breaking news
cec gyanesh kumar
-
మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్
-
ఢిల్లీలో వేడి పుట్టిస్తున్న ఓటు చోరీ రాజకీయం
-
కాసేపట్లో కాంగ్రెస్ మార్చ్.. ప్రతిపక్ష నేతలను కలవలేను: సీజేఐ
కాంగ్రెస్ మార్చ్ అప్డేట్స్..నాడు సైమన్ గోబ్యాక్.. నేడు సర్ గోబ్యాక్: రేవంత్ రెడ్డి. తెలంగాణ భవన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిమంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ, జిల్లాల అధ్యక్షులతో సమావేశమైన సీఎంకాంగ్రెస్ నిర్వహిస్తున్న మార్చ్, సర్ ప్రక్రియపై నేతలకు దిశా నిర్దేశంసీఎం రేవంత్ కామెంట్స్..సర్ వ్యతిరేక పోరాటం మరో స్వతంత్ర పోరాటమేసైమన్ గో బ్యాక్ పోరాటం లాగే పోరాటం చేయాలిఇప్పుడు సర్ గోబ్యాక్ అనాలి.రాజ్యాంగం ద్వారా ప్రతీ భారతీయుడికి ఓటు హక్కు వచ్చింది. అంబేద్కర్ ఎంతో అధ్యయనం చేసి ఓటు హక్కును రాజ్యాంగంలో చేర్చారు.రాజ్యాంగాన్ని ఆమోదించడం ద్వారా ఓటు హక్కు వచ్చింది.పరిపాలన చేయాల్సిన వాళ్లను ప్రజలే ఎన్నుకోవాలని అంబేద్కర్ నినదించారు.మంచి ఉద్దేశంతో మొదలైన సర్ ఇప్పుడు ఓటు హక్కు తొలగించేదిగా మారింది.మతాలు, ప్రాంతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోంది.దేశంలో ఓటు చోరీకి కుట్రలు జరుగుతున్నాయి.సీఈసీని అడ్డుపెట్టుకుని ఓట్లను తొలగిస్తున్నారు. ఓటు హక్కు కోసం పోరాటం: భట్టిఢిల్లీ భట్టి విక్రమార్క కామెంట్స్..రాహుల్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ నుంచి సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు .. ఢిల్లీకి వచ్చాంప్రజాస్వామ్యానికి బలమైన పునాది ఓటు హక్కుఓటు హక్కును చోరీ చేస్తున్నారుబీజేపీ మాత్రమే గెలిచేలా.. సర్ పేరుతో అక్రమాలు జరుగుతున్నాయికాంగ్రెస్ కోసం కాదు ఈ ఆందోళన..అందరి ఓటు హక్కును కాపాడటం కోసం మా పోరాటంప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం అందరూ ముందుకు రావాలిశాంతియుతంగా, గాంధేయ మార్గంలో మా ఆందోళన కొనసాగుతుందిపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్..సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించే వరకు ఆందోళన కొనసాగుతుందిమోదీ అమిత్ షా సర్‌ను వాడుకొని బీహార్ ఎన్నికల్లో గెలిచారుఅధికారంలో ఎప్పటికీ ఉండాలనే ఆకాంక్షతో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారుప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయిసీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లాల అధ్యక్షులు ఢిల్లీకి వచ్చాంసుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించే ప్రయత్నం చేస్తాంమంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్సర్ రద్దు చేయాలని రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పిలుపునిచ్చారుసర్ను ఉపయోగించుకొని బీజేపీ ఎన్నికలు నిర్వహించిందిఅర్హులైన ఓటర్లను తొలగించారుసీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందిఎన్నికల కార్యాలయం పక్షపాతంగా వెళ్తుందికేంద్ర ప్రభుత్వ తీరును ఖండిస్తున్నాంరాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, పిలుపుతో ప్రజాస్వామ్య గొంతును వినిపించేందుకు ఢిల్లీ వచ్చాముమా నిరసన తెలియజేస్తాం.కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ అపాయింట్మెంట్ తప్పిదంబీజేపీ కార్యకర్తగా ఎన్నికల కమిషనర్లు తీసుకువచ్చి కేంద్ర ఎన్నిక సంఘంలో కూర్చోబెట్టారు50 ఏళ్లు అధికారంలో ఉండాలనే పిచ్చి ఆలోచనతో బీజేపీ ఇలాంటి పనులు చేసిందిప్రజాస్వామ్యంలో ఓటును తొలగించడం తప్పజంతర్మంతర్ వద్ద పోలీసుల బందోబస్తుజంతర్మంతర్ వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది.కాంగ్రెస్ ర్యాలీ దృష్ట్యా అప్రమత్తమైన పోలీసులు, జంతర్‌మంతర్ సహా పలు ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.ర్యాలీకి కాంగ్రెస్ నిర్ణయంకన్నాట్ప్లేస్ నుంచి సుప్రీంకోర్టు వరకు ర్యాలీకి కాంగ్రెస్ నిర్ణయంమధ్యాహ్నం 1.30 గంటలకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బారాఖంబకు సమీపంలోని సాయంత్రం 4 గంటల వరకు పలు మెట్రో స్టేషన్లు మూసివేస్తూ ఆదేశాలు జారీచేశారు.కాంగ్రెస్‌కు నో చెప్పిన సీజేఐ..👉ఎన్నికల అక్రమాల ఆరోపణలపై వినతిపత్రం సమర్పించేందుకు సమావేశం కావాలన్న ఇండియా కూటమి నేతల అభ్యర్థనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తిరస్కరించారు. ఈ వ్యవహారం ఇప్పటికే న్యాయస్థానం విచారణ పరిధిలో ఉన్నందున పిటిషన్ దాఖలు చేసి కోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఓట్చోరీ, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా, ఎస్ఐఆర్ నిలిపివేత, భవిష్యత్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరపాలని కోరుతూ సీజేఐకి వినతిపత్రం ఇవ్వాలని ప్రతిపక్ష నేతలు భావించారు. అయితే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వారిని కలిసేందుకు తిరస్కరించారు. #WATCH | Delhi | On INDIA Bloc's protest march and their demand to meet him, Chief Justice of India (CJI) Justice Surya Kant says, "I received a letter yesterday regarding a meeting request, and I responded to it last night, outlining the reasons why I will be unable to meet..." He also says, "The Supreme Court's doors are open to everyone. Any petition from any common citizen or member of an elected body is welcome. Every Indian citizen has the right to approach the court, and we will hear their concerns and grant whatever is due under the law."— ANI (@ANI) October 12, 2026👉అయితే, సీజేఐ నిర్ణయాన్ని గౌరవిస్తూనే అక్టోబర్ 12న సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సూత్రాలను కాపాడటమే ఈ ఉద్యమ లక్ష్యమని తెలిపారు. ఈ మార్చ్ కేవలం ఒక ఆందోళన మాత్రమే కాదన్నారు. ఇది ఒక ఉద్యమంగా మారిందని తెలిపారు.👉దేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అందరికీ పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. తమ ప్రతినిధి బృందాన్ని కలవకూడదని సీజేఐ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షం గౌరవిస్తుందని అన్నారు. కానీ, సుప్రీంకోర్టుకు మార్చ్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.సీఈసీ రాజీనామా చేయాలి: శశిథరూర్👉ఎన్నికల సంఘం చట్టాలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. ఓటు హక్కు పౌరుల రాజ్యాంగ హక్కు అని, తమ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారం ప్రజలకు ఉండాలని అన్నారు. ఎన్నికల సంఘం నియంత్రణ తప్పినట్లుగా వ్యవహరిస్తోందని, నిబంధనలను పక్కనపెడుతోందని ఆయన విమర్శించారు. ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్ల మంది భారతీయుల పేర్లు తొలగించారంటూ ఆరోపించారు. సుప్రీంకోర్టు మార్చ్ ద్వారా న్యాయం కోరనున్నట్లు థరూర్ తెలిపారు. ఇదీ చదవండి: జ్ఞానేశ్‌పై మరో అస్త్రంతో ఇండియా కూటమి! -
గేమ్ ఆన్.. సినిమా స్టైల్ లో ప్రకాష్ రాజ్ ఛాలెంజ్
-
‘ఓట్ల చోరీ’ని రాష్ట్రపతి అంగీకరించారు
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అవకతవకలకు బాధ్యుడైన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విపక్ష ‘ఇండియా’ కూటమికి చెందిన 10 మంది నేతల బృందం విజ్ఞప్తి చేసింది. శుక్రవా రం రాష్ట్రపతి భవన్లో ఆమెను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించింది. దాదాపు గంటసేపు రాష్ట్రపతితో విపక్ష నేతలు సమావేశమయ్యారు. అంతకుముందు ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ భవనం నుంచి రాష్ట్రపతి భవన్ వైపు ర్యాలీగా వెళ్తుండగా విజయ్ చౌక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఎంపీలు అక్కడే బైఠాయించి నిరసన తెలపగా, 10 మందితో కూడిన బృందం మాత్రమే రాష్ట్రపతిని కలిసేందుకు అను మతి లభించింది. ముర్ముతో సమావేశం అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఓట్ల దొంగతనం, ఎన్నికల మోసంపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను రాష్ట్ర పతి ఏమాత్రం ఖండించలేదని, ప్రశ్నించలేదని చెప్పారు. తాము చెప్పిన విష యాన్ని ఆమె అంగీకరించడం షాక్‌కు గురిచేసిందని అన్నారు. సాక్ష్యాధారాలు సమర్పించాలని అమె కోరారని, ఈ విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ భారతదేశ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. తమ వ్యాఖ్యలను ఆమె వ్యతిరేకించలేదని అన్నారు. ఓట్ల చోరీ గురించి దేశమంతటా తెలుసని, సాక్ష్యాధారాలను రాష్ట్రపతికి సమర్పించడానికి ప్రతిపక్షం సిద్ధంగా ఉందని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. అన్ని అంశాలను పరిశీలించి, విచారణ జరుపుతానని రాష్ట్రపతి ముర్ము తమకు హామీ ఇచ్చారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తెలియజేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా చూడాలని రాష్ట్రపతిని కోరారు. నరేంద్ర మోదీ, అమిత్ షా దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. తమ ఆందోళనను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరిపి, తగిన చర్యలపై నిర్ణయం తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రపతిని కలిసిన విపక్ష బృందంలో రాహుల్, ఖర్గే, మమతా బెనర్జీ, ఎం.ఎ.బేబీ, డి.రాజా, రాజీవ్ రాయ్, సుప్రియా సూలే, ఒమర్ అబ్దుల్లా, మనోజ్ ఝా, తిరుమావళవన్ తదితరులు ఉన్నారు.మోదీ సర్కార్‌ను తొలగించడమే పరిష్కారం రాష్ట్రపతిని కలవడానికి ముందు విపక్ష ఎంపీలు పార్లమెంట్‌లోని సెంట్రల్ హాల్లో భేటీ అయ్యారు. ఓట్ల చోరీపై ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి, జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించేలా ఒత్తిడి పెంచడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రతిపక్షాల నిరసనలు ప్రభుత్వ పునాదులను కదిలించాయని పేర్కొన్నారు. జ్ఞానేశ్ కుమార్ కంటే చాలా లోతైన సమస్య ఒకటి ఉందన్నారు. మోదీ ప్రభుత్వాన్ని తొలగించడమే దీనికి పరిష్కారమని ఉద్ఘాటించారు. వినతి పత్రంలో ఏముంది? రాష్ట్రపతికి సమర్పించిన వినతిపత్రంలో విపక్ష నేతలు పలు అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రపతి తన అధికారాన్ని ఉపయోగించి సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తప్పించాలని, ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని, గత రెండేళ్లలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలని కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లకు జీవితకాల రక్షణ కల్పించే 2023 నాటి చట్టాన్ని రద్దు చేయాలని విన్నవించారు. ఇకపై అన్ని ఎన్నికల్లోనూ పేపర్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ముసుగులో ఓటర్ల జాబితా నుండి అక్రమంగా తొలగించిన 13.3 కోట్ల మంది ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలని పేర్కొన్నారు. ఓట్ల చోరీకి సంబంధించి కచ్చితమైన ఆధారాలు లభించిన అసెంబ్లీ ఎన్నికలన్నింటినీ రద్దు చేయాలని స్పష్టంచేశారు. ఒకదాని తర్వాత మరొక ఎన్నికలో భారీ స్థాయిలో ఓట్ల దొంగతనం జరిగిందనడానికి తమ వద్ద తిరుగులేని ఆధారాలు ఉన్నాయని ప్రతిపక్ష కూటమి తేల్చిచెప్పింది. హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు. మరికొన్ని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ ఈవీఎంలు, ఓటర్ల జాబితాల విషయంలో గోల్మాల్ చేసిందని ధ్వజమెత్తారు. దేశంలో పట్టపగలే ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఓట్ల చోరీ అనేది దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న నేరమని ఉద్ఘాటించారు. ఈ నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుప్రీంకోర్టుకు బహిరంగంగానే అబద్ధాలు చెబుతూ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326లో పొందుపరిచిన ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది అని, ఎన్నికల కమిషన్ దానికి రాజ్యాంగబద్ధ సంరక్షకుడే తప్ప యజమాని కాదని స్పష్టం చేశారు. -
అక్టోబర్ 10 సీజేపీ నిరసన : షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఆందోళన చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP)కి ఎదురు దెబ్బ తగిలింది. శనివారం (అక్టోబర్ 10) ఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద నిర్వహించ తలపెట్టిన నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. తక్కువ సమయంలో దరఖాస్తు చేయడం, గతంలో ఇచ్చిన హామీలను ఉల్లంఘించడం,ప్రస్తుతం ఉన్న శాంతిభద్రతల పరిస్థితిని కారణంగా చూపుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నిరసన చేపట్టేందుకు అనుమతి కోరుతూ సీజేపీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్ దరఖాస్తు సమర్పించినట్లు జాయింట్ పోలీసు కమిషనర్ నూపుర్ ప్రసాద్ తెలిపారు.నిబంధనల ప్రకారం కనీసం 10 రోజుల ముందే సమాచారం ఇవ్వాల్సి ఉండగా, చాలా తక్కువ సమయంలో దరఖాస్తు చేశారని పోలీసులు వీరి దరఖాస్తును తిరస్కరించారు. పైగా గతంలో అనుమతి పొందిన నిరసనలసమయంలో చట్టపరమైన ఆదేశాలను, తన సొంత హామీలను పాటించడంలో విఫలమైందని పోలీసులు వాదిస్తున్నారు. దీనికి తోడు న్యూఢిల్లీ ప్రాంతంలో సెక్షన్ 163 అమలులో ఉంది. దీనిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు జంతర్ మంతర్ వద్ద ముందస్తు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించారు. అలాగే, శుక్రవారం రాత్రి నుండి న్యూఢిల్లీ జిల్లాలోని 57 మెట్రో స్టేషన్లలో ప్రవేశ, నిష్క్రమణ గేట్లను మూసివేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)ను పోలీసులు కోరారు.ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగం వద్దని నెలకు రూ. లక్ష సంపాదిస్తున్న బార్బర్గతంలో నీట్లో అక్రమాలు, విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో అప్పటి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున చేపట్టిన ఉద్యమానికి సీజేపీ అనుమతినిచ్చిన ఢిల్లీ పోలీసులు తాజా నిరసనకు అనుమతిని నిరాకరించడం గమనార్హం. కాగా జంతర్ మంతర్ వద్ద తన కార్యక్రమానికి ప్రజలు ఎవరూ హాజరుకావద్దంటూ ఢిల్లీ పోలీసులు పిలుపు ఇవ్వడంపై సీజేపీ మండిపడింది. ఢిల్లీ పోలీసుల ధర్నాకు రావొద్దంటూ పిలుపు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమంటూ సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఇటీవల ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: 5 కాసుల గోల్డ్ చైన్ కొట్టేసింది : యూట్యూబర్ మధుమితపై కేసు -
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిగిపోవాల్సిందే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ‘సర్’(SIR) ప్రక్రియపై నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. భారత రాజ్యాంగం కంటే ఎవరూ గొప్పవారు కాదని, ఏ భారత పౌరుడి ఓటు హక్కును తొలగించలేరని పేర్కొన్నారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఏ వ్యక్తి కూడా వ్యవస్థ కంటే గొప్పవారు కాదని పేర్కొన్నారు. ఎంతోమంది వ్యక్తులు వచ్చి వెళ్లినా భారతదేశం తన బలాన్ని నిలబెట్టుకుందని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు ఒక్క వ్యక్తిని కాపాడేందుకు ఎందుకంత ఆరాటమని ప్రశ్నించారు. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఒక వ్యక్తి ఎలా గొప్పవాడవుతారని నిలదీశారు.SIR ప్రక్రియలో చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న అక్రమాలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని కేటీఆర్ కోరారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలను అడ్డుకోవాలని తన ట్వీట్లో పేర్కొన్నారు.Nothing is greater than the Constitution of India. And no indian citizen can be stripped of their right to vote Gyanesh Kumar must go! No individual is above the institution This nation has seen many individuals come and go -and it has stayed strong, it has survived beautifully. So why this desperation to protect one man? How can one man be greater than the rights of 1.4 billion Indians? Time's up for Gyanesh Kumar and for anyone trying to build a quasi-system that destroys the soul of this great nation We the BRS party reiterate our demand that Supreme Court needs to to take suo moto cognisance of the irregularities in SIR process and order an independent investigation headed by a sitting judge Jai Telangana Jai Hind— KTR (@KTRBRS) October 9, 2026ఇదీ చదవండి: సౌదీలో హైటెన్షన్.. భారతీయులకు బిగ్ అలర్ట్ -
జగ్గారెడ్డి దీక్ష.. రాజీనామా చేసే వరకు నా పోరాటం ఆగదు
-
రాహుల్ కొత్త పొలిటికల్ స్ట్రాటజీ.. మొండితనమా.. వ్యూహమా?
ఊహించని చోట ప్రత్యక్షం.. చెప్పాపెట్టకుండా నిరసన.. పోలీసుల అడ్డంకులను లెక్కచేయకుండా ముందుకు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ శైలిలో ఈ తరహా ‘సర్ప్రైజ్ పాలిటిక్స్’ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరించడం కంటే.. చిన్న బృందంతోనే నేరుగా రంగంలోకి దిగుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఇటీవలి కాలంలో మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రాహుల్ ఆకస్మిక నిరసనలు, అనూహ్య మార్చ్‌లు, ముందస్తు సమాచారం లేకుండా కీలక ప్రాంతాలకు వెళ్లడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. కొన్నిసార్లు ఒంటరిగానే.. మరికొన్ని సందర్భాల్లో ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి రోడ్డెక్కుతున్నారు. దీంతో రాహుల్ రాజకీయ వ్యూహంపై చర్చ మొదలైంది.మొండితనమా.. వ్యూహమా?ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితా సవరణ అంశంపై తాజాగా ఇండియా కూటమి ఆందోళనలు ఉధృతమయ్యాయి. బుధవారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నేతలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేయగా.. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రోజు కూడా ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్ చేపట్టి.. ఆకాశవాణి భవన్ వద్ద దాదాపు ఎనిమిది గంటల పాటు నిరసన తెలిపారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గురువారం మరింత పెద్ద ఎత్తున నిరసన చేపట్టాలని కూటమి నిర్ణయించింది.రాహుల్‌కు కొత్తేమీ కాదు..అయితే ఈ తరహా రాజకీయ శైలి రాహుల్‌కు ఇప్పుడే కొత్తగా వచ్చింది కాదు. భట్టా-పార్సౌల్ రైతుల ఆందోళన సమయంలోనూ ఆయన మోటార్ సైకిల్‌పై అక్కడికి వెళ్లి రైతులను కలిశారు. మార్షల్ ఆర్ట్స్‌పై ఆసక్తి ఉన్న రాహుల్.. భారత్ జోడో యాత్ర సమయంలోనూ యాత్రికులతో కలిసి శిక్షణ తీసుకున్నారు. వీధి నిరసనల్లో గంటల తరబడి నడవడం, బైఠాయించడం, పోలీసుల అడ్డంకులను ఎదుర్కోవడంలో ఆయన ఫిట్నెస్ కూడా కనిపిస్తోంది.మరోవైపు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేందుకు కూడా ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది. 15 మంది నేతలతో కూడిన ప్రతినిధి బృందానికి సమయం కోరగా.. 10 మందికి అనుమతి లభించినట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్య రాహుల్ గాంధీ ‘సడెన్ యాక్షన్’ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహమా? అన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: ఎలాన్ మస్క్‌కు కేటీఆర్ సూటి ప్రశ్న -
బారికేడ్లు ఎక్కిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష ఇండి కూటమి ఎంపీలు చేపట్టిన నిరసనలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్లిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు.పార్లమెంట్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, ఎన్సీపీ-ఎస్పీ ఎంపీ సుప్రియా సూలే సహా పలువురు ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. ఎంపీలు చేతుల్లో జ్ఞానేశ్ కుమార్ చిత్రాలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ‘‘ఓటు దొంగలారా.. పదవి వదిలేయండి’’ అంటూ నినాదాలు చేశారు. నితి ఆయోగ్ కార్యాలయం సమీపంలో భారీ ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు.బారికేడ్‌పైకి ఎక్కి త్రివర్ణ పతాకాన్ని ఊపి.. ఈ సమయంలో రాహుల్ గాంధీ బారికేడ్‌పైకి ఎక్కి త్రివర్ణ పతాకాన్ని ఊపారు. అనంతరం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ కూడా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లపైకి ఎక్కారు. పోలీసులు ప్రియాంక గాంధీని నిర్బంధించేందుకు బస్సులోకి తీసుకెళ్లగా, ఆమె కొద్దిసేపటికే బస్సు నుంచి దిగి రాహుల్ గాంధీతో కలిసి ఆకాశవాణి భవన్ గేటు వద్దకు చేరుకున్నారు.రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా మరికొందరితో కలిసి ఆకాశవాణి భవన్ స్వాగత ద్వారం నుంచి ప్రాంగణంలోకి ప్రవేశించారు. అనంతరం వారు అక్కడ చెట్టు కింద కూర్చున్నారు. మరోవైపు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా పలువురు ప్రతిపక్ష నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎస్ఐఆర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎస్ఐఆర్లో తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలని, ప్రక్రియను రద్దు చేయాలని కూడా కోరుతున్నాయి. ఫారమ్-6లో మార్పులపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ రాజకీయ వివాదాన్ని మరింత తీవ్రం చేశాయి. ఎన్నికల సంఘం మాత్రం ఎస్ఐఆర్కు సంబంధించిన నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని చెబుతోంది.రాహుల్ గాంధీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘నరేంద్ర మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్ ‘ఓటు చోరీ’ ద్వారా దేశాన్ని హైజాక్ చేశారు. జ్ఞానేశ్ కుమార్ వారికి సహకరించారు. ఇది దేశద్రోహం. ఎవరూ తప్పించుకోలేరు. సుమారు 300 మంది ఎంపీలు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లను కలవాలనుకున్నారు. ఇదీ చదవండి: స్మిట్ మచ్చార్ పుర్రెకు ఫ్రాక్చర్, మెమరీ లాస్, చూపు దెబ్బతిని..కానీ, పోలీసులు మమ్మల్ని ఇక్కడే ఆపేశారు. మేము ఎన్నికైన ప్రజా ప్రతినిధులం. అయినా మమ్మల్ని ఎందుకు ఆపారో తెలియడం లేదు. ఎన్నికల కమిషన్ కేవలం 50 మీటర్ల దూరంలో ఉండగా ఏమైందో అర్థం కావడం లేదు. దేశంలో ఏమి జరుగుతోంది? ఎన్నికల కమిషన్ ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కలవకపోతే ప్రజాస్వామ్యం అంటే ఏమిటి?” అని అన్నారు. VIDEO | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi climbs atop the barricades during the INDIA bloc MPs' march from Parliament to the ECI, demanding CEC Gyanesh Kumar's resignation. (Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) https://t.co/YkwlFV8WCn— Press Trust of India (@PTI_News) October 6, 2026 -
ఇండి కూటమి మార్చ్.. ఢిల్లీలో హై టెన్పన్
-
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను సస్పెండ్ పై సుప్రీంకోర్టు షాక్
-
నేడు సీఈసీ జ్ఞానేశ్‌పై విచారణ.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ!
సాక్షి, ఢిల్లీ: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్నికల సంఘం నిర్ణయాలు, ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో తీసుకున్న చర్యలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది.పిటిషనర్ల ప్రధాన ఆరోపణ ఏమిటంటే.. ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండానే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని.. SIR ప్రక్రియకు సంబంధించి ఇలాంటి నిర్ణయాలు సుమారు 14 వరకు తీసుకున్నట్లు పిటిషన్లలో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మాత్రం తమ నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టు ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ధారణకు రాలేదు.సిట్ కోసం డిమాండ్.. అంతేకాకుండా.. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని కూడా పిటిషనర్లు కోరారు. SIR సందర్భంగా ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు, ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వివాదాస్పదంగా పేర్కొన్న 14 నిర్ణయాలను రద్దు చేయాలని, సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ విధులు నిర్వహించకుండా తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా పిటిషన్లలో కోరారు.ఇదిలా ఉండగా.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు, పలు సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై సహా పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర ప్రతిపక్ష పార్టీలు సైతం సీఈసీ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. అక్టోబర్ 7న ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద సంయుక్త నిరసనకు కూడా ఇండియా కూటమి పిలుపునిచ్చింది.మరోవైపు.. ఎన్నికల సంఘం మాత్రం SIRకు సంబంధించిన నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని చెబుతోంది. ఈ నేపథ్యంలో సీఈసీ నిర్ణయాల చట్టబద్ధత, ఎన్నికల సంఘం అంతర్గత నిర్ణయ ప్రక్రియ, SIRపై వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ కీలకంగా మారింది. అయితే పిటిషన్లలో చేసిన ఆరోపణలు ప్రస్తుతం ఆరోపణల స్థాయిలోనే ఉన్నాయని, వాటిపై కోర్టు తుది నిర్ణయం ఇవ్వాల్సి ఉంది.ఇదీ చదవండి: బెంగాల్లో ట్విస్ట్.. తిరుగుబాటు నేతలకు మమత గట్టి వార్నింగ్ -
నాడు నోట్ల రద్దు.. నేడు ఓట్ల రద్దు: ఖర్గే ఫైర్
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్.. ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో కీలుబొమ్మగా మారి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఖర్గే ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు వీధి పోరాటాల నుంచి పార్లమెంట్ వరకు పోరాడతామని స్పష్టం చేశారు.గతంలో రాజీవ్ గాంధీ ఓటు హక్కును విస్తరించారని పేర్కొన్న ఖర్గే.. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ‘ఓటు రద్దు’ కుట్రలతో ప్రజల హక్కును లాక్కుంటోందని ఆరోపించారు. పదేళ్ల క్రితం ‘నోట్ల రద్దు’తో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని, ఇప్పుడు ‘ఓట్ల రద్దు’తో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే ప్రయత్నం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఫారమ్-6 నిబంధనలను అక్రమంగా మార్చడం ద్వారా ‘జెన్ జీ’ యువతను ఓటు హక్కుకు దూరం చేస్తున్నారని కూడా ఖర్గే ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.News Alert! Political parties must be provided with electoral rolls, relevant data in simple format, in a timely manner: Kharge.News Alert! Independent, time-bound inquiry must be conducted wherever evidence of serious discrepancies emerge: Kharge.News Alert! Kharge seeks… pic.twitter.com/m9kMBUFpyf— Press Trust of India (@PTI_News) September 29, 2026ఓటర్ల జాబితాపై ఐదు డిమాండ్లు..ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ CWC సమావేశంలో ఐదు కీలక డిమాండ్లతో తీర్మానం ప్రవేశపెట్టినట్లు కాంగ్రెస్ తెలిపింది. ఓటర్ల జాబితాలో చేపట్టే మార్పులకు సంబంధించిన డేటాను తక్షణమే బహిరంగపరచాలని డిమాండ్ చేసింది. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించే ముందు సంబంధిత ఓటర్లకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో పాటు.. అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించాలని కోరింది. ఎన్నికల నిర్వహణలో తీవ్ర అక్రమాలు వెలుగుచూసిన ప్రాంతాల్లో స్వతంత్ర విచారణ జరిపించాలని సూచనలు చేసింది.ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేశ్ ఎపిసోడ్.. ఇండియా కూటమి సంచలన నిర్ణయం -
జ్ఞానేశ్ కుమార్‌పై ఆరోపణలు.. థామ్సన్‌కు బీజేపీ నేత కౌంటర్
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై మాజీ కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీజీ థామ్సన్ చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయాలని, గెలిస్తే కేంద్ర మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉందని జ్ఞానేశ్ కుమార్ తనకు సూచించారని థామ్సన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ నేత జోసెఫ్ స్పందించారు. 2017లోనే థామ్సన్ బీజేపీ నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారని, ఆ కార్యక్రమానికి తానే ఆయనను ఆహ్వానించానని జోసెఫ్ వెల్లడించారు.థామ్సన్ ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న సమయంలో విమాన ప్రయాణంలో జ్ఞానేశ్ కుమార్ తనను కలిశారని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేయాలని ఆయన సూచించినట్లు తెలిపారు. కేరళలోని పతనంతిట్ట నుంచి పోటీ చేసి గెలిస్తే ఎంపీగా, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా అవకాశం లభిస్తుందని చెప్పినట్లు థామ్సన్ పేర్కొన్నారు. అయితే తాను ఆ ప్రతిపాదనను అంగీకరించలేదని తెలిపారు.థామ్సన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేత జోసెఫ్ ఫేస్బుక్ ద్వారా థామ్సన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సాధారణంగా రాజకీయ కార్యకర్తలు తమ మధ్య జరిగిన వ్యక్తిగత చర్చలు, సమావేశాల వివరాలను బహిరంగంగా వెల్లడించరని.. అయితే థామ్సన్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో తాను ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోందని పేర్కొన్నారు. 2017లో తాను బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సంఘ్ పరివార్‌కు చెందిన ఓ సీనియర్ నేత తనను సంప్రదించారని జోసెఫ్ తెలిపారు. థామ్సన్‌ను కొచ్చిలో నిర్వహించనున్న మైనారిటీ మోర్చా కార్యక్రమానికి ఆహ్వానించాలని ఆ నేత తనను కోరినట్లు చెప్పారు. థామ్సన్ తమతో కలిసి రావడానికి ఆసక్తి చూపుతున్నారని కూడా అప్పట్లో తనకు చెప్పినట్లు జోసెఫ్ పేర్కొన్నారు.2017 జూన్ 26న మార్ క్రిసోస్టమ్ను సన్మానించేందుకు నిర్వహించిన కార్యక్రమానికి థామ్సన్ హాజరయ్యారని జోసెఫ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను కూడా ఆయన తన ఫేస్బుక్ పోస్టులో పెట్టారు. వాటిలో థామ్సన్ వేదికపై ఉండటంతో పాటు ప్రసంగిస్తున్న దృశ్యాలు ఉన్నాయని చెప్పారు. అప్పటి యూడీఎఫ్ నేత, మాజీ మంత్రి కేఎం మాణి కూడా కార్యక్రమంలో పాల్గొన్నట్లు జోసెఫ్ పేర్కొన్నారు. బీజేపీ కార్యక్రమానికి హాజరైన థామ్సన్ అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రశంసించారని జోసెఫ్ తెలిపారు. అనంతరం 2017 నుంచి 2020 వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో థామ్సన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అయితే జోసెఫ్ చేసిన ఈ ఆరోపణలకు థామ్సన్ నుంచి ఇప్పటివరకు స్పందన రాలేదు. అలాగే థామ్సన్ చేసిన బీజేపీ టికెట్ ఆఫర్ ఆరోపణలపై జ్ఞానేశ్ కుమార్ కూడా బహిరంగంగా స్పందించలేదు.ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన పెను ప్రమాదం -
నన్ను బీజేపీ తరఫున పోటీ చేయాలని సూచించారు
న్యూఢిల్లీ: ఆరోపణల సుడిగుండంలో చిక్కుకున్న సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కేరళ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిజి థామ్సన్ సంచలన ఆరోపణలు చేశారు. 2016లో ఇద్దరూ ఐఏఎస్ అధికారులుగా కొనసాగుతున్న కాలంలో థామ్సన్, జ్ఞానేశ్ ఢిల్లీకి ఒక విమానంలో వెళ్లేటప్పుడు జరిగిన సంభాషణను థామ్సన్ గుర్తుచేసుకున్నారు. ‘‘ఐఏఎస్‌గా రిటైర్ అయ్యాక ఏం చేస్తావని జ్ఞానేశ్ అడిగారు. చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులపై పనిచేస్తా అని చెప్పా. అలా చేయొద్దు. మూడేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. కేరళలోని పత్తనంథిట్ట నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీచెయ్యి. గెలిస్తే మంత్రి కూడా అయిపోవచ్చు’’అని ఆయన సూచించారని థామ్సన్ తెలిపారు. తనకు రాజకీయాలు అంటే ఇష్టంలేదు అని ఆనాడే ఆయనకు చెప్పేశానని గుర్తుచేసుకున్నారు. ‘‘నేనైతే రిటైర్ అయ్యాక ఎంపీగా పోటీచేస్తా. గెలిస్తే కేంద్ర మంత్రిని అవుతా’’అని జ్ఞానేశ్ తనతో చెప్పారని థామ్సన్ వెల్లడించారు. థామ్సన్ 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. థామ్సన్ ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ స్పందించారు. ‘‘ఈ లెక్కన ఆనాడు ఐఏఎస్‌గా ఉన్న జ్ఞానేశ్‌ను బీజేపీ తమ తదుపరి ఎన్నికల అభ్యర్థుల రిక్రూట్ ప్రక్రియ కోసం ఉపయోగించుకుంది. అందుకు తమకు సాయపడిన జ్ఞానేశ్‌ను ఇప్పుడు సీఈసీ పదవిలో షా, మోదీ ద్వయం కూర్చోబెట్టారు. అలా భారత్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికలకు ఇన్చార్జ్గా మార్చేశారు’’అని ఆరోపించారు. థామ్సన్ 2024 జనవరిలో రిటైర్ అయ్యారు. -
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై టీఎంసీ ఎంపీ మహువా ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: భారత ఎన్నికల కమిషన్‌లో విబేధాలు, ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్లమెంట్ సభ్యురాలు మహువా మోయిత్రా, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌పై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విధానపరమైన ఉల్లంఘనలు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, ఓటర్ల జాబితాలను తారుమారు చేశారనే ఆరోపణలతో గురువారం అధికారికంగా ఫిర్యాదు చేశారు.అనంతరం మాట్లాడుతూ ఈ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ 'దొంగ' అని మండిపడ్డారు. అందుకే అతనిపై ఇక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. ఎన్నికల కమిషనర్లు తమ విధులను నిర్వర్తించేటప్పుడు సివిల్ మరియు క్రిమినల్ విచారణ నుండి మినహాయింపు పొందుతారని చెప్పే 2023 నాటి సీఈసీ, ఈసీ చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం, మినహాయింపు పొందుతున్నారని ఆరోపించారు. ఇదీ చదవండి: జీవిత ఖైదు : కాంబోడియా ప్రియురాలితో గ్యాంగ్‌స్టర్ పెళ్లికి పెరోల్Gyanesh Chor Kumar is a rogue agent who acted without consent of other 2 ECs. Disenfranchising genuine voters is not official duties. He cannot enjoy immunity. He needs to be prosecuted. Simple pic.twitter.com/CY8rES46Ki— Mahua Moitra (@MahuaMoitra) September 24, 2026 అంతేకాదు ఆయనొక ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని మహువా ఎక్స్‌లో ధ్వజమెత్తారు.ఇటీవలి నివేదికను ఉటంకిస్తూ, ఈసీఐలోనిఅంతర్గత విభేదాలు, నిర్ణయాలు ఏకాభిప్రాయంతో లేదా మెజారిటీతో కాకుండా ఏకపక్షంగా తీసుకుంటున్నారని చూపిస్తున్నాయని కృష్ణానగర్ ఎంపీ పేర్కొన్నారు. ఇదీ చదవండి: గ్రానైట్ బారన్, వీరమణి బాగోతం : మీడియా చేతికి షాకింగ్ వీడియోలు -
ఈసీపై దుమారం : కేటీఆర్ స్పందన
సాక్షి, హైదరాబాద్: SIR ప్రక్రియలోని లోపాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు (ECs) అభ్యంతరం వ్యక్తం చేశారంటూ 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్'లో వచ్చిన కథనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యవహారాన్ని సుమోటా తీసుకొని విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాత విచారణ జరిపే విశ్వసనీయత సుప్రీంకోర్టుకు తప్ప మరే ఇతర సంస్థకూ లేదని కేటీఆర్ పేర్కొన్నారు.ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం పనితీరు, విశ్వసనీయతపై తీవ్రమైన సంక్షోభం నెలకొందని కేటీఆర్ అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై అనేక ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయనా, తాజా వార్తలతో మరింత అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థపై వచ్చిన ఆరోపణలపై దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు తప్ప మరే ఇతర సంస్థపైనా నమ్మకం ఉంచలేమన్నారు. మాజీ ఎన్నికల కమిషనర్లు చెబుతున్న అంశాలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని, ఈ విషయంపై స్యూమోటో కింద విచారణ జరపాలన్నారు దీనివల్ల కొన్ని సమాధానాలు లభిస్తాయని, నిజం బయటపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేష్ కుమార్ జైలుకెళ్లాల్సిందే : సంజయ్ రౌత్ ఆగ్రహంకాగా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్నికల కమిషన్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూవచ్చిన నివేదిక ప్రకంపనలు రేపుతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలోప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై తక్షణమే చర్చలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.BRS Working President @KTRBRS key remarks on objections raised by two Election Commissioners over the SIR process.There is now a serious crisis of confidence in the functioning of the Election Commission.The objections reportedly raised by two Election Commissioners over the… pic.twitter.com/kj9YsDsam1— KTR Updates (@KTRMediaUpdates) September 23, 2026 -
సీఈసీ జ్ఞానేష్ కుమార్ జైలుకెళ్లాల్సిందే : సంజయ్ రౌత్ ఆగ్రహం
SIR row -CEC Gyanesh Kumar ఎన్నికల కమిషన్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకంపనలు రేపుతోంది. ఎస్ఐఆర్లో చాలా అవకతవకలున్నాయని ఇప్పటికే ప్రతిపక్షాలు మండిపడుతున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు పెద్ద దుమారాన్నే రాజేశాయి. తక్షణమే ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది.సంజయ్ రౌత్ ఆగ్రహంఎస్ఐఆర్ విషయంలో ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పట్టించుకోలేదని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించడంతో పాటు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రౌత్ డిమాండ్ చేశారు.10 నెలల్లో ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు (సుఖ్బీర్ సింధు సంధు, వివేక్ జోషి) 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, జ్ఞానేశ్ కుమార్ వాటిని పట్టించుకోలేదని ఓ మీడియా నివేదిక వెల్లడించింది. ఫారం-6 , ఇతర అంశాలపై వారు లేవనెత్తిన అభ్యంతరాలను విస్మరించి ముందుకు వెళ్లారని రౌత్ ఆరోపించారు.కఠిన చర్యలకు డిమాండ్జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే తొలగించి ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్రపతి జోక్యం చేసుకుని ఆయన్ను బర్తరఫ్ చేయాలని రౌత్ డిమాండ్ చేశారు.అమిత్ షా నంబర్ వన్ నేరస్థుడు. ప్రధాని దేశాన్ని కాపాడాలనుకుంటే, అమిత్ షాను మంత్రివర్గం నుండి తొలగించాలని రౌత్ చాలా తీవ్రంగా స్పందించారు. అంతేకాదు మోదీ చర్య తీసుకోకపోతే, మూడు రక్షణ దళాలకు అధిపతి అయిన రాష్ట్రపతిని జ్ఞానేష్ కుమార్‌ను తొలగించమని కోరుతాను. రాష్ట్రపతి కూడా చర్య తీసుకోకపోతే, అటువంటి 'హుకుమ్షాహోన్' (నిరంకుశ పాలకులు) నుండి దేశాన్ని రక్షించడానికి ఆర్మీ చీఫ్ ముందుకు రావాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం అంశంపై న్యాయవ్యవస్థ స్వయంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సంజయ్ రౌత్ కోరారు.ప్రతిపక్షాల ఆగ్రహం SIR ప్రక్రియతో బీజేపీ ఆటలాడుతోందని డీఎంకే అధికార ప్రతినిధి TKS ఎలాంగోవన్ బుధవారం మండిపడ్డారు. వారు ఈ దేశం నుండి ముస్లింలను తొలగించాలనుకుంటున్నారు. అదే వారి ఉద్దేశ్యం. వారు దీనిని హిందూ దేశంగా మార్చాలనుకుంటున్నారు, కానీ అది అసాధ్యం. ఎందుకంటే చట్టం ప్రకారం, ప్రజలు ఓటర్లుగా నమోదై చాలా కాలంగా ఇక్కడ నివసిస్తున్నారు, వారిని జీవించడానికి అనుమతించాలి. SIR ద్వారా ప్రభుత్వం వారి పేర్లను ఓటర్ల జాబితాల నుండి తొలగించలేదని విమర్శించారు. ఆ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీతో పాటు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ వివాదంపై స్పందించిన శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే కూడా ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈసీ ఒక పార్టీకి ఏజెంట్‌గా మారి భారతదేశాన్ని "ప్రపంచంలోనే అతిపెద్ద మాజీ ప్రజాస్వామ్య దేశంగా" మార్చిందని, లక్షలాది మంది భారతీయుల ఓటు హక్కును హరించివేసిందని మండిపడ్డారు. జ్ఞానేశ్ కుమార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే ఈ దేశద్రోహానికి పాల్పడ్డారని, పశ్చిమ బెంగాల్, బిహార్ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి ఈ కుట్రే కారణమని రౌత్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ సింఘ్వీ ఈ రోజు తర్వాత విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు.దీంతో మరింత చర్చకు దారి తీసే అవకాశం ఉంది. మరోవైపు ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) విషయంలో సభ్యుల మధ్య కీలక సమస్యలు ఉన్నాయని 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్'లో వచ్చిన కథనాన్ని ఖండిస్తూ భారత ఎన్నికల సంఘం (ECI) ఒక ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది కాలంలో తాము తీసుకున్న నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే జరిగాయని, ఏ సంస్థలోనైనా చర్చల సమయంలో భిన్నమైన అభిప్రాయాలు, పరిశీలనలు వ్యక్తమవ్వడం సహజమని స్పష్టం చేసింది. తుది నిర్ణయం తీసుకునే ముందు జరిగే నిర్ణయ-ప్రక్రియలో ఇదొక భాగం. కేవలం ఆ ముగ్గురు కమిషనర్లే కాకుండా, ఎన్నికల వ్యవస్థను మెరుగు పరచడానికి కమిషన్‌కు తమ సూచనలను అందించే పూర్తి అధికారం కమిషన్‌లోని ప్రతి అధికారికి ఉంటుంది ECI బుధవారం మధ్యాహ్నం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.ప్రస్తుతం ఎన్నికల సంఘంలో ముగ్గురు అత్యున్నత స్థాయి అధికారులు ఉన్నారు: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి. అయితే తమకు తెలియకుండానే ఎన్నికల సంఘం తీసుకున్న అనేక నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అధికారికంగా అభ్యంతరం వ్యక్తం చేశారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఇదీ చదవండి: 3 రోజుల సమ్మె : బ్యాంకులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు -
వైఫై, బ్లూటూత్, నెట్‌తో ఈవీఎంలను కనెక్ట్ చేయొచ్చా?
భారత ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) పూర్తి సురక్షితమైనవని, వాటికి ఎలాంటి వైఫై, బ్లూటూత్ లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదని కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. లఖ్‌నవూలోని కాళ్వీన్ తాలుక్దార్స్ కళాశాలలో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఈవీఎంలపై వచ్చే పలు అనుమానాలకు సమాధానమిస్తూ భారతదేశంలో ఉపయోగించే ఈవీఎంలను ప్రభుత్వ రంగ సంస్థలే తయారు చేస్తాయని వెల్లడించారు. ఇవి ఇతర వైర్లెస్ సాంకేతికతలతో అనుసంధానం కావు కాబట్టి వీటిని హ్యాక్ చేయడం లేదా ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని తెలిపారు.సోషల్ మీడియా ప్రచారాలపై అప్రమత్తతసామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందే సమాచారాన్ని గుడ్డిగా నమ్మవద్దని విద్యార్థులకు జ్ఞానేష్ కుమార్ సూచించారు. ఏ సమాచారాన్నైనా స్వీకరించే ముందు లేదా ఇతరులతో పంచుకునే ముందు దాని మూలం, ప్రామాణికతను తనిఖీ చేయడం ఎంతో అవసరమని అన్నారు. భారతదేశంలో సుమారు 100 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారని, ఇంత భారీ స్థాయిలో ఎన్నికలు నిర్వహించడం ఒక బృహత్తర కార్యమని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326ను ప్రస్తావిస్తూ, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువత భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ఆకాంక్షించారు.అమెరికా వంటి దేశాల్లో భారత ఓటింగ్ విధానం, ఓటరు గుర్తింపు కార్డుల నిర్వహణపై ఇటీవల ప్రశంసలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఈసీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికల విధానాలపై ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ ఓటింగ్ ఆధారాలపై ఓటర్లు అవగాహన పెంపొందించుకోవాలని పౌరులకు సూచించారు.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫామ్స్ నింపే నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందేనన్నారు. నామినేషన్ పత్రంలో ప్రతీ కాలమ్ భర్తీ చేయాలని ఎన్నికల నిబంధన ఉందన్నారు. కొన్నిసార్లు ఎన్నికల అధికారులు చూసి చూడనట్లు ఉన్నా.. రాజకీయ ప్రత్యర్థులు దాన్నే ఎత్తిచూపుతారు. ప్రత్యర్థులు ఫిర్యాదు చేయకపోతే పరిస్థితి మరోలా ఉండేదేమోనంటూ ఆయన వ్యాఖ్యానించారు.‘‘కోర్టు కేసు వివరాలు ఇవ్వాలని నటరాజన్‌కు సమయం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. ఒకసారి రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకున్న తర్వాత నా పరిధిలో ఉండదు. మీనాక్షి నటరాజన్ సుప్రీం కోర్టును వెళ్లినా.. కోర్టు సైతం ఆర్వో నిర్ణయాన్నే సమర్థించింది. సీఎం రేవంత్‌రెడ్డి రెండు ఓట్లు సర్ ప్రక్రియతో ఇక ఉండవు’’ అని సీఈసీ పేర్కొన్నారు.‘సర్’పై విమర్శల నేపథ్యంలో జ్ఞానేష్‌కుమార్ స్పందిస్తూ.. ‘‘ప్రపంచంలోనే ఫెడరల్ ఎలక్షన్ జరిగే దేశం ఇండియా. ప్రపంచంలోనే అత్యంత ఆర్గనైజేషన్ కలిగిన బాడీ ఎలక్షన్ కమిషన్. దేశంలో ఓటర్ల సంఖ్య ప్రతీ ఏడాది 8 కోట్ల వరకు మారుతుంది. 95 కోట్ల భారతీయ ఓటర్లకు నేను లీడర్ కావడం నాకు గర్వంగా ఉంది. దేశ వ్యాప్తంగా 12 లక్షల మంది బీఎల్వోలు పనిచేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగడానికి ప్రక్రియలో అందరూ ముఖ్యమే...ఎలక్షన్ కమిషన్ అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. మొన్న జరిగిన వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో 93.7 ఓటింగ్ శాతం ప్రపంచ రికార్డు సాధించాం. ఏఎస్ఎస్డీఎఫ్ ఓట్లను మాత్రమే ఎలక్షన్ కమిషన్ తొలగిస్తుంది. ‘సర్’ను ఇతర దేశాలను ఆదర్శనంగా తీసుకోబోయే రోజులు వస్తాయి. ప్రభుత్వ పథకాలకు ఓటర్ ఐడి కార్డు తప్పనిసరి అనే వార్తల్లో నిజం లేదు’’ అని సీఈసీ జ్ఞానేష్‌కుమార్ తెలిపారు.


