పాకిస్తానీ వ్యక్తికి రూ.35 కోట్ల జాక్‌పాట్‌.. భారతీయుడికి ల్యాండ్‌ రోవర్‌ | Pakistani national wins life changing Dh15m Big Ticket grand prize | Sakshi
Sakshi News home page

పాకిస్తానీ వ్యక్తికి రూ.35 కోట్ల జాక్‌పాట్‌.. భారతీయుడికి ల్యాండ్‌ రోవర్‌

Sep 3 2026 11:44 PM | Updated on Sep 3 2026 11:44 PM

Pakistani national wins life changing Dh15m Big Ticket grand prize

source: X

యూఏఈలో నిర్వహించిన బిగ్‌ టికెట్‌ లైవ్‌ డ్రాలో (లాటరీ) పాకిస్తాన్‌కు చెందిన షౌకత్‌ అఫ్తాబ్‌కు భారీ జాక్‌పాట్‌ తగిలింది.  సిరీస్‌ 290లో షౌకత్‌ ఏకంగా 15 మిలియన్ల దిర్హమ్స్‌ గెలుచుకున్నాడు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ.35 కోట్లకు పైగా ఉంటుంది. లాటరీ రూపంలో భారీ జాక్‌పాట్‌ తగలడంతో షౌకత్‌ ఒక్కసారిగా యూఏఈ మిలియనీర్ల జాబితాలో చేరిపోయాడు.

షౌకత్‌ టికెట్‌ నంబర్‌ 245556 కాగా.. గత నెల బిగ్‌ టికెట్‌ విజేత రేనాల్డో హెర్బోసో ఈసారి విజేత టికెట్‌ను ఎంపిక చేశాడు. హెర్బోసో షౌకత్‌ను ఫోన్‌ ద్వారా సంప్రదించి విజేత అని చెప్పగా.. అతడు తొలుత నమ్మలేదు. అనంతరం యూట్యూబ్‌లో లైవ్‌ డ్రాను పరిశీలించి తన టికెట్‌ నంబర్‌ విజేతగా నిలిచిందని నిర్ధారించుకున్నాడు. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లాటరీ ద్వారా వచ్చే మొత్తం షౌకత్‌ జీవితాన్ని ఒక్కసారిగా మర్చేసింది.

భారతీయ ప్రవాసికి ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌
ఇదే డ్రాలో భారతీయ ప్రవాసికి కూడా భారీ బహుమతి దక్కింది. దుబాయ్‌లో నివసిస్తున్న రవీంద్రనాథన్‌ వినేష్‌ కొత్త ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ కారును గెలుచుకున్నాడు. డ్రీమ్‌ కార్‌ సిరీస్‌లో 035787 నంబర్‌ టికెట్‌ విజేతగా నిలిచింది. దీంతో వినేష్‌ ప్రీమియం ఎస్‌యూవీని సొంతం చేసుకున్నాడు.

మరో ఐదుగురికి చెరో లక్ష దిర్హమ్స్‌
తాజా డ్రాలో మరో ఐదుగురు విజేతలకు చెరో లక్ష దిర్హమ్స్‌ చొప్పున కన్సొలేషన్‌ బహుమతి లభించింది. భారత్‌కు చెందిన సందీప్‌కుమార్‌ ననేరా, దుబాయ్‌లో నివసిస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్‌ రఫీకుల్‌ ఇస్లాం అహ్మద్‌ మీహ్‌ తలుక్దార్‌, షార్జాలో నివసిస్తున్న భారతీయుడు ముల్లపుల్లి ప్రవీణ్‌ బాబు, దుబాయ్‌లో నివసిస్తున్న భారతీయులు సురేశ్‌ కుమార్‌, శిబ్లిన్‌ సర్ఫాజ్‌ ఈ నగదు బహుమతులను గెలుచుకున్నారు.

బిగ్‌ స్పిన్‌లోనూ భారీ బహుమతులు
బిగ్‌ స్పిన్‌ లైవ్‌ గేమ్‌లో కూడా ముగ్గురు విజేతలు నిలిచారు. దుబాయ్‌లో నివసిస్తున్న ఫిలిప్పీన్స్‌ జాతీయురాలు జింకీ శాండోవల్‌ 50000 దిర్హమ్స్‌ గెలుచుకుంది. ఒమన్‌లో నివసిస్తున్న బంగ్లాదేశ్‌ జాతీయుడు మహ్మద్‌ కమాల్‌ హొస్సాన్‌ 500000 దిర్హమ్స్‌ సొంతం చేసుకున్నాడు. షార్జాలో నివసిస్తున్న ఓ భారతీయుడు లక్షా యాభై వేల దిర్హమ్స్‌ను బహుమతి అందుకున్నాడు.

తదుపరి బిగ్‌ స్పిన్‌ కోసం బంగ్లాదేశ్‌కు చెందిన ఎండీ నాసిర్‌ ఉద్దీన్‌, భారత్‌కు చెందిన అరుణ్‌కుమార్‌ యాద భగేలు యాదవ్‌, ఈజిప్ట్‌కు చెందిన తాహా అహ్మద్‌ ఎంపికయ్యారు.

తదుపరి జాక్‌పాట్‌ 20 మిలియన్ల దిర్హమ్‌లు
సిరీస్‌ 290 విజేతలను ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి తదుపరి బిగ్‌ టికెట్‌ ప్రమోషన్‌పై పడింది. ఈసారి 20 మిలియన్ల దిర్హమ్‌లు గ్రాండ్‌ ప్రైజ్‌ అందుబాటులో ఉండనుంది.

అంతేకాకుండా రెండు లగ్జరీ కార్లను కూడా విజేతలకు అందించనున్నారు. అక్టోబర్‌ 3న జరిగే డ్రాలో నిస్సాన్‌ పెట్రోల్‌, నవంబర్‌ 3న జరిగే డ్రాలో రేంజ్‌ రోవర్‌ వెలార్‌ కార్లను బహుమతులుగా ఇవ్వనున్నారు.

చదవండి: జియో రూ.200 రీచార్జ్‌ ప్లాన్: ప్రయోజనాలివే..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement