సాక్షి, హైదరాబాద్: SIR ప్రక్రియలోని లోపాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు (ECs) అభ్యంతరం వ్యక్తం చేశారంటూ 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్'లో వచ్చిన కథనంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యవహారాన్ని సుమోటా తీసుకొని విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాత విచారణ జరిపే విశ్వసనీయత సుప్రీంకోర్టుకు తప్ప మరే ఇతర సంస్థకూ లేదని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం పనితీరు, విశ్వసనీయతపై తీవ్రమైన సంక్షోభం నెలకొందని కేటీఆర్ అన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అనేక ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయనా, తాజా వార్తలతో మరింత అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థపై వచ్చిన ఆరోపణలపై దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు తప్ప మరే ఇతర సంస్థపైనా నమ్మకం ఉంచలేమన్నారు. మాజీ ఎన్నికల కమిషనర్లు చెబుతున్న అంశాలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని, ఈ విషయంపై స్యూమోటో కింద విచారణ జరపాలన్నారు దీనివల్ల కొన్ని సమాధానాలు లభిస్తాయని, నిజం బయటపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేష్ కుమార్ జైలుకెళ్లాల్సిందే : సంజయ్ రౌత్ ఆగ్రహం
కాగా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎన్నికల కమిషన్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూవచ్చిన నివేదిక ప్రకంపనలు రేపుతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలోప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై తక్షణమే చర్చలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
BRS Working President @KTRBRS key remarks on objections raised by two Election Commissioners over the SIR process.
There is now a serious crisis of confidence in the functioning of the Election Commission.
The objections reportedly raised by two Election Commissioners over the… pic.twitter.com/kj9YsDsam1— KTR Updates (@KTRMediaUpdates) September 23, 2026


