ కారణముంది. కొన్నాళ్ల క్రితం ఈమె.. తన పిల్లల్ని తీసుకుని ముంబైకి షిఫ్ట్ అయిపోయింది. ఆ సందర్భంగా జ్యోతిక గురించి రకరకాల రూమర్స్ వినిపించాయి. అత్త-మామలతో గొడవ జరిగిందని, అందుకే విడిపోయి వెళ్లిపోయిందని మాట్లాడుకున్నారు. కానీ ఈమెకు సూర్య తల్లిదండ్రులతో ఉన్న బాండింగ్.. వాళ్ల గురించి ఈమె, ఈమె గురించి వాళ్లు చెబుతున్నా మాటలు వింటే ఇంట్రెస్టింగ్‌ అనిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: 'తెల్లకాగితం' సినిమా రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement