ఇలాంటి ఆఫర్‌ ఇస్తే..ఫిట్‌నెస్‌కి ఢోకా లేదు! | Indian woman shares South Korea workplace rewards employees for staying fit | Sakshi
Sakshi News home page

ఇలాంటి ఆఫర్‌ ఇస్తే..ఫిట్‌నెస్‌కి ఢోకా లేదు!

Sep 22 2026 5:23 PM | Updated on Sep 22 2026 5:24 PM

Indian woman shares South Korea workplace rewards employees for staying fit

ఇలాంటి కార్యాలయం ఉంటే ఏ ఉద్యోగి అయినా హెల్దీగా ఉంటాడు. పైగా ఆస్ప్రతుల చుట్టూ తిరిగాల్సిన అవసరం ఉండదు. ఇంటిల్లపాది ఆరోగ్యంగా ఉండి తీరుతారు. నిజంగా ఆఫీసులన్నీ ఇలానే వ్యవహరిస్తే ఎంత బాగుండునో కదా..!. అసలేంటి ఇదంతా అని కోపం తెచ్చుకోకుండా చకచక చదివేయండి అసలు మేటరేంటో. 

ఏం లేదండి దక్షిణ కొరియాలో ఒక ఆఫీసు తన ఉద్యోగులు హెల్త్‌పై దృష్టిపెట్టేలా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సుమారు రెండు నెలలపాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేసి, దానికి ప్రూవ్‌గా తన టీమ్‌లీడర్‌ లేదా మేనేజర్‌కు రోజుకో ఫోటో లేదా వీడియోని అప్‌డేట్‌ చేసి పంపితే చాలు బోలెడన్నీ బహుమతులు పొందొచ్చు. అవేమీ చిన్నా చితక బహుమతులు కాదండోయ్‌. గూచీ, షానెల్‌, ప్రాడా, వంటి లగ్జరీయస్‌ బ్రాండెడ్‌ గిఫ్ట్‌లే బాసు. 

పని ఒత్తిడితో సతమతమవ్వకుండా తమ ఉద్యోగులు ఆరోగ్యంపై ఫోకస్‌ పెట్టేలా చేయడమే లక్ష్యంగా ఈ వెరైటీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందట కంపెనీ యాజమాన్యం. వ్యాయామం చేయడానికి ఇంతకుమించ్చిన ప్రేరణ ఏం కావాలంటూ అదే కంపెనీలోనే  పనిచేస్తున్న భారత మహిళ అరోరా ఈ విచిత్రం గురించి సోషల్‌మీడిడా వేదికగా పంచుకుంది. 

అంతేగాదు ఆమె ‘నాక్కావాల్సింది దోరికేసింది’ అని పాట పాడేసుకుంటూ ఆనందంగా వర్కౌట్లు చేసేస్తోందామె. నెటిజన్లు గుడ్‌ ఐడియా..రెండు నెలలపాటె ఏ పని చేసినా..ఆ అలవాటు మన దినచర్యలో ఎలా భాగమవుతోంది  ఈ హెల్త్‌ కార్యక్రమంతో చెప్పకనే చెప్పిసేంది అంటూ సదరు కంపెనీపై ప్రసంశల వర్షం కురిపిస్తూ పోస్టులు పెట్టారు. 

 

ఇదీ చదవండి: ఆ రెస్టారెంట్‌లో మెనూనే ఉండదట..! ఫుడ్‌ ఎలా ఆర్డర్‌ చేస్తారంటే..)

 



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement