సాక్షి, ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా అరవింద్ భదౌరియా, సహ ఇంచార్జ్‌గా వనతి శ్రీనివాసన్ నియమించింది. తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా సునీల్ బన్సల్‌ని కొనసాగించనుంది. సహ ఇన్‌ఛార్జ్‌లుగా అభయ్ పాటిల్, రేఖాశర్మను నియమించింది.
యూపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా వినోద్ తావ్డే, మహారాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా బైజయంత్ పాండా తమిళనాడు, రామ్ మాధవ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా ఇన్‌ఛార్జ్‌గా స్మృతి ఇరానీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఒడిశా ఇన్‌ఛార్జ్‌గా పురందేశ్వరి, తమిళనాడు కో ఇన్‌ఛార్జ్‌గా డీ.కే అరుణ, కర్ణాటక కో ఇన్‌ఛార్జ్ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లును నియమించింది. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ప్రకటన విడుదల చేశారు.
ఇదీ చదవండి.. బీజేపీ కీలక నిర్ణయం


