పాన్ ఇండియా ప్టార్ ప్రభాస్‌కి హీరోల్లో కూడా అభిమానులు ఉన్నారనే సంగతి అందరికి తెలిసిందే. అందులో ముందు వరుసలో ఉండే హీరో సుమంత్ ప్రభాస్.
ఈ యంగ్ హీరో చిన్నప్పటి నుంచి ప్రభాస్‌కు వీరాభిమాని. అందుకే ఆయన పేరులోనూ ప్రభాస్ పేరుని కలుపుకున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో ప్రభాస్‌ని కలిశాడు.
తన షర్ట్‌పై ఫేవరేట్ హీరో ప్రభాస్ ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాడు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. లైవ్‌లో చూసి చేబుతున్నా..
మన డార్లింగ్ బంగారం. లవ్ యూ అన్నా’ అంటూ రాసుకొచ్చాడు. సందీప్ రెడ్డి వంగ నిర్మాణంలో సుమంగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రోమాంచకం మూవీ సెప్టెంబర్ 3న విడుదల కానుంది.
ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగానే సుమంత్.. ప్రభాస్‌ని కలిశాడు.


