మరో స్టార్‌ ఫుట్‌బాలర్‌ రిటైర్మెంట్‌ | Germany Defender Antonio Rudiger Announces International Retirement | Sakshi
Sakshi News home page

మరో స్టార్‌ ఫుట్‌బాలర్‌ రిటైర్మెంట్‌

Sep 2 2026 3:23 AM | Updated on Sep 2 2026 3:23 AM

Germany Defender Antonio Rudiger Announces International Retirement

source: X

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మరో స్టార్‌ ఆటగాడు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అర్జెంటీనా దిగ్గజం లియోనల్‌ మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన గంటల వ్యవధిలోనే జర్మనీ స్టార్ డిఫెండర్ ఆంటోనియో రూడిగర్ కూడా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 

2026 ప్రపంచకప్‌లో జర్మనీ తరఫున చివరిసారిగా ఆడిన 33 ఏళ్ల రూడిగర్, తన అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 86 మ్యాచ్‌లు ఆడాడు. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకు జాతీయ జట్టును వీడుతున్నట్లు రూడిగర్‌ తెలిపాడు. ఇకపై తన క్లబ్ జట్టు రియల్ మాడ్రిడ్‌పై పూర్తిగా దృష్టి సారించనున్నట్లు రూడిగర్‌ వెల్లడించాడు.

2014లో జర్మనీ తరఫున అరంగేట్రం చేసిన రూడిగర్.. 2017లో కాన్ఫెడరేషన్స్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అలాగే రియల్ మాడ్రిడ్‌తో పాటు చెల్సీ తరఫున కూడా ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లు సాధించాడు. డిఫెండర్‌ కావడంతో రూడిగర్‌ తన అంతర్జాతీయ కెరీర్‌ మొత్తంలో కేవలం​ మూడే గోల్స్‌ చేశాడు. 

చదవండి: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌ బై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement