స్కార్పియోని రూఫ్‌టాప్‌ ఎక్కించాడు? ఎందుకో తెలుసా? | Mahindra Scorpio Owner Uses Crane To Park SUV On Rooftop, Check The Reason | Sakshi
Sakshi News home page

స్కార్పియోని రూఫ్‌టాప్‌ ఎక్కించాడు? ఎందుకో తెలుసా?

Sep 3 2026 3:16 PM | Updated on Sep 3 2026 3:26 PM

Mahindra Scorpio Owner Uses Crane To Park SUV On Rooftop, Check The Reason

ఇల్లు విడిచి కొన్ని రోజులు ఏ విహారయాత్రకో, ఏ విదేశాలకో  పయనమవుతున్నపుడు, ఇంటి గురించి, వాహనాల భద్రత గురించి కొంత ఆందోళన ఉండటం సహజం. వాటిని జాగ్రత్తగా కాపాడుకునేందుకు  కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం కూడా చాలా సహజం అయితే బిహార్‌కుచెందిన ఒక వ్యక్తి చేసిన పని నెట్టింట వింతగా నిలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

బిహార్‌కు చెందిన ఒక వ్యక్తి మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio Classic) వాహన యజమాని, తను విదేశాలకు వెళ్తున్న సమయంలో కారు దొంగతనానికి గురవుతుందనే భయంతో దానిని క్రేన్ సహాయంతో  ఏకంగా తన ఇంటి  దాబా పైకి ఎక్కించిన ఘటన నెటిజన్లులను ఆకట్టుకుంటోంది.  

ఇదీ చదవండి: నెలకు రూ. 14 లక్షలు : ఏం వ్యాపారమో తెలిస్తే షాకవుతారు

విదేశాలకు  వెళ్లబోతున్న అతగాడు తన కారు భద్రత కోసం పెయిడ్ పార్కింగ్ లేదా బంధువుల ఇంట్లో పెట్టడానికి బదులుగా క్రేన్ సాయంతో ఇంటి పైకప్పుపై పార్క్ చేశాడు ఈ ఘటన బిహార్‌లో జరిగినట్లు నివేదికలు తెలుపుతున్నప్పటికీ, కచ్చితమైన ప్రదేశం, యజమాని వివరాలు వెల్లడి కాలేదు.

ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్‌ ఫ్రూట్‌సాగుతో నెలకు రూ. 4 లక్షలు

 సాధారణంగా ఇళ్ల పైకప్పులు కార్ల బరువును మోసేలా నిర్మించబడవు. అంతేకాకుండా, ఎండ, వానల వల్ల వాహనం పాడైపోయే ప్రమాదం ఉంది అంటున్నారు నెటిజన్లు. అంతేకాదు దీనిక కంటే వీల్ లాక్స్, జీపీఎస్ ట్రాకింగ్, భద్రతా కెమెరాలు లేదా సేఫ్ పార్కింగ్ ప్రాంగణాలను ఎంచుకోవడం సురక్షితమైన పద్ధతి అని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: రూ. 1,200 కోట్లతో వందేళ్లు నిలిచేలా కొత్త సెక్రటేరియట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement