థాయ్‌లాండ్‌ నిష్క్రమణ | Thailand team has exited the Womens Asia Cup T20 cricket tournament | Sakshi
Sakshi News home page

థాయ్‌లాండ్‌ నిష్క్రమణ

Sep 2 2026 12:57 AM | Updated on Sep 2 2026 12:57 AM

Thailand team has exited the Womens Asia Cup T20 cricket tournament

దుబాయ్‌: మహిళల ఆసియాకప్‌ టి20 క్రికెట్‌ టోర్నీ నుంచి థాయ్‌లాండ్‌ జట్టు లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. సెమీఫైనల్‌ రేసులో ఉండాలంటే పాకిస్తాన్‌పై తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ జట్టు ఓడిపోయింది. ఫాతిమా సనా సారథ్యంలోని పాక్‌ జట్టు 35 పరుగుల తేడాతో థాయ్‌లాండ్‌ను ఓడించి శుభారంభం చేసింది. ముందుగా పాక్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 119 పరుగులు చేసింది.మునీబా అలీ (54; 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. 

థాయ్‌లాండ్‌ బౌలర్‌ థిపాచా పుథావోంగ్‌ 3 వికెట్లు తీసి అంతర్జాతీయ మహిళల టి20ల్లో అత్యధిక వికెట్లు (173) తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది. 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన థాయ్‌లాండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 84 పరుగులకే పరిమితమైంది. మూడో నేడు జరిగే గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో ఇండోనేసియాతో శ్రీలంక తలపడతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement