తల్లి, ఆమె బోయ్‌ఫ్రెండ్‌ హత్య: 18 ఏళ్ల యువతికి 50 ఏళ్ల జైలు శిక్ష | teen will spend 50 years behind bars for killing mother her boyfriend | Sakshi
Sakshi News home page

తల్లి, ఆమె బోయ్‌ఫ్రెండ్‌ హత్య: 18 ఏళ్ల యువతికి 50 ఏళ్ల జైలు శిక్ష

Sep 29 2026 7:18 PM | Updated on Sep 29 2026 7:33 PM

teen will spend 50 years behind bars for killing mother her boyfriend

2024లో ఫ్లోరిడాలోని పామ్ బేలో ఉన్న మెక్‌కోలమ్ ఇంట్లో జరిగిన జంట హత్యల కేసులో, ఒక టీనేజర్ 'ప్లీ డీల్' (నేరాంగీకార ఒప్పందం)  తరువాత జైలు శిక్ష ఖరారైంది. గత ఏడాది జూలైలో తన తల్లి, ఆమె ప్రియుడిని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన 18 ఏళ్ల ఫ్లోరిడా యువతి జూలియా గ్రేస్ ఎగ్లర్‌కు (Julia Grace Egler) రాష్ట్ర జైలులో 50 సంవత్సరాల శిక్ష  విధించారు.

ప్రాసిక్యూషన్‌ ప్రకారం బాధితులు 38 ఏళ్ల కెల్లీ మెక్‌కొల్లమ్, 22 ఏళ్ల మాథ్యూ స్జెజ్‌న్‌రోక్‌గా గుర్తించారు.తల్లి కెల్లీ మెక్‌కోలమ్, మాథ్యూ స్జెజ్న్రాక్ హత్య సమయానికి ఎగ్లర్‌ వయసు 16 ఏళ్లు.  ముందుగానే  కుట్ర పన్ని, హత్య చేసింది. ఆ దంపతులు ఇంటికి తిరిగి వచ్చే వరకు వేచి ఉండి, "వెల్కమ్ హోమ్" అంటూనే వారిపై కాల్పులు జరిపి చంపేసింది. ఆ తరువాత  దొంగతనం జరిగినట్లు నటించిందని ప్రాసిక్యూటర్లు తెలిపారు.

అసలు మొదటి డిగ్రీ హత్య అభియోగాలను తగ్గించిన ఒప్పందం ప్రకారం, ఆమె రెండో డిగ్రీ హత్య కింద రెండు కేసుల్లో తన నేరాన్ని అంగీకరించింది. చివరికి న్యాయమూర్తి ఆమెకు 50 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఇందులో ఆమె శిక్షను సమీక్షించు కోవడానికి ముందు కనీసం 25 సంవత్సరాలు తప్పనిసరిగా జైలు శిక్ష అనుభవించాలి, ఆ తర్వాత 20 సంవత్సరాల పాటు పర్యవేక్షక ప్రొబేషన్ (supervised probation) ఉంటుంది.2024లో కెల్లీ మెక్‌కోలమ్, మాథ్యూ స్జెజ్న్రాక్‌ల మరణాలకు సంబంధించి సెప్టెంబర్ 25న వెలువడిన తీర్పుతో ప్రాసిక్యూషన్ ప్రక్రియ అధికారికంగా ముగిసింది.

ఇదీ చదవండి: ఫేక్‌ ఎక్స్‌పీరియన్స్‌తో బురిడీ, నెలకు రూ. 2.80 లక్షలు..కట్‌ చేస్తే

ఎందుకు హత్యచేసింది

పామ్ బే పోలీసులు,  ప్రాసిక్యూటర్ల ప్రకారం,  స్జెజ్న్రాక్‌తో తన తల్లి సంబంధం పట్ల ఎగ్లర్ అసంతృప్తిగా ఉండేది. అలాగే ఎగ్లర్ జెండర్ ట్రాన్సిషన్ (లింగ మార్పిడి)  అమ్మాయినుంచి అబ్బాయిగా మారాలని అనుకుంది.  దీనిపై ఆమె తల్లి స్పందించిన తీరు చుట్టూ ఉన్న వివాదాలు కూడా ఈ కేసు నేపథ్యంతో ముడిపడి ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: రూ. 80 లక్షల నగలు, 28 డ్రెస్సులు, గ్రాండ్‌ వెడ్డింగ్‌ : కానీ సియా ప్లాన్‌..!

క్షమాపణ కోరిన యువతి 
విచారణ సందర్భంగా ఎగ్లర్ క్షమాపణ కోరింది.   తాను చేసిన హత్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని ఎగ్లర్ చెప్పింది. ఆ తుపాకి అనుకోకుండా అక్కడ ఉండటంతో  చిన్నపిల్లగా ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నానని తెలిపింది.  ఇది అనుకొని చేసిన  పనికాదు. దీనికి  ప్రతిరోజూ చింతిస్తున్నాను. పగలు, రాత్రి దుఃఖం నన్ను వెంటాడుతోంది. వాళ్ల ముఖాలే తనను పీడ కలలా వెంటాడుతున్నాయని వాపోయింది. భవిష్యత్తులో సమాజంలోకి తిరిగి వచ్చేందుకు ఒక అవకాశం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించింది. 

నేరాలు జరిగినప్పుడు ఎగ్లర్‌కు 16 ఏళ్లు  మాత్రమే కాబట్టి, ఆమె శిక్షను ఎప్పుడు సమీక్షించుకోవచ్చు అనే దానిపై ఈ శిక్షలో నిబంధనలు ఉన్నాయి. స్టేట్ అటార్నీ కార్యాలయం ప్రకారం, ఆమె తన శిక్షా సమీక్షకు అర్హత పొందే ముందు కనీసం 25 సంవత్సరాలు తప్పనిసరిగా జైలులో గడపాలి. జైలు శిక్ష పూర్తయిన తర్వాత, ఎగ్లర్ మానసిక ఆరోగ్య మూల్యాంకనానికి (mental-health evaluation) హాజరుకావాలి, 20 సంవత్సరాల పాటు పర్యవేక్షక ప్రొబేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: సియా మాజీ లవర్‌ వెలుగులోకి : ఫ్రెండ్‌ చెప్పిన షాకింగ్‌ విషయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement