టాలీవుడ్ హీరో నాని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ తర్వాత టీమ్ అంతా కలిసి విజయవాడకు వెళ్లారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. నానికి వేదపండితులు ఆశీర్వచనం చేసి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా.. నాని హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా రాణిస్తోంది. ఇప్పటికే రూ.200 కోట్లకు చేరువలో ఉంది. తొలి రోజే ఏకంగా రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీ ది ప్యారడైజ్ నిలిచింది. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రలు పోషించారు.
Natural Star @NameisNani took the divine blessings at the Kanaka Durga Temple in Vijayawada ❤🔥
Book your tickets for #TheParadise now!
🎟️ https://t.co/QWwS4Ichic pic.twitter.com/0nLeH28Rka— THE PARADISE (@TheParadiseOffl) September 30, 2026


