AI కంపెనీలకు ఉర్వశి రౌతేలా టీమ్ వార్నింగ్! | Rs 7000 Crore Claim and Urvashi Rautela’s Team Warns AI Company | Sakshi
Sakshi News home page

AI కంపెనీలకు ఉర్వశి రౌతేలా టీమ్ వార్నింగ్!

Sep 29 2026 7:50 PM | Updated on Sep 29 2026 7:56 PM

Rs 7000 Crore Claim and Urvashi Rautela’s Team Warns AI Company

సినీ తారల ఫోటోలు, వీడియో క్లిప్స్ వంటి వాటిని కంపెనీలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సర్వ సాధారణం. దీనికోసం సెలబ్రిటీల అనుమతి తీసుకుంటారు. అయితే.. నటి ఉర్వశి రౌతేలా పేరు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా ఓ కంపెనీ ఉపయోగిస్తోందని ఆమె టీమ్ ఆరోపించింది. ఈ విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

రూ.7000 కోట్ల పరిహారం
ఉర్వశి టీమ్ తెలిపిన వివరాల ప్రకారం.. లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఓ కంపెనీ ఆమె పేరు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా ఉపయోగిస్తోంది. వీటి ద్వారా ఆ కంపెనీ భారీగా వాణిజ్య ప్రయోజనం పొందిందని టీమ్ ఆరోపించింది. ఈ వ్యవహారంలో నష్టపరిహారంగా ప్రస్తుతం రూ.7,000 కోట్లు ఇవ్వాలని వెల్లడించింది.

ఉర్వశి టీమ్ హెచ్చరిక
ఈ సందర్భంగా ఏఐ కంపెనీలకు కూడా ఉర్వశి టీమ్ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఎవరైనా ఏఐ కంపెనీని నడుపుకోవచ్చు, తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకోవచ్చు. కానీ ఉర్వశి పేరు, ఫొటోలు, వీడియోలు లేదా ఆమె గుర్తింపును అనుమతి లేకుండా తమ వ్యాపారంలో ఉపయోగించకూడదని తెలిపింది.

ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు, గొంతులను ఉపయోగించి కొత్త కంటెంట్ తయారు చేయడం సులభంగా మారింది. అయితే.. ఇలాంటి కంటెంట్‌ను అనుమతి లేకుండా వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం వల్ల న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

గతంలో ఇలా..
ఉర్వశి రౌతేలా గతంలో కూడా ఏఐ ద్వారా తయారు చేసిన ఓ ఫొటోపై స్పందించింది. ఆ ఫొటోలో ఆమె ఐశ్వర్యరాయ్ బచ్చన్, దీపికా పదుకొణె ముందు మోకాళ్లపై ఉన్నట్లుగా చూపించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫొటోపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలను ఒకరితో ఒకరిని పోల్చుతూ ఇలాంటి కంటెంట్ తయారు చేయడం ఆపాలని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement