ఫహాద్ ఫాజిల్ హీరోగా రానున్న చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ యేలేటి దర్శకత్వం వహించారు. సారా పాలేకర్, సౌరభ్ సచ్దేవా కీలక పాత్రల్లో నటించారు. ఎస్.ఎస్.రాజమౌళి, కార్తికేయ నిర్మాణ భాగస్వామ్యంతో రూపొందించారు. ఈ సినిమా అక్టోబర్ 2న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీనికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ రోజు ( మంగళవారం)హైదరాబాద్‌లో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరయ్యారు. చాలా కాలం తర్వాత రావడంతో చిత్ర బృంద వినూత్నంగా ఏర్పాట్లు చేసింది. స్ట్రీన్‌పై ‘యమదొంగ’ సీన్‌ని రీక్రియేట్ చేసింది. ఒక్కసారిగా అలా ఎన్టీఆర్ రావడంతో ఈవెంట్‌లో ఎన్టీఆర్.. ఎన్టీఆర్ అంటూ అభిమానులు అంతా మార్మోగేలా అరిచారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి: కూతురు పుట్టినరోజు.. ఫొటోలు షేర్ చేసిన అల్లరి నరేశ్..
Tiger’s Goosebumps Entry🐯🔥#NTR pic.twitter.com/KCfoRUn2ya
— cinee worldd (@Cinee_Worldd) September 29, 2026


