దేశంలో 1980 ఫోటో ట్రెండ్‌.. రాష్టంలో 1980ల నాటి పరిస్థితులు.. కేటీఆర్‌ | Congress is the cause of the power crisis in the state KTR | Sakshi
Sakshi News home page

దేశంలో 1980 ఫోటో ట్రెండ్‌.. రాష్టంలో 1980ల నాటి పరిస్థితులు.. కేటీఆర్‌

Sep 23 2026 2:39 PM | Updated on Sep 23 2026 2:46 PM

Congress is the cause of the power crisis in the state KTR

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం   సోషల్‌ మీడియాలో 1980 నాటి ట్రెండ్‌ నడుస్తుంటే రాష్ట్రంలో 1980 నాటి పరిస్థితులు నడుస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ దుయ్యబట్టారు. ఈ రోజు (బుధవారం) తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులు ఎల్‌నినో ప్రభావంతో కాదని ఎల్‌ కాంగో ప్రభావంతోనని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేటీఆర్‌ వ్యంగ్యంగా మాట్లాడారు.

తెలంగాణలో కరెంట్ సంక్షోభం తలెత్తిందని బీఆర్‌ఎస్‌ గతంలోనే కాంగ్రెస్‌ వస్తే కరెంట్‌ ఉండదని చెప్పిందని ప్రస్తుతం రాష్టంలో అవే పరిస్థితులు నడుస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌ వస్తే చీకటిరాజ్యమేనని  గతంలోనే చెప్పామని ఇప్పుడు అదే నిజమైందన్నారు.  రాష్ట్రంలో ఎక్కడ 6 గంటలకు మించి కరెంటు లేదని వారం రోజులుగా పవర్‌ లెస్‌గా ప్లాంట్లు ఉన్నాయని తెలిపారు. 

రాష్ట్రంలో 40 లక్షల బొగ్గు నిల్వలు ఉంటే ఎందుకు విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదు భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలి. 4 వేల మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి చెయ్యాల్సిన రాష్ట్రంలో 400 మెగా వాట్స్ ఉత్పత్తి చేస్తున్నారు. నాణ్యత లేని బొగ్గుతో రాష్ట్రానికి 2,900 కోట్ల నష్టం సీఎం బావమరిది  సృజనాత్మక లీలలతో సింగరేణికి నష్టాలు సీఎం రేవంత్ మెస్సి తో ఫుట్ బాల్ ఆడలేదు.... సింగరేణి సంస్థతో ఫుట్‌ బాల్ ఆడారు. అని కేటీఆర్‌ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని నీళ్లు లేక హైడల్‌ పవర్‌ ఉత్పత్తి ఆగిపోయిందని తెలిపారు. త్వరలోనే తెలంగాణలోని అన్ని పవర్‌ ప్లాంట్లు సందర్శిస్తామని ఆరు బృందాలుగా వెళ్లి నిజానిజాలు తెలుసుకుంటామన్నారు. కరెంటు ఉత్పత్తి కేంద్రాల్లో నిజాలు నిగ్గుదేల్చడానికే ఆరు బృందాలుగా వెళ్లి అన్ని పవర్‌ప్లాంట్లను సందర్శిస్తామని కేటీఆర్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement