కార్పొరేట్‌ ట్యాక్స్‌ ఆడిట్‌ గడువు పెంపు | Corporate Tax Audit Deadline Extended | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ ట్యాక్స్‌ ఆడిట్‌ గడువు పెంపు

Sep 29 2026 7:30 PM | Updated on Sep 29 2026 7:30 PM

Corporate Tax Audit Deadline Extended

కంపెనీలు ఐటీఆర్‌ ఫైలింగ్‌తోపాటు.. ఆడిట్‌ రిపోర్ట్‌ దాఖలు చేసేందుకు ఆదాయపన్ను శాఖ తాజాగా 21 రోజుల అదనపు గడువును ఇచ్చింది. దీంతో 2026–27 అసెస్‌మెంట్‌ ఏడాదికిగాను కార్పొరేట్లకు నవంబర్‌ 21వరకూ గడువును పెంచింది. ప్రస్తుతం అక్టోబర్‌ 31లోగా ఐటీఆర్‌ ఫైలింగ్‌ చేయవలసి ఉంది. ఇదేవిధంగా ట్యాక్స్‌ ఆడిట్‌ రిపోర్ట్‌ దాఖలుకు సైతం సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్‌ 21కు గడువును పెంచింది.

ఐటీఆర్‌ ఫైలింగ్, ట్యాక్స్‌ ఆడిట్‌ నివేదిక దాఖలుకు అదనంగా మూడు వారాల గడువును ఇస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ(సీబీడీటీ) ఒక ప్రకటనలో పేర్కొంది. కార్పొరేట్‌ చట్టబద్ధ ఆడిట్‌ నివేదికసహా ఐటీఆర్‌ ఫైలింగ్‌కు ట్యాక్స్‌ ప్రాక్టీషనర్లు గడువు పెంచమంటూ కోరుతున్న నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ తాజాగా సడలింపులకు తెరతీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement