ఎండలతో జర్మనీ అతలాకుతలం.. వేల సంఖ్యలో మరణాలు! | Germany sees record heat related deaths amid extreme summer | Sakshi
Sakshi News home page

ఎండలతో జర్మనీ అతకాలకుతం.. వేల సంఖ్యలో మరణాలు!

Sep 3 2026 3:51 PM | Updated on Sep 3 2026 4:53 PM

Germany sees record heat related deaths amid extreme summer

బెర్లిన్‌: ఈ ఏడాది నమోదైన ఎండలు యూరప్‌ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఎండల వేడిమికి తట్టుకోలేక ఐరోపా వ్యాప్తంగా పెద్దఎత్తున ప్రజలు మృత్యువాత పడ్డారు. ఈ మరణాలు జర్మనీలో సైతం అత్యధికంగా ఉన్నాయి. తాజాగా ఈ వేసవి వడగాలుల వల్ల ఆ దేశంలో మరణించిన వారి సంఖ్య జర్మనీ  అధికారికంగా ప్రకటించింది.

యూరప్‌లో సంభవించిన  తీవ్రమైన వేసవి వడగాలుల వల్ల జర్మనీలో రికార్డు స్థాయిలో 16,300 మరణాలు నమోదయ్యాయని  ఈ రోజు గురువారం జర్మనీ అధికారికంగా గణాంకాలు విడుదల చేసింది. గత వారం  రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్ నివేదించిన 15,800 మరణాల సంఖ్య కంటే ఈ సంఖ్య అధికంగా ఉందని తెలిపింది.  ఈ మరణాలు  జూన్ 1 నుండి ఆగస్టు 23 వరకూ సంభవించినవిగా తెలిపింది.

అయితే ఈ మరణాలలో అధికంగా 75 ఏళ్లు పైబడిన వారి వయస్సు వారే ఉన్నారని పేర్కొంది. వీటిలో కేవలం జూన్ 22-28 మధ్య కేవలం ఒక వారంలోనే 9,600 మరణాలు సంభవించాయని ఆ సంస్థ అంచనా వేసింది. కాగా గత దశాబ్ద కాలంగా మరణాల డేటా సేకరిస్తున్నామని  వాటిలో ఈ సారి అత్యధికంగా మరణాలు సంభవించినట్లు పేర్కొంది. 2018లో ఎండల ద్వారా మరణాల సంఖ్య 8,900గా ఉండగా  1994లో 10 వేలకు పైగా ప్రజలు మృత్యువాత పడ్డట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement