ఓటీటీలో కాజల్ అగర్వాల్‌ కోర్ట్ థ్రిల్లర్‌.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Kajal Aggarwal Latest Movie The India story Also Streaming In Telugu | Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: ఓటీటీలో కాజల్ అగర్వాల్‌ కోర్ట్ థ్రిల్లర్‌.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Sep 30 2026 6:24 PM | Updated on Sep 30 2026 6:24 PM

Kajal Aggarwal Latest Movie The India story Also Streaming In Telugu

కాజల్ అగర్వాల్ లీడ్‌ రోల్లో వచ్చిన మేసేజ్ ఓరియంటేడ్‌ మూవీ  ద ఇండియా స్టోరీ. ఈ చిత్రంలో శ్రేయాస్‌ తల్పాడే కీలకపాత్ర పోషించారు. కల్తీ కాన్సెప్ట్‌తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చేతన్‌ డీకే దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 24న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో విఫలమైంది.

ఈ మూవీ సెప్టెంబర్ 18న ఓటీటీకి వచ్చేసింది. జియో హాట్‌స్టార్ వేదికగా హిందీలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచే తెలుగు వర్షన్ కూడా ఓటీటీలో అలరిస్తోంది.

(ఇది చదవండి: సరికొత్త ఓటీటీ ఫ్లాట్‌ఫామ్.. ఉచితంగానే మలయాళ థ్రిల్లర్‌ మూవీస్..!)

ది ఇండియా స్టోరీ కథేంటంటే..

దేశ సరిహద్దుల్లో సైనికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి ఏడేళ్ల కూతురు క్యాన్సర్‌తో చనిపోతుంది. అయితే తన కుమార్తెని అన్యాయంగా చంపేశారని చెప్పి సదరు తండ్రి.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడు. ఓ లాయర్‌తో కలిసి క్రిమి సంహారకాలు తయారు చేసే కంపెనీలు, కల్తీ చేసే సంస్థలపై పోరాటానికి దిగుతాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? ఓ మహిళా లాయర్‌తో కలిసి ఏం చేశాడు? రైతులు వీళ్లిద్దరిపై ఎందుకు తిరగబడ్డారు? అనేదే స్టోరీ.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement