ఏపీలో వర్షాలు అప్‌డేట్స్..
విజయవాడ..
- తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం
- ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించిన విద్యాశాఖాధికారి.
విజయనగరం జిల్లా
- బంగాళాఖాతంలో తుపాను ప్రభావంతో జిల్లా అంతటా ఎడతెరిపిలేని వానలు.
- కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.
- నాగావళి నదికి వరద ముప్పు హెచ్చరికలు.
- ఒడిస్సా, రాయగడ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షపాతాన్ని గమనిస్తున్న అధికారులు.
👉ఉత్తరాంధ్రపై వాయుగుండం ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఈరోజు రాత్రికి ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల మధ్య విశాఖపట్నం, గోపాల్‌పూర్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం ఉదయం 11:30 గంటల వరకు ఆకస్మిక వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈదురుగాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు, కొన్ని సందర్భాల్లో 75 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని స్పష్టం చేసింది.సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించింది.
👉వర్షాల తీవ్రతతో ఉత్తరాంధ్రలోని వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉండటంతో వరద ముప్పుపై అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదల పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో స్థానిక మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
రైళ్ల రద్దు.. పాఠశాలలకు సెలవులు
👉వాయుగుండం ప్రభావంతో రైల్వే శాఖ కూడా అప్రమత్తమైంది. విశాఖపట్నం–కిరందూల్ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలో నడిచే 18515 రైలును సెప్టెంబర్ 23న రద్దు చేసినట్లు రైల్వే సమాచారం వెల్లడించింది. ఉత్తరాంధ్రలో పరిస్థితులను బట్టి పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. తీవ్ర వాయుగుండం తీరం దాటే సమయం, ఆ తర్వాత కురిసే భారీ వర్షాల నేపథ్యంలో రానున్న 24 నుంచి 48 గంటలు అత్యంత కీలకంగా మారాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని యంత్రాంగం కోరుతోంది. రానున్న 24 గంటల పాటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
🔸పశ్చిమమధ్య,వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం
🔹గడిచిన 6 గంటల్లో గంటకు 7 కి.మీ వేగంతో కదులుతున్న తీవ్రవాయుగుండం
🔺ఇది ప్రస్తుతానికి గోపాల్‌పూర్‌కు 150 కి.మీ, కళింగపట్నానికి 100 కి.మీ, ఒడిశాలోని పూరీకి 220 కి.మీ, విశాఖపట్నానికి 180 కి.మీ దూరంలో కేంద్రీకృతం pic.twitter.com/JcrETqJ6lx— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) September 23, 2026
పలాసలో కుండపోత
👉మంగళవారం రాత్రి వరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో అత్యధికంగా 10.07 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తాళభద్రలో 9.8, రావివలసలో 9.36, సంతబోమ్మాళిలో 8.81, కోటబోమ్మాళిలో 8.75, మదనపురంలో 8.36, హరిపురంలో 7.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అల్లూరి జిల్లా గ పరైలో 7.15, శ్రీకాకుళం జిల్లా విజయరామపురంలో 7.1, జాలుమూరులో 7.05, సైరిగాంలో 7.03, నర్సన్నపేటలో 6.92, విశాఖ జిల్లా మధురవాడలో 6.9, నంద్యాల జిల్లా కానాలలో 6.55, విశాఖ జిల్లా ఆనందపురంలో 6.55 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.


