డోర్‌బెల్‌ కెమెరాలో భయానక దృశ్యాలు.. షాక్ అవ్వాల్సిందే! | Us Man Struck By Lightning Outside His Home Doorbell Camera Captures | Sakshi
Sakshi News home page

డోర్‌బెల్‌ కెమెరాలో భయానక దృశ్యాలు.. షాక్ అవ్వాల్సిందే!

Sep 2 2026 7:03 PM | Updated on Sep 2 2026 7:29 PM

Us Man Struck By Lightning Outside His Home Doorbell Camera Captures

ఇంటికి అడుగుల దూరంలోనే.. ఒక్కసారిగా పిడుగు పడి ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు. ఆ భయానక క్షణాలు ఇంటి డోర్‌బెల్‌ కెమెరాలో రికార్డయ్యాయి. న్యూయార్క్‌లో జరిగిన ఈ ఘటనలో థామస్ ఫహ్మీ ప్రాణాలతో బయటపడటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన శరీరమంతా ఒక్కసారిగా తీవ్రమైన విద్యుత్ షాక్ వ్యాపించినట్లు అనిపించిందని.. మొద్దుబారడం, నొప్పి, మంట వంటి లక్షణాలు కనిపించాయని ఆయన తెలిపారు.

స్టాటెన్ ఐలాండ్‌లో నివసించే థామస్ ఫహ్మీ గత గురువారం దంత వైద్యుడి వద్దకు వెళ్లేందుకు తన ఇంటి నుంచి కారువైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఉరుములతో భారీ వర్షం కురుస్తోంది. విండ్సర్ రోడ్ సమీపంలో తన కారుకు సుమారు 15 నుంచి 25 అడుగుల దూరంలో ఉండగా ఒక్కసారిగా ఆయన పాదానికి పిడుగు తాకింది. డోర్‌బెల్ కెమెరాలో నమోదైన వీడియోలో పిడుగు తాకిన వెంటనే ఫహ్మీ నేలపై పడిపోవడం కనిపించింది. అయితే ఆయన స్పృహ కోల్పోలేదు. తన శరీరమంతా తీవ్రమైన షాక్‌కు గురైనట్లు, ముఖ్యంగా రెండు పాదాల్లో తీవ్రమైన నొప్పి, మంట మొద్దుబారినట్లు ఫహ్మీ చెప్పారు.

పిడుగు ప్రభావం నుంచి కోలుకున్న తర్వాత ఫహ్మీ తిరిగి లేచి.. సహాయం కోసం సమీపంలోని ఇంటివైపు నడుచుకుంటూ వెళ్లారు. నాకు సాయం చేయండనే0 అరుపు వినిపించింది. వెంటనే నా తలుపు దగ్గరకు వెళ్లి చూస్తే ఆయన నేలపై పడి ఉన్నారని పొరుగింటి మహిళ స్టెఫానీ హోమన్ తెలిపారు. అనంతరం ఫహ్మీని నార్త్‌వెల్ స్టాటెన్ ఐలాండ్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనను రాత్రంతా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. మరుసటి రోజు ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆశ్చర్యకరంగా.. ఆయనకు ఎలాంటి కాలిన గాయాలు లేవని వైద్యులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement