ప్రత్యేకమైన భోజనం అనుభవం కోసం వెరైటీ రెస్టారెంట్‌కి లేదా విభిన్న రుచుల ఆహారాలను అందించే హోటల్‌కో వెళ్లాల్సిందే. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే రెస్టారెంట్ మాత్రం అత్యంత ప్రత్యేకం. అంతేగాదు అసలు ఇలాంటి రెస్టారెంట్‌ని చూసే అవకాశం అస్సలు ఉండదు. ఎందుకుంటే అక్కడ అస్సలు మెనూ ఉండదు..అయినా జనం తినేందుకు తండోపతండాలుగా ఎగబడుతుంటారు. అదెలా అని ఆశ్చర్యం కలుగక మానదు. మరి కస్టమర్లు ఫుడ్ ఎలా ఆర్డర్ చేస్తారంటే..
ఇక్కడ దొరికే ఏ ఫుడ్‌ని అయినా వేలం ద్వారా దొరకుతుంది. అంటే చాలా ఖర్చు అవుతుందా అనుకోకండి. ఇక్కడ సర్వర్లు ఫుడ్ ప్లేట్లతో మనముందుకు వచ్చి..వారి చేతిలో ఏయే ఏయే ఆహారాలు ఉన్నాయో గట్టిగా అరుస్తూ చెబుతారు. మనం ఠక్కున మనకు కావాలా? వద్దా? అని చెబితే చాలు. తక్షణమే సర్వర్లు మనకు నచ్చిన వంటకాన్ని వడ్డిస్తారు. బిల్లు కూడా మనం తిన్న ప్లేట్ల సంఖ్యను బట్టి డబ్బులను వసూలు చేస్తారంతే. సింపుల్‌గా చెప్పాలంటే దీన్ని అరుపుల రెస్టారెంట్ అని పిలవొచ్చు.
ఇదెక్కడ ఉందంటే..స్పెయిన్‌లోని మాలాగాలో ఉన్న 'ఎల్ టింటెరో' రెస్టారెంట్‌లో ఇలాంటి ప్రత్యేకమైన విందు లభిస్తుందట. స్టెఫ్, మార్కో అనే కంటెంట్ క్రియేటర్ జంట ఈ రెస్టారెంట్‌ని సందర్శించి అక్కడి ఫుడ్ అనుభవాన్ని వీడియో రూపంలో షేర్ చేశారు. పైగా ఇక్కడ తాజాగా వండిన ఆహారాన్నే వడ్డిస్తారట. నేరుగా బొగ్గులపై లేదా ఫ్రైయర్లలో వేయించి వడ్డిస్తారని చెబుతున్నారు. ఇక్కడ ప్రతి వంటకం నోరూరించే రుచితో అత్యంత మధురంగా ఉంటుందట. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి మరి..!.
ఇదీ చదవండి: Shruti Haasan: ఎప్పటికీ తల్లిని కాలేననుకున్నా..!: శ్రుతి హాసన్)


