చదువుకు తగిన ఉద్యోగం రాలేదని నిరాశ చెందకుండా చిన్న ఉద్యోగంతో జీవితాన్ని ప్రారంభించి ఆస్ట్రేలియాలో ఏకంగా మూడు రెస్టారెంట్ల యజమానిగా ఎదిగిన ఒక భారతీయుడి విజయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రమ, పట్టుదల ఉంటే విదేశీ గడ్డపైనా అద్భుతాలు సృష్టించవచ్చని ఈ కథనం నిరూపిస్తోంది.
డెలివరీ బాయ్‌గా ప్రస్థానం
11 ఏళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన సదరు వ్యక్తి, కోర్సు పూర్తయ్యాక సొంత రంగంలో సరైన ఉద్యోగం లభించక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉపాధి కోసం స్థానిక పిజ్జా షాప్‌లో పూర్తిస్థాయి ఉద్యోగిగా చేరారు. అక్కడ పిజ్జాలు తయారు చేయడంతో పాటు కస్టమర్ల ఇళ్లకు డెలివరీ చేసేవారు.
భాగస్వామ్యంతో తొలి ఫ్రాంచైజీ
మూడేళ్ల పాటు క్రమశిక్షణతో పనిచేసి పొదుపు చేసిన డబ్బు, మరొకరి భాగస్వామ్యంతో ఒక పిజ్జా ఫ్రాంచైజీని ప్రారంభించారు. వ్యాపార మెళకువలు అవగాహన చేసుకుంటూ పట్టుదలతో శ్రమించి విజయవంతంగా నిర్వహించారు. కొవిడ్ కాలంలో ఇండియాకు వచ్చి వివాహం చేసుకున్న ఆయన, ఆ తర్వాత సవాళ్లను అధిగమించి వ్యాపారాన్ని మరింత విస్తరించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మూడు పిజ్జా ఫ్రాంచైజీలు, సొంతిల్లు, బీఎండబ్ల్యూ కారుతో పాటు అక్కడి పౌరసత్వం పొందారు.
My extended brother-in-law received Australian citizenship for himself and his family this week.
He went to Australia 11 years ago to study. Not merit, so he couldn't get a job in his field.
He got a full-time job at a pizza shop, started working, and 3 years later, with a…— Vineeth K (@DealsDhamaka) September 20, 2026
ఈ విజయాన్ని ఆయన బంధువు వినీత్ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ‘విద్యార్హతల కంటే కష్టపడే మనస్తత్వమే మనిషిని ఏ స్థాయికైనా తీసుకెళ్తుంది’ అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదీ చదవండి: వెళ్లిపోయాడనుకునేలోపే మళ్లీ ఐదేళ్ల పదవి!


