3 రోజుల సమ్మె : బ్యాంకులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు | Banks to remain open on coming Sunday ahead of 3 day proposed strike | Sakshi
Sakshi News home page

3 రోజుల సమ్మె : బ్యాంకులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు

Sep 23 2026 2:52 PM | Updated on Sep 23 2026 3:21 PM

Banks to remain open on coming Sunday ahead of 3 day proposed strike

ఆదివారం అన్ని బ్యాంకులు పనిచేస్తాయ్‌

సాక్షి,ముంబై: బ్యాంకు సిబ్బంది తలపెట్టిన మూడు రోజుల దేశవ్యాప్త సమ్మె కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ​ ప్రజలకు అసౌకర్యంం కలగకుండా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా చూసేందుకు, సెప్టెంబర్ 27న (ఆదివారం) అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు  ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణంగా పనిచేస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

బ్యాంక్ వినియోగదారుల సంక్షేమం, సౌకర్యమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. సమ్మెను వాయిదా వేయాలని ప్రభుత్వం, బ్యాంక్ యాజమాన్యాలు యూనియన్లకు విజ్ఞప్తి చేశాయని, అలాగే అత్యవసర బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా కొనసాగేలా చర్యలు తీసుకున్నాయని ఆ ప్రకటన వెల్లడించింది. యూనియన్ల ఆందోళనలలో చాలా వరకు పరిష్కరించామనీ,  మిగిలినవి పరిశీలనలో ఉన్నాయనిపేర్కొంది. బ్యాంకింగ్ సిబ్బంది సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలకు దిగకుండా, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి కృషి చేయాలని , బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని  ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ప్రకటనల కోరింది. తాజా ఆదేశాల ప్రకారం ప్రతిపాదిత 3 రోజుల బ్యాంక్ సమ్మె నేపథ్యంలో సెప్టెంబర్ 27 ఆదివారం నాడు బ్యాంకులు యథావిధిగా తమ  సేవలను అందించనున్నాయి. 

ఇదీ చదవండి: మెర్సిడెస్ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం : కాలి బూడిదైన లగ్జరీ కార్లు

కాగా ఐదు రోజుల పని దినాల విధానాన్ని అమలు చేయాలని, పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్' (PLI) పథకాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ప్టెంబర్ 26, 27 తేదీలలో వచ్చే వారాంతపు సెలవులతో కలిసి, సెప్టెంబర్ 28 నుండి 30 వరకు 'యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్' (UFBU) తలపెట్టిన మూడు రోజుల దేశవ్యాప్త సమ్మె ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి : పక్కింటి వైఫై సాయం : స్లమ్‌ నుంచి ఢిల్లీ ఐఐటీ దాకా ఎవరీ అభిషేక్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement