23 ఏళ్ల తరువాత అమెరికా డ్రీమ్స్‌ వదిలి ‘అమ్మ’దగ్గరికి | NRI Returns To India After 23 Years In US, Says I Felt Safer In Mumbai | Sakshi
Sakshi News home page

23 ఏళ్ల తరువాత అమెరికా డ్రీమ్స్‌ వదిలి ‘అమ్మ’దగ్గరికి

Sep 23 2026 4:09 PM | Updated on Sep 23 2026 4:28 PM

NRI Returns To India After 23 Years In US, Says I Felt Safer In Mumbai

అమెరికాలో స్థిరపడి, సొంత వ్యాపారం నిర్వహిస్తున్న ఒక ఎన్సారై భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. అదీ 23 ఏళ్ల తర్వాత. ముంబైలో మరింత సురక్షితంగా అనిపించడం' వల్ల 23 ఏళ్ల తర్వాత తిరిగి భారత్‌కు వచ్చానని చెప్పిన ఒక ఎన్‌ఆర్‌ఐ (NRI) సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించారు.  ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వదేశానికి తిరిగి రావాలన్న నిర్ణయం వెనుక  అసలు కారణలేంటి?

ఆ ఎన్‌ఆర్‌ఐ సోషల్‌ మీడియా పోస్ట్‌ ప్రకారం తన  15వ ఏట అమెరికా వెళ్లిన ఆయన, న్యూయార్క్ నగరంలో చదువు పూర్తి చేసుకుని బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. ఆ తర్వాత ఫార్మాస్యూటికల్ రంగంలో స్థిరపడి, హెచ్-1బి వీసా పొంది, ఐదేళ్ల తర్వాత అమెరికా పౌరసత్వాన్ని పొందారు. సొంతంగా వ్యాపారం ప్రారంభించి విజయవంతం అయ్యారు. మరి ఇండియాకు ఎందుకు తిరిగొచ్చారు.

పెళ్లి కాలేదు, ఒక కుక్క, సొంత ఇల్లుతొ అమెరికన్ డ్రీమ్ లాంటి జీవనశైలితో  జీవితం హాయిగా గడుస్తోంది.  కానీ అప్పటికీ ఆయన తల్లిదండ్రులు 60 ఏళ్ల వయసు దాటి వృద్ధాప్యంలో ఉన్నారు, వారికి అమెరికాకు రావాలనే ఆసక్తి ఏమాత్రం లేదు. ఇంతలో తండ్రికి  క్యాన్సర్ నిర్ధారణ అయింది. 70 ఏళ్ల వయసు తండ్రి క్యాన్సర్‌తో మరణించడం, తల్లి ఒంటరిగా ఉండటంతో ఆయనకు భారతదేశానికి తిరిగి వెళ్లాలనే కోరిక బలపడింది. 60 ఏళ్ల పైబడిన తల్లిని చూసుకోవడం, ఆమె వద్దే ఉండాలనే ఉద్దేశంతో ఆయన అమెరికాను వీడాలని నిర్ణయించుకున్నారు.

2018, 2020 సంవత్సరాల్లో భారతదేశానికి వచ్చి వెళ్లిన ఆయన, కోవిడ్ మహమ్మారి సమయంలో భారతదేశ వాతావరణానికి, జీవన శైలికి ఆకర్షితులయ్యారు. 2022లో అమెరికాలో తన వ్యాపారాన్ని విక్రయించి, పెన్సిల్వేనియాలోని తన ఇంటిని అమ్మేసి 2023లో ముంబైకి శాశ్వతంగా తిరిగి వచ్చేశారు. ప్రస్తుతం ఆయన భారతీయ కంపెనీలకు కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్నారు.

ఇదీ చదవండి: 3 రోజుల సమ్మె : బ్యాంకులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు

అమెరికా డ్రీమ్ కంటే స్వదేశమే మిన్న
అమెరికాలోని శుభ్రమైన గాలి, అక్కడి జీవనశైలి కంటే ఇంటి భోజనం, తల్లితో సాయంత్రం వేళల్లో టీ తాగడం, పాత స్నేహితులు, బంధువులతో గడపడంలో లభించే అమూల్యమైన ప్రేమ (అన్‌కండిషనల్ లవ్) ముంబైలో తనకు లభించిందని, అందుకే ఇక్కడే ఎక్కువ భద్రతా భావన కలిగిందని ఆయన పేర్కొన్నారు.  ఏది ఏమైనా ఇంటి ఫుడ్‌,  తల్లిదండ్రుల చిన్ననాటి కథలు వినడం , స్నేహితులతో సరదాగా గడపడం ఆ నిస్వార్థ ప్రేమ ముందు అన్నీ దిగదుడుపే అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు అమెరికాకు వెళ్లే ముందు వదిలిపెట్టిన నా చిన్ననాటి స్నేహితులతో ఇప్పటికీ సంబంధాలు కొనసాగిస్తున్నాను. వారు తమ కుటుంబ బాధ్యతల్లో బిజీగా ఉన్నప్పటికీ, తరచుగా కలుస్తుంటాం,  కనీసం ఏడాదికి ఒకసారి ట్రిప్పులు లేదా ట్రెక్కింగ్‌లకు వెళ్తుంటామని సంతోషంగా చెప్పారు. 

సోషల్ మీడియా స్పందనలు  
చాలామంది నెటిజన్లు ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తూ అభినందించారు. జీవితంలో నూటికి నూరుపాట్లు సంతృప్తే ముఖ్యం. ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప మళ్లీ అమెరికాకు వెళ్లకండి. సంతోషంగా ఉండండి అని ఒకరు వ్యాఖ్యానించారు. పౌరసత్వం కేవలం కాగితం ముక్క మాత్రమే భారతదేశం అంత చెడ్డది కాదు. యపలకపి మనలను ఈ స్థాయికి తెచ్చిన కుటుంబానికి అండగా ఉండటమే నిజమైన సంతోషం మరొకరు అభిప్రాయపడ్డారు. భారత్‌లో  అమ్మగారితో సమయం గడపండి. ఆ తర్వాత ఇక్కడే ఉండాలా లేక అమెరికా వెళ్ళాలా అన్నది నిర్ణయించుకోవచ్చు అని  మరో నెటిజన్ సలహా ఇచ్చారు. 
 

ఇదీ చదవండి : పక్కింటి వైఫై సాయం : స్లమ్‌ నుంచి ఢిల్లీ ఐఐటీ దాకా ఎవరీ అభిషేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement