శనిగ్రహంపై వింత ఆకారపు తరంగ ప్రవాహాలు!  | Decagon wave emerges near Saturn south pole | Sakshi
Sakshi News home page

శనిగ్రహంపై వింత ఆకారపు తరంగ ప్రవాహాలు! 

Sep 4 2026 2:48 AM | Updated on Sep 4 2026 2:48 AM

Decagon wave emerges near Saturn south pole

కేప్‌ కేనర్‌వాల్‌: సౌర కుటుంబంలో శనిగ్రహం చాలా యునీక్‌! చుట్టూ ఉన్న రింగుల మాట కాసేపు పక్కనబెట్టినా.. ఈ గ్రహం ఉత్తర, దక్షిణ ధ్రువాలను కమ్మేసిన అమ్మోనియా మేఘాల్లో చిత్ర విచిత్రమైన తరంగ ప్రవాహాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉత్తర ధ్రువం వద్ద షట్భుజి ఆకారపు భారీ తరంగ ప్రవాహాలు ఉన్నట్లు నాసా ప్రయోగించిన అంతరిక్ష నౌకలు వాయేజర్‌–1, వాయేజర–2లు 1980లలో గుర్తిస్తే... దక్షిణ ధ్రువంపై దశభుజి తరంగ ప్రవాహాలున్నట్టు (చిత్రంలో చూపినట్టు) స్పెయిన్‌ శాస్త్రవేత్తల పరిశీలనలో తాజాగా తేలింది. 

2023లో హబుల్‌ టెలిస్కోపు తీసిన చిత్రాల ద్వారా ఈ దశభుజి తరంగ ప్రవాహాల వివరాలు తెలిశాయి. అంతకుముందు ఇవేవీ ఉన్న ఆనవాళ్లు లేవు కాబట్టి 2017 – 2023 మధ్యలో ఇవి ఏర్పడి ఉండాలన్నది శాస్త్రవేత్తల అంచనా. ఈ ఆరేళ్ల సమయం శనిగ్రహపు దక్షిణ ధ్రువం భూమికి వ్యతిరేక దిశలో ఉండింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ దశభుజి తరంగ ప్రవాహం ఒక్కో భుజం ఏకాఎకిన 16,700 కిలోమీటర్ల పొడవు ఉండటం.

 వాయేజర్‌–1 గుర్తించి షట్భుజే చాలా ప్రత్యేకమైందని అనుకుంటూంటే శనిగ్రహంపై దశభుజి తరంగ ప్రవాహం తమను మరింత ఆశ్చర్యానికి గురి చేసిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త అగస్టీన్‌ సాంచేజ్‌ లవేగా (యూనివర్శిటీ ఆఫ్‌ బసేక్‌ కంట్రీ) తెలిపారు. సౌర కుటుంబంలో ఒక్క మెర్కురీ మినహా మిగిలిన వాటిపై కొన్ని తేడాలతో వాతావరణం ఉన్నా, ఇలా తరంగ ప్రవాహాలూ వాటిపై కనిపిస్తున్నా... షట్భుజి, దశభుజి ఆకారాల్లో తరంగ ప్రవాహాలు ఉన్నది మాత్రం ఒక్క శనిగ్రహంపై మాత్రమే. ఎలాగైతే భూమి వాతావరణపు పైపొరల్లోని వాయు ప్రవాహాలు మన వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయో.. శనిగ్రహంపై కూడా వాటి ప్రభావాన్ని కనుక్కునేందుకు శాస్త్రవ్తేలు ప్రయత్నం చేస్తున్నారు.  

శనిగ్రహంపై తరంగాలు (నాసా ఫొటో)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement