విమానాశ్రయంపై దాడి.. రష్యాపై జర్మనీ ఆరోపణ | Germany says Russia behind Leipzig airport drone attack | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంపై దాడి.. రష్యాపై జర్మనీ ఆరోపణ

Sep 2 2026 4:26 AM | Updated on Sep 2 2026 4:26 AM

Germany says Russia behind Leipzig airport drone attack

source: X

లైప్‌జిగ్ విమానాశ్రయంపై గత నెల జరిగిన డ్రోన్ దాడి వెనుక రష్యా ఉందని జర్మనీ ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 4న పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్‌ను విమానాశ్రయంలో గుర్తించారు. అది పేలకపోవడానికి డిటోనేటర్‌లో లోపమే కారణమని దర్యాప్తులో తేలింది.

మరో డ్రోన్ సమీపంలోని ఉక్రెయిన్ కార్గో విమానాన్ని ఢీకొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 10 రోజుల తర్వాత విమానాశ్రయం సమీపంలో మూడో డ్రోన్‌ను కూడా గుర్తించారు.

ఈ దాడి యూరప్‌లో రష్యా చేపడుతున్న హైబ్రిడ్ ఆపరేషన్లకు నమూనాలా ఉందని జర్మనీ అంతర్గత వ్యవహారాల మంత్రి అలెగ్జాండర్ డోబ్రిండ్ట్ తెలిపారు. పరికరాల పరిశీలన, నిఘా సమాచారంతో రష్యా ప్రమేయానికి ఆధారాలు లభించాయని ఆయన చెప్పారు.

అయితే రష్యా ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. బెర్లిన్‌లోని రష్యా రాయబార కార్యాలయం ఆరోపణలను అసంబద్ధమైనవిగా పేర్కొంది.

రష్యాపై జర్మనీ కీలక చర్యలు
విమానాశ్రయంపై దాడిలో రష్యా ప్రమేయం నేపథ్యంలో బాన్‌లోని రష్యా కాన్సులేట్‌ను మూసివేయాలని జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ వేడ్‌ఫుల్ ప్రకటించారు. బెర్లిన్‌లోని రష్యన్ హౌస్ ఒప్పందాన్ని కూడా రద్దు చేయనున్నట్లు తెలిపారు. 

చదవండి: అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement