లండన్‌ - ఢిల్లీ ఇండిగో విమానంలో పొగలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ | London to Delhi IndiGo flight returns to Heathrow after smoke reported | Sakshi
Sakshi News home page

లండన్‌ - ఢిల్లీ ఇండిగో విమానంలో పొగలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Sep 23 2026 7:02 PM | Updated on Sep 23 2026 7:06 PM

London to Delhi IndiGo flight returns to Heathrow after smoke reported

లండన్ నుండి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయాణీకులు భయభ్రాంతులకు లోనయ్యారు.  కారణంగా విమానాన్ని వెనక్కి మళ్లించారు. లండన్ నుంచి 250 మందికి పైగా ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానం (ఫ్లైట్ 6E 04), టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి సురక్షితంగా వెనక్కి (Air turnback) చేరుకుంది. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. 

లండన్ హీత్రూ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరిన కొద్దిసేపటికే టెక్నికల్ ఇష్యూ తలెత్తడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. టేకాఫ్ అయిన తర్వాత కాక్‌పిట్ సిబ్బంది విమానంలో పొగను గుర్తించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించి ఎమర్జెన్సీని ప్రకటించారు. నిబంధనల ప్రకారం (SOP) విమానాన్ని వెనక్కి మళ్లించి హీత్రూ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులందరూ క్షేమంగా ల్యాండ్‌ కావడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు.

ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ జైలుకెళ్లాల్సిందే : సంజయ్ రౌత్ ఆగ్రహం

బాధిత ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని తగ్గించడానికి హోటల్ వసతి కల్పించడంతో పాటు, తదుపరి లభ్యమయ్యే వేరే విమానాలలో వారి గమ్యస్థానాలకు పంపే ఏర్పాట్లు చేసినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ తెలిపింది. ప్రస్తుతం ఆ విమానానికి (బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్) మెయింటెనెన్స్ తనిఖీలు నిర్వహిస్తున్నామని, అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే తిరిగి సర్వీసులను ప్రారంభిస్తామని ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే  తమకు అత్యంత ప్రాధాన్యమని ఇండిగో పేర్కొంది.  

ఇదీ చదవండి: 23 ఏళ్ల తరువాత అమెరికా డ్రీమ్స్‌ వదిలి ‘అమ్మ’దగ్గరికి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement