సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్-2’. 2023లో విడుదలైన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ మూవీలోని ఐటమ్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ తన డ్యాన్స్‌తో అలరించింది. బిందాస్ అంటూ సాగే ఈ పాటలో తన స్టెప్పులతో ఆకట్టుకుంది. ఈ పాటను అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్‌కు సూపర్ సుబ్బు లిరిక్స్ అందించగా.. అనిరుధ్ రవిచందర్, దీప్తి సురేశ్ ఆలపించారు. కాగా ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, విద్యా బాలన్, హృతిక్ రోషన్, రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు.


