నాడు నోట్ల రద్దు.. నేడు ఓట్ల రద్దు: ఖర్గే ఫైర్‌ | Mallikarjun Kharge Comments In CWC meeting | Sakshi
Sakshi News home page

నాడు నోట్ల రద్దు.. నేడు ఓట్ల రద్దు: ఖర్గే ఫైర్‌

Sep 29 2026 1:46 PM | Updated on Sep 29 2026 2:46 PM

Mallikarjun Kharge Comments In CWC meeting

సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌.. ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో కీలుబొమ్మగా మారి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఖర్గే ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు వీధి పోరాటాల నుంచి పార్లమెంట్‌ వరకు పోరాడతామని స్పష్టం చేశారు.

గతంలో రాజీవ్‌ గాంధీ ఓటు హక్కును విస్తరించారని పేర్కొన్న ఖర్గే.. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ‘ఓటు రద్దు’ కుట్రలతో ప్రజల హక్కును లాక్కుంటోందని ఆరోపించారు. పదేళ్ల క్రితం ‘నోట్ల రద్దు’తో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని, ఇప్పుడు ‘ఓట్ల రద్దు’తో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే ప్రయత్నం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఫారమ్‌-6 నిబంధనలను అక్రమంగా మార్చడం ద్వారా ‘జెన్‌ జీ’ యువతను ఓటు హక్కుకు దూరం చేస్తున్నారని కూడా ఖర్గే ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్‌ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఓటర్ల జాబితాపై ఐదు డిమాండ్లు..
ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ CWC సమావేశంలో ఐదు కీలక డిమాండ్లతో తీర్మానం ప్రవేశపెట్టినట్లు కాంగ్రెస్‌ తెలిపింది. ఓటర్ల జాబితాలో చేపట్టే మార్పులకు సంబంధించిన డేటాను తక్షణమే బహిరంగపరచాలని డిమాండ్‌ చేసింది. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించే ముందు సంబంధిత ఓటర్లకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో పాటు.. అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పించాలని కోరింది. ఎన్నికల నిర్వహణలో తీవ్ర అక్రమాలు వెలుగుచూసిన ప్రాంతాల్లో స్వతంత్ర విచారణ జరిపించాలని సూచనలు చేసింది.

ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేశ్‌ ఎపిసోడ్‌.. ఇండియా కూటమి సంచలన నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement