హైదరాబాద్ : ర్కాస్ ఆటోమొబైల్స్ అవగాహన ఒప్పందం | Varkas Automobiles Memorandum of Understanding | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ : ర్కాస్ ఆటోమొబైల్స్ అవగాహన ఒప్పందం

Sep 23 2026 10:25 AM | Updated on Sep 23 2026 10:49 AM

Varkas Automobiles Memorandum of Understanding

హైదరాబాద్ : జేఎన్‌టీయూ హైదరాబాద్ హెక్సావాట్స్ రేసింగ్ టీమ్ ఈఈఈ విభాగం, హెచ్‌ఓడీ ఫణశ్రీ గారి ఆద్వర్యం లో ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అయిన వర్కాస్ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

వర్కాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో ఎంఓయూ ద్వారా విద్యార్థులకు ఎలక్ట్రిక్ వెహికల్ ఇంజనీరింగ్, బ్యాటరీ సిస్టమ్స్, పవర్ ఎల క్ట్రానిక్స్, మోటార్ కంట్రోలర్ , ఎంబెడెడ్ సిస్టమ్స్, వెహికల్ ఇంటిగ్రేషన్, టెలిమాటిక్స్, థర్మల్ మానేజ్మెంట్, వెహికల్ డైనమిక్స్, డయాగ్నోస్టిక్స్, టెస్టింగ్, వాలిడేషన్ వంటి రంగాలలో ఇంటర్న్షిప్ అవకాశాలు లభించనున్నాయి.

ఈవీ రంగంలో ప్రత్యక్ష అనుభవంతో పాటు ఇంజనీరింగ్ మార్గదర్శకత్వం, సాంకేతిక వనరులు, విడిభాగాలు, టెస్టింగ్ వంటి సాంకేతిక నైపుణ్యం లభిస్తుంది. ఈ సహకారం భవిష్యత్లో పరిశోధన, అభివృద్ధికి తోడ్పడగల సాంకే తిక పరిజ్ఞానం, డాక్యుమెంటేషన్, టెస్ట్ డేటా, ఇంజనీరింగ్ పద్ధతుల సృష్టికి దోహ దపడుతుందని పేర్కొన్నారు.

విద్యార్థులకు ఎలక్ట్రిక్ ప్యాసింజర్, వాణిజ్య వాహనాలు, ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ సిస్టమ్స్,ఛార్జింగ్ టెక్నాలజీలు, రెట్రోఫిట్టింగ్ రంగాలలో మరిన్ని ఉద్యోగ  అవకాశాలను పొందేందుకు వీలు కల్పిస్తుందన్నారు.

ఎంఓయూ కార్యక్రమంలో జేఎన్టీయూ వీసీ కిషన్కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ జయలక్ష్మి, రెక్టార్ దామోదరం, అకాడమిక్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ కామాక్షి ప్రసాద్, వర్కాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తరఫున వర్కాస్-ఈవీ వ్యవస్థాపకులు రామ్ వేమిరెడ్డి , చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ బ్రహ్మశ్రీ రామకృష్ణ చార్యులు , చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గోపాలరావు ఉప్పాల , ఫైనాన్స్ హెడ్ చెన్నారెడ్డి,ఇంజినీరింగ్  కళాశాల ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రఘురామ్, డైరెక్టర్లు భ్రమర, సుష్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement