బిహార్ మైనర్ బాలిక కేసులో ఊహించని ట్విస్ట్ | bihar groping accuseds arrest leads cops to his murderer father | Sakshi
Sakshi News home page

బిహార్ మైనర్ బాలిక కేసులో ఊహించని ట్విస్ట్

Sep 23 2026 8:18 PM | Updated on Sep 23 2026 8:53 PM

bihar groping accuseds arrest leads cops to his murderer father

పట్నా:  బిహార్‌ జముయీలో ఇటీవల మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ కేసు విచారణలో ఒక ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులు లోతైన విచారణ చేపట్టగా ప్రధాన నిందితుడైన నందన్ యాదవ్ తండ్రి, గత 23 ఏళ్లుగా పరారీలో ఉన్న నేరస్థుడని తెలిసింది. 23 ఏళ్ల క్రితం రెండు హత్యలు చేసి  నిందితుడు  పరారీలో ఉన్నాడు.  తాజాగా పోలీసులకు ఆ సమాచారం అందగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ఏం జరిగింది?
జముయీ జిల్లా ప్రతాప్‌పూర్ గ్రామంలో 2003, ఏప్రిల్ 3వ తేదీన వ్యాపార వివాదాల కారణంగా డి.పి. యాదవ్, పుణే యాదవ్ అనే ఇద్దరు సోదరులు దారుణంగా హత్యకు గురయ్యారు. బాధితుల తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గణోరి యాదవ్‌ను ఈ కేసులో నిందితుడిగా ఉ‍న్నాడు. అప్పటి నుండి గత రెండు దశాబ్దాలుగా పోలీసులకు దొరకకుండా  గణోరి యాదవ్‌ పరారీలో ఉన్నాడు, అయితే అతని కుమారుడి నేరంపై పోలీసులు విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈక్రమంలో పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. తాజాగా అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.

బాలికపై లైంగిక దాడి

కొద్దిరోజుల క్రితం  రోడ్డుపై వెళ్తున్న ఒక పదో తరగతి విద్యార్థిపై దాడి చేసి, అతనితో ఉన్న మైనర్ బాలికను వేధించారు. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసులో గణోరి యాదవ్ కుమారుడు నందన్ యాదవ్ అరెస్టయ్యాడు. అయితే, పోలీస్ కస్టడీ నుండి తప్పించుకోవడానికి నందన్ యాదవ్ ప్రయత్నించడంతో అతనిపై కాల్పులు జరిపారు. ఆ ఘటనలో అతని కాలుకు  గాయమైంది. ఈ బాలిక వేధింపుల కేసులో పోలీసులు ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.

లాయర్ల దాడి

అయితే ఈ కేసులో నిందిుతుడిగా ఉన్న హరేరామ్ యాదవ్ అనే వ్యక్తిపై కోర్టు ఆవరణలో లాయర్లు దాడి చేశారు. లాయర్లు కాక ముందు తామంతా మనుషులమని ఈ ఘటనతో జముయు ప్రాంతానికి దేశవ్యాప్తంగా చెడ్డపేరు వచ్చిందని అన్నారు. 

ఇది చదవండి:  బాలికపై లైంగిక దాడి నిందితుడి ఎన్‌ కౌంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement