తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తొలి రియాలిటీ గేమ్ షో ‘ది ట్రైటర్స్ తెలుగు’ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ షో నాలుగు వారాల పాటు తెలుగు భాషలో ఇంగ్లిష్ సబ్ టైటిల్స్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అక్టోబరు 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. పది ఎపిసోడ్స్‌తో రూపొందుతున్న ఈ సిరీస్‌లో విభిన్న రంగాలకు చెందిన 20 మంది ప్రముఖులు పాల్గొంటారు.
ఎస్‌ఓఎల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘ది ట్రైటర్స్’ గేమ్ షో అనౌన్స్‌మెంట్ వీడియోను మంగళవారం మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ‘ఒక్కటి మాత్రం పక్కా... ఇక్కడ అందరూ మోసపోతారు... మోసం కూడా చేస్తారు’, ‘ఒక్కర్ని చేస్తే మోసం... ఇద్దర్నీ చేస్తే... అందర్నీ చేస్తే... ఇట్స్ ఏ గేమ్’ అంటూ తేజ సజ్జా చెప్పిన సంభాషణలు ఈ వీడియోలో ఉన్నాయి.


