Sumanth Prabhas
-
ప్రేమ.. హాస్యం
సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జోడీగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ సినిమా ‘రోమాంచకం’. ‘ప్రేమ.. హాస్యం.. ఉత్కంఠ’ అనేది ఉపశీర్షిక. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘లవ్, ఫన్ , బ్యూటిఫుల్ ఎమోషన్ ్స ఉన్న ఒక ఫ్రెష్ ఎంటర్టైనర్గా రూ΄÷ందుతోన్న ‘రోమాంచకం’ ప్రేక్షకులను అలరిస్తుంది. త్వరలోనే ఈ సినిమా గురించి ఇతర వివరాలను వెల్లడిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఉపేంద్ర లిమయె, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు వాసుకి వైభవ్ సంగీతం అందిస్తున్నారు. -
3 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఓటీటీలోకి ఈ వారం చాలానే సినిమాలు వచ్చాయి. ధనుష్ 'కర', శరవణన్ 'లీడర్', సత్య 'జెట్ లీ', డ్రింకర్ సాయి, సచిన్ బయోపిక్ తెలుగు వెర్షన్‌తో పాటు హాలీవుడ్ హారర్ మూవీ 'ద మమ్మీ' అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు వీటికి తోడుగా ఇదే నెలలో రిలీజైన తెలుగు మూవీ కూడా సైలెంట్‌గా స్ట్రీమింగ్ అయిపోతోంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన హరర్ సినిమా.. తెలుగులోనూ)'మేమ్ ఫేమస్' సినిమాతో హీరో, దర్శకుడిగా ఆకట్టుకున్న సుమంత్ ప్రభాస్.. చాన్నాళ్లు గ్యాప్ తీసుకుని చేసిన మూవీ 'గోదారి గట్టుపైన'. నిధి ప్రదీప్ హీరోయిన్ కాగా 100కి పైగా షార్ట్ ఫిల్మ్స్ తీసిన సుభాష్ చంద్ర.. ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. జగపతిబాబు, లైలా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈనెల 08న థియేటర్లలో రిలీజ్ కాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక ఫ్లాప్ అయింది. ఇప్పుడిది ఎలాంటి హడావుడి లేకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.'గోదారి గట్టుపైన' విషయానికొస్తే.. రాజు (సుమంత్ ప్రభాస్) ఆటో డ్రైవర్. పదో తరగతి మధ్యలోనే ఆపేసి కుటుంబం, ఫ్రెండ్స్‌తో హ్యాపీగా బతికేస్తుంటాడు. తన చెల్లితో ఇంజినీరింగ్ చదువుతున్న మాయ(నిధి ప్రదీప్)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా రాజుని ప్రేమిస్తుంది. మరోవైపు తన కూతురు మాయ అంటే శ్యాంబాబు(జగపతిబాబు)కి ప్రాణం. సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే ఈయన తన కూతురుకి తనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడితోనే పెళ్లి జరిపిస్తానని చెబుతుంటాడు. మరి ఇంజినీరింగ్ చదువుతున్న కూతురు ఓ ఆటోడ్రైవర్ని ప్రేమించిందని తెలిశాక శ్యాంబాబు ఏం చేశాడు? కూతురు ప్రేమని అంగీకరించాడా లేదా? చివరకు ఏమైందేనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్) -
‘గోదారి గట్టుపైన’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘గోదారి గట్టుపైన’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: గోదారి గట్టుపైననటీనటులు: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్ తదితరులునిర్మాణ సంస్థ: రెడ్ పప్పెట్ పొడ్రక్షన్స్నిర్మాత : అభినవ్ రావురచన-దర్శకత్వం : సుభాష్ చంద్రసంగీతం: నాగ వంశీకృష్ణవిడుదల తేది: మే 8, 2026‘మేమ్ ఫేమస్’తో హీరోగా, దర్శకుడిగా పరిచయమైన సుమంత్ ప్రభాస్..పేరుకి తగ్గట్టే తొలి సినిమాతోనే ఫేమస్ అయిపోయాడు. అయితే ఆ వెంటనే రెండో సినిమా చేయకుండా..దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘గోదారి గట్టుపైన’అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘గోదారి గట్టుపైన’ హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు(మే 8) విడుదల అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాంకథేంటంటే.. సెక్యూరిటీ గార్డ్‌గా పని చేసే శ్యాంబాబు(జగపతి బాబు)కి కూతురు మాయ(నిధి ప్రదీప్) అంటే ప్రాణం. తనకంటే ఉన్నతమైన స్థాయిలో ఉండే వ్యక్తితో పెళ్లి చేస్తే.. కూతురు సుఖంగా బతుకుతుందని అనుకుంటాడు. కానీ మాయ మాత్రం ఆటో డ్రైవర్ రాజు(సుమంత్ ప్రభాస్)తో ప్రేమలో పడిపోతుంది. తన కూతురు ఓ ఆటో డ్రైవర్ని ప్రేమించిందని తెలిసిన తర్వాత శ్యాంబాబు ఏం చేశాడు? కూతురు ప్రేమను అంగీకరించాడా? లేదా? ఆటో డ్రైవర్ రాజుకి, ఇంజనీరింగ్ చదివే మాయ ఎలా పడిపోయింది? రాజు పోలీసు స్టేషన్‌కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మాయ వాళ్ల నాన్నకు తాను అంటే ఇష్టం లేదని తెలిసిన తర్వాత రాజు ఏం చేశాడు? చివరకు మాయ, రాజు ఎలా ఒక్కటయ్యారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రాణంగా చూసుకునే కూతురు తనకంటే తక్కువ స్థాయి వ్యక్తితో ప్రేమలో పడడం.. ఇది తండ్రికి నచ్చకపోవడం.. కూతురుకి వేరే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేయడం.. చిన్న ట్విస్ట్.. క్లైమాక్స్‌లో హీరోహీరోయిన్లు ఒక్కటవ్వడం.. ఇలాంటి నేపథ్యంతో తెలుగులో కొన్నేళ్లుగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ‘గోదారి గట్టుపైన’ మూవీ నేపథ్యం కూడా ఇదే. టైటిల్ తగ్గట్టే పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. తండ్రి కంటే గొప్పగా ప్రేమించే వ్యక్తి భర్తగా రావాలని కోరుకున్న అమ్మాయి జీవితం చుట్టూ కథ తిరుగుతుంది. ప్రేమకు కుల మతాలు అడ్డురావన్న సందేశంతో పాటు పిల్లలు తమ జీవితంలో ఏం జరిగినా.. పెరెంట్స్‌కు చెప్పగలిగేలా పెంపకం ఉండాలని సలహా ఇచ్చే చిత్రమిది. కథ మాదిరే కథనం కూడా రొటీన్‌గా, ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా ఉండడం మైనస్. అలాగే హీరో హీరోయిన్లు ప్రేమలో పడడానికి, విడిపోవడానికి గల కారణాలు కూడా బలంగా లేకపోవడం సినిమా ఆసక్తిని తగ్గిస్తాయి.ఓ పందెం పోటీతో హీరోని ఆటో డ్రైవర్‌గా పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత అతని ఫ్యామిలీ నేపథ్యాన్ని, స్నేహితుల పాత్రలను పరిచయం చేస్తూ మెల్లిగా అసలు కథలోకి తీసుకెళ్లాడు. మాయ, రాజుల పరిచయ సన్నివేశాలు బాగానే ఉన్నా.. ఏదో మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రేమలో పడడానికి గల కారణంగా ఇంకాస్త బలంగా చూపించాల్సింది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. నాన్నకు నచ్చడు అనే కారణంతో రాజుని మాయ దూరం పెట్టడం.. మళ్లీ దగ్గరవ్వడం.. ఈ విషయం శ్యాంబాబు తెలిసిన తర్వాత ఏం చేశాడనేది సెకండాఫ్ స్టోరీ. అయితే ద్వితియార్థంలో కథనం కొంతవరకు సాగదీతగా అనిపిస్తుంది. సుదర్శన్ కామెడీ అక్కడక్కడ నవ్విస్తుంది. రాజు ఫ్యామిలీ ప్లాష్ బ్యాక్, పెళ్లి ఎపిసోడ్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే..ఆటోడ్రైవర్ రాజు పాత్రకి సుమంత్ న్యాయం చేశాడు. తెరపై చాలా హుషారుగా కనిపిస్తూ.. కామెడీతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ బాగా నటించాడు. గోదారి యాస బాగానే మ్యానేజ్ చేశాడు. ఇక నిధి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. నాన్న గారాల పట్టి మాయ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఇక మహాలక్ష్మి పాత్రలో కనిపించిన రీనూ అందంతో ఆకర్షించింది. గబగబా మాట్లాడుతూ అందరిని నవ్విస్తుంది. శ్యాంబాబుగా జగపతి బాబు, అతని భార్యగా లైలా నటించారు. ఈ జోడీని సరిగా వాడుకోవడంతో మాత్రం దర్శకుడు విఫలం అయ్యాడు. లైలా పాత్రకు పెద్ద ప్రాధాన్యతే లేదు. సుదర్శన్ కామెడీ సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు. రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నాగ వంశీకృష్ణ అందించిన పాటలు బాగున్నాయి. బీజీఎం కొన్ని చోట్ల పాత సినిమాలను గుర్తు చేసినా.. ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. కోనసీమ అందాలను తెరపై చక్కగా చూపించారు. ఎడిటర్ తన కత్తెరకు పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘గోదారి గట్టుపైన..’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నాది తెలంగాణ.. గోదారి నేపథ్యం సవాల్‌గా అనిపించింది
‘‘మేమ్ ఫేమస్’ మూవీతో యూత్‌లో నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, క్రేజ్ వచ్చింది. అయితే ‘గోదారి గట్టుపైన’ పూర్తి కుటుంబ కథా చిత్రం. ఈ సినిమాలోని వినోదం, భావోద్వేగాలు, రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులను ఆక ట్టుకుంటాయి. ‘మేమ్ ఫేమస్’తో యూత్‌కి దగ్గరైన నేను ‘గోదారి గట్టుపైన’ చిత్రంతో కుటుంబ ప్రేక్షకులకు కూడా దగ్గరవుతానని సంతోషంగా ఉంది’’ అని హీరో సుమంత్ ప్రభాస్ తెలిపారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్, నిధీ ప్రదీప్ జోడీగా నటించిన చిత్రం ‘గోదారి గట్టుపైన’. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్‌పై అభినవ్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సుమంత్ ప్రభాస్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘సుభాష్‌గారు ఇప్పటికే వంద షార్ట్ ఫిల్మ్స్ చేశారు. ఆయన చెప్పిన ‘గోదారి గట్టుపైన’ కథ నాకు బాగా నచ్చింది. గోదారి నేపథ్యంలో కథ అనగానే నాకు సవాల్‌గా అనిపించింది. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది తెలంగాణలో. గోదారి యాస కోసం నాలుగు నెలలు రిహార్సల్స్ చేశాను. ఈ మూవీలో ఆటో డ్రైవర్‌గా చేశాను. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి విలువ ఇచ్చే పాత్ర నాది. జగపతిబాబుగారిది మెయిన్ క్యారెక్టర్. ‘శుభలగ్నం, ఫ్యామిలీ సర్కస్’ సినిమాల్లా అందరూ రిలేట్ అయ్యే సూపర్ క్యూట్ క్యారెక్టర్లో ఆయన కనిపిస్తారు. దేవీ ప్రసాద్‌గారు నా తండ్రి పాత్ర చేశారు. ఈ మూవీలోని లవ్, ఫాదర్–డాటర్ ఎమోషన్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. నేను వదులుకున్న సినిమాల్లో ‘రాజు వెడ్స్ రాంబాయి’ కూడా ఒకటి. నా తొలి చిత్రం ‘మేమ్ ఫేమస్’కి ట్వీట్ చేసి, మహేశ్‌బాబు గారు సపోర్ట్ చేయడం హ్యాపీగా అనిపించింది. నేను హీరోగా నటిస్తున్న మరో సినిమా పూర్తయింది. ఇకపై గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తాను’’ అని చెప్పారు. -
'రాజు వెడ్స్ రాంబాయి'లో హీరో నేనే.. ఎందుకు వదిలేశానంటే?
చిన్న సినిమాలు అప్పుడప్పుడు సూపర్ హిట్ అయిపోతుంటాయి. మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటాయి. అలా గతేడాది వచ్చిన వాటిలో 'రాజు వెడ్స్ రాంబాయి' ఒకటి. తెలంగాణలో జరిగిన ఓ నిజజీవిత సంఘటన ఆధారంగా తీసిన ఈ చిత్రంతో సాయిలు దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి ప్రయత్నంలో మెప్పించాడు. ఇందులో హీరోహీరోయిన్లుగా చేసిన అఖిల్ రాజ్, తేజస్వి కూడా మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. అయితే ఈ మూవీలో తానే హీరోగా చేయాలని, కానీ కొన్ని కారణాల వల్ల వదిలేశానని 'మేమ్ ఫేమస్' సుమంత్ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో నేనే చేయాలి. సుమంత్.. ఇది నువ్వే చేస్తే బాగుంటుంది అని సాయిలు(దర్శకుడు) అన్న చెప్పాడు. నేను కథ విన్నా. స్క్రిప్ట్ మొత్తం విన్న తర్వాత.. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని అన్నతో చెప్పా. పదిమంది మాట్లాడుకునే సినిమా ఇది అని చెప్పాను. అప్పుడే ప్యూర్ పల్లెటూరి తెలంగాణ కథ చేశా. మళ్లీ తెలంగాణ కథ చేశానంటే.. అయ్యో నేను ఇటు వెళ్లిపోతానేమో అనిపించింది. ఆ సినిమా నేను చేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది కానీ సినిమా అయితే తప్పకుండా రావాలన్నా. మీది 100 శాతం వర్కౌట్ అవుతుందని ఎప్పుడు అంటుండేవాడిని. చెప్పాలంటే నాకు నెరేట్ చేసిన దానికంటే చాలా అద్భుతంగా తీశాడు. ఫస్టాప్ అయితే ఇంకా బ్యూటిఫుల్‌గా తీశాడు. నేను అనుకున్న దానికంటే చాలా బాగా ప్రెజెంట్ చేశాడు'యూట్యూబ్‌లో ఆల్బమ్ సాంగ్స్‌తో నటుడిగా మారిన సుమంత్ ప్రభాస్.. 'మేమ్ ఫేమస్' సినిమాతో దర్శకుడు, నటుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీని తర్వాత 'గోదారి గట్టుపైన' మూవీ చేశాడు. ఇది ఈ శుక్రవారం(మే 08) ప్రేక్షకుల ముందుకు రానుంది. పేరుకి తగ్గట్లే గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథగా దీన్ని తెరకెక్కించారు. దీని ప్రమోషన్లలో భాగంగానే సుమంత్ ప్రభాస్.. 'రాజు వెడ్స్ రాంబాయి'లో హీరో అవకాశం వదులుకున్న సంగతి బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్‌కి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి) -
తరాలు మారినా భావోద్వేగాలు మారవు : సుభాష్ చంద్ర
సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ హీరో హీరోయిన్లుగా, జగపతిబాబు కీలక పాత్రలో నటించిన సినిమా ‘గోదారి గట్టుపైన..’. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సుభాష్ చంద్ర మాట్లాడుతూ– ‘‘నా చిన్నతనం నుంచే సినిమాల పట్ల ఆసక్తి ఉండేది. బీటెక్ చదువుతున్నప్పట్నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేయడం ప్రారంభించాను. దాదాపు 80 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఎక్కువగా రాజ్ తరుణ్‌తో చేశాను. ఈ క్రమంలో ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫిల్మ్ కోర్సు పూర్తి చేశాను. ఆ తర్వాత ఫీచర్ ఫిల్మ్స్‌కి ప్రయత్నాలు ఆరంభించాను. ఒక సినిమా సెట్స్‌కు వెళ్లే ముందు ఆగిపోయింది. మరో సినిమా షూటింగ్ పూర్తయింది కానీ రిలీజ్ కాలేదు. ఫైనల్‌గా ‘గోదారి గట్టుపైన..’ సినిమాతో దర్శకుడిగా వస్తున్నాను. ఈ సినిమా కొత్తగా ఉంటుందని చెప్పను కానీ ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. తరాలు మారినా భావోద్వేగాలు మారవని నమ్మే వ్యక్తిని నేను. ఈ సినిమా కథ మన జీవితాల్లో మనం చూసినదే. తండ్రీకూతుళ్ల ప్రేమ, ఇద్దరు ప్రేమికుల ప్రేమ... ఈ రెండు అంశాలను ట్రయాంగిల్ ఫార్మ్‌లో చూపించే ప్రయత్నం చేశాం. తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తికి తన కూతుర్ని ఇచ్చి తండ్రి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇది తండ్రి ప్రేమ. ఇటు అబ్బాయి ప్రేమలోనూ నిజం ఉంటుంది. ఈ అంశాలను పరిణతితో కూడిన ఆలోచనలతో చూపించాం. తెలంగాణ అబ్బాయి సుమంత్ ఈ సినిమా కోసం గోదావరి యాస సాధన చేశాడు. హీరోయిన్ నిధి కళ్లతోనే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలరు. నాగవంశీ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నా తర్వాతి సినిమా ఈ బ్యానర్లోనే ఉంటుంది. అలాగే హారర్–థ్రిల్లర్ జానర్లో ఓ సినిమా చేయాలని ఉంది’’ అని చెప్పారు. -
అలరించేలా 'గోదారి గట్టుపైన' ట్రైలర్
కూతురిని చాలా ప్రేమించే తండ్రి.. కానీ కూతురేమో ఓ కుర్రాడితో ప్రేమలో పడటం. తద్వారా ముగ్గురి జీవితాల్లో ఏర్పడే సంఘర్షణ అనే కాన్సెప్ట్‌తో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఇలాంటి స్టోరీతో తీసిన మరో మూవీ 'గోదారి గట్టుపైన'. సుమంత్ ప్రభాస్, జగపతిబాబు, నిధి ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేయగా అది ఆకట్టుకుంటోంది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా)షార్ట్ ఫిల్స్మ్, ఆల్బమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్.. 'మేమ్ ఫేమస్' సినిమాతో టాలీవుడ్లోకి వచ్చాడు. ఇప్పుడు గోదారి గట్టుపైన' చిత్రం చేశాడు. మే 08న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. ట్రైలర్ అయితే బాగానే ఉంది. పేరుకు తగ్గట్లే సరదాగా సాగిపోయే ప్రేమకథ చిత్రంలా అనిపించింది. అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ తీసి క్రేజ్ తెచ్చుకున్న సుభాష్ చంద్ర.. ఈ మూవీతో దర్శకుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు.(ఇదీ చదవండి: కాజల్ అగర్వాల్‌కి ఇది చివరి అవకాశం!) -
సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' టీజర్ రిలీజ్
ఆల్బమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్.. 'మేమ్ ఫేమస్' సినిమాతో హీరో, దర్శకుడిగా హిట్ అందుకున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు 'గోదారి గట్టుపైన' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రిలీజ్ ఎప్పుడనేది ఇప్పుడు వెల్లడించలేదు కానీ తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: విడాకులు తీసుకుని నాలుగేళ్లు.. మళ్లీ ప్రేమలో పడ్డ 'ఉరి' నటి)గోదావరి బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఓ క్యూట్ ప్రేమకథ ఇదని తెలుస్తోంది. దీనికి తోడు ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో చేసే కామెడీ ఉండనే ఉందని టీజర్‌తో క్లారిటీ ఇచ్చారు. సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ హీరోహీరోయిన్లు కాగా సుదర్శన్, రాజ్ కసిరెడ్డి లాంటి కమెడియన్స్ ఉన్నారు. బహుశా వేసవిలో థియేటర్లలో రిలీజ్ చేస్తారేమో? అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ తీసి పేరు తెచ్చుకున్న సుభాష్ చంద్ర.. ఈ చిత్రంతో సినిమా దర్శకుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.(ఇదీ చదవండి: 'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్) -
చూడు... చూడు
‘మేమ్ ఫేమస్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోదారి గట్టుపైన’. రెడ్ పప్పెట్ ప్రోడక్షన్స్పై అభినవ్ రావు తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా షార్ట్ ఫిల్మ్స్‌తో పాపులర్ అయిన సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిధి ప్రదీప్ కథానాయికగా, జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.ఆదివారం ఈ చిత్రంలోని తొలి పాట ‘చూడు చూడు..’ లిరికల్ వీడియోను విడుదల చేశారు. నాగ వంశీకృష్ణ స్వరపరచిన ఈ పాటకు దినేష్ కాకర్ల సాహిత్యం అందించగా హరిచరణ్ పాడారు. ‘‘ప్రేయసి అందాన్ని, చురుకుదనాన్ని ప్రేమికుడు వర్ణించే పాటగా ‘చూడు... చూడు’ ఉంటుంది. ఈ పాటలో సుమంత్ ప్రభాస్ స్టైలిష్ డాన్స్ మూమెంట్స్, నిధి ప్రదీప్ యాటిట్యూడ్ ఆకట్టుకునేలా ఉంటాయి’’ అని యూనిట్ పేర్కొంది. -
యాక్షన్... థ్రిల్
తొలి చిత్రం ‘మేం ఫేమస్’(mem famous) తో నటుడిగా– దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్(sumanth prabhas) హీరోగా ద్వితీయ చిత్రం తెరకెక్కుతోంది. సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో నిధి ప్రదీప్ హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, సుదర్శన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రెడ్ పప్పెట్ ప్రోడక్షన్స్పై రూపొందుతోన్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది.రేలంగి, భీమవరం, సకినేటిపల్లి లంక వంటి లొకేషన్స్‌తో పాటు అంతర్వేది ఆలయ ప్రాంగణంలో రెండో షెడ్యూల్ పూర్తి చేశాం. ఈ షెడ్యూల్లో హై ఎనర్జీ ఆటో రేస్ సీక్వెన్స్, ఇంటెన్స్ యాక్షన్ సీన్ చిత్రీకరించాం. ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తాయి. ఈ నెలాఖరులో ప్రారంభించే మూడో షెడ్యూల్లో పాటలు, ఇతర కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: సాయి సంతోష్, సంగీతం: నాగ వంశీకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: మధులిక సంచన లంక. -
ఓటీటీలోకి వచ్చేసిన మేమ్ ఫేమస్ సినిమా, ఎక్కడంటే?
షార్ట్ ఫిలింస్‌తో ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం మేమ్ ఫేమస్. ఊర్లో బలాదూర్‌గా తిరిగే ముగ్గురి యువకులు ఎలా ఫేమస్ అయ్యారనేదే కథ. కామెడీ పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. మే 26న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ నెల రోజుల తర్వాత నేటి(జూన్ 30) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో సినిమా చూడటం మిస్ అయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.. మేమ్ ఫేమస్ విషయానికి వస్తే.. 'మేజర్', 'రైటర్ పద్మభూషణ్' తర్వాత చాయ్ బిస్కెట్ అధినేతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర.. లహరి ఫిల్మ్స్ చంద్రు మనోహర్ నిర్మాణ భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్యామ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. కథేంటంటే.. బండనర్సంపల్లి గ్రామానికి చెందిన మహేశ్ అలియాస్ ముగ్గురు కుర్రాళ్లు ప్రాణ స్నేహితులు. వీరు ఊర్లో అల్లరిచిల్లరగా తిరుగుతూ అందరితో తిట్లు తిట్టించుకుంటారు. ఈ ముగ్గురికీ చెరో లవ్‌స్టోరీ ఉంది. అయితే గ్రామంలో జరిగిన ఓ సంఘటన వల్ల తాము కూడా పని చేసి శభాష్ అనిపించుకోవాలనుకుంటారు. అందుకోసం ఓ టెంట్‌హౌస్ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత వీళ్లకు ఎదురైన సమస్యలు ఏంటి? ఫేమస్ యూట్యూబ్ చానల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆ చానల్ ద్వారా ఊరికి ఎలాంటి మేలు జరిగింది? ఆవారాగా తిరిగే ఆ ముగ్గురు ఎలా ఫేమస్ అయ్యారు? అనేదే మిగతా కథ. View this post on Instagram A post shared by Lahari Music (@laharimusic) చదవండి: ఇంట్లో జరిగిన పెళ్లికి భార్యాపిల్లలు డుమ్మా.. చేతులు జోడించి క్షమాపణలు కోరిన నటుడు! -
చాలా రోజుల తర్వాత అలాంటి చిత్రాన్ని చూశా: రాజమౌళి ప్రశంసలు
సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి కీలక పాత్రల్లో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 26న విడుదల విడుదల కాగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రంపై దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్ చేశారు. చాలా కాలం తర్వాత పూర్తిస్థాయిలో ఓ వినోదాత్మక చిత్రాన్ని చూశానంటూ ప్రశంసించారు. (ఇది చదవండి: విజయ్ దేవరకొండ స్టైల్లో 'మేమ్ ఫేమస్' రిలీజ్ డేట్) రాజమౌళి ట్వీట్ రాస్తూ..'చాలా కాలం తర్వాత థియేటర్లో పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రాన్ని చూశా. దర్శకుడు, నటుడు సుమంత్ కు మంచి భవిష్యత్ ఉంది. మేమ్ ఫేమస్‌లో నటించిన వారంతా ఎంతో సహజంగా నటించారు. ముఖ్యంగా అంజిమామ అదరగొట్టేశాడు. ఈ మూవీ చూడాల్సిందిగా ప్రతి ఒక్కరికీ రెకమెండ్ చేస్తున్నా. యూత్‌ను ఎంకరేజ్ చేయాలి.. దమ్ దమ్ చేయొద్దు' అని పోస్ట్ చేశారు. (ఇది చదవండి: Mem Famous Review: ‘మేమ్ ఫేమస్’ మూవీ రివ్యూ) After a long time thoroughly enjoyed a film in the theatre. Watch out for this guy Sumanth. He has a bright future both as an actor and director. All the characters were nicely etched and actors performed naturally. Especially Anji mama. Highly recommend it to everyone. Youth… — rajamouli ss (@ssrajamouli) May 29, 2023 -
డైరెక్టరుగా సైన్ చేసి హీరోగా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే...
-
Mem Famous Review: ‘మేమ్ ఫేమస్’ మూవీ రివ్యూ
టైటిల్: మేమ్ ఫేమస్ నటీనటులు: సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, అంజి మామ, మురళీధర్ గౌడ్ తదితరులు నిర్మాణ సంస్థలు: లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నిర్మాతలు: అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ రచన- దర్శకత్వం: సుమంత్ ప్రభాస్ సంగీతం: కళ్యాణ్ నాయక్ సినిమాటోగ్రఫీ: శ్యామ్ ఎడిటర్: సృజన అడుసుమిల్లి విడుదల తేది: మే 26, 2023 ‘మేమ్ ఫేమస్ కథేంటంటే.. బండ నర్సంపల్లి గ్రామానికి చెందిన మహేశ్ అలియాస్ మయి(సుమంత్ ప్రభాస్), బాలి(మౌర్య), దుర్గ(మణి ఏగుర్ల) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఊరంతా బలాదూరుగా తిరుగుతూ ఊరి జనాలతో ‘తూ’ అనిపించుకుంటారు. ఆ ఊరి సర్పంచ్ వేణు(కిరణ్ మచ్చా), ట్రాక్టర్ డ్రైవర్ అంజిమామ(అంజి మామ మిల్కూరి) మాత్రం ఈ ముగ్గురికి మద్దతుగా ఉంటారు. ఇక మయి తన మేనమామ(మురళీధర్ గౌడ్) కూతురు మౌనిక(సిరి)ని ప్రేమిస్తాడు. అలాగే చిన్నప్పటి స్నేహితులు బబ్బీ(సిరి), బాలీలు కూడా ప్రేమలో ఉంటారు. ఊర్లో జరిగిన ఓ సంఘటన వల్ల తాము కూడా పని చేసి అందరితో శభాష్ అనిపించుకోవాలనుకుంటారు. దాని కోసం ఓ టెంట్ హౌస్‌ని ఏర్పాటు చేయాలనుకుంటారు. సర్పంచ్ వేణు సపోర్ట్‌తో టెంట్‌హౌస్ ఏర్పాటు చేసి దానికి ‘ఫేమస్ టెంట్ హౌస్’ అని పేరు పెడతారు. ఆ తర్వాత వీళ్లకు ఎదురైన సమస్యలు ఏంటి? మరదలు మౌనికతో మయి ప్రేమాయణం ఎలా సాగింది? ఫేమస్ యూట్యూబ్ చానల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆ చానల్ ద్వారా ఊరికి ఎలాంటి మేలు జరిగింది? ఆవారాగా తిరిగే ఆ ముగ్గురు ఎలా ఫేమస్ అయ్యారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. తెలంగాణలోని ఓ పల్లెటూరిలో ఆవారాగా తిరిగే ముగ్గురు యువకుల కథే ‘మేమ్ ఫేమస్’ సినిమా. కామెడీ, ఎమోషనల్, సందేశం.. ఇవన్నీ తన కథలో ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు సుమంత్ ప్రభాస్. యువతను నిరుత్సాహపరచకుండా వారిలోని టాలెంట్‌ని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారనే సందేశాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాడు. సినిమాలో ఎక్కడా నాటకీయతా సన్నివేశాలు కనిపించావు. రియలిస్టిక్ అప్రోచ్ లో కథా, కథనాలు సాగుతాయి. సినిమాలోని ప్రతి పాత్ర మన ఊర్లో చూసే వ్యక్తులను పోలి ఉంటాయి. డైలాగ్స్ కూడా చాలా సహజంగా ఉన్నాయి. అయితే కథలో కొత్తదనం మాత్రం లేదనే చెప్పాలి. పనీపాట లేకుండా తిరిగే ముగ్గురు స్నేహితులు చేసే చిల్లర పనులు.. దానివల్ల పుట్టే కామెడీ సన్నివేశాలను చూస్తే కొన్ని పాత సినిమాలు కచ్చితంగా గుర్తుకు వస్తాయి. ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలకు గ్రామీణ యువకులు కనెక్ట్ అవుతారు. క్రికెట్ గొడవలు.. దావత్ కోసం కోళ్లను కొట్టేయడం.. ఇంజన్‌తో సహా అన్ని పాడైన బైక్‌ని వేసుకొని ఊరంతా తిరగడం లాంటి సీన్స్ నవ్వులు పూయిస్తాయి. అదే సమయంలో కొన్ని సన్నివేశాలను కావాలనే ఇరికించినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ ఎమోషనల్‌కు గురి చేస్తుంది. సెకండాఫ్ ఎక్కువగా యూట్యూబ్ చానల్ చుట్టే సాగుతుంది. యూట్యూబ్ వ్యూస్ కోసం పడే కష్టాలు కొన్ని చోట్ల నవ్విస్తే.. మరికొన్ని చోట్ల బోర్ కొట్టిస్తాయి. లిపిస్టిక్ ఎపిసోడ్ అయితే అందరిని ఆకట్టుకుంటుంది. మౌనిక బర్త్‌డేకి సంబంధించిన సీన్, గోరేటి వెంకన్న పాట సినిమాకు ప్లస్ అయ్యాయి. లాజిక్స్ వెతక్కుండా ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్లే వాళ్లకు ‘మేమ్ ఫేమస్’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. సినిమాలో ఒకరిద్దరు మినహా మిగతావారంతా కొత్త వాళ్లే. ఆ విషయం తెరపై ఎక్కడా కనిపించదు. అంత చక్కగా నటించారు. ఇక ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు హీరోగా నటించిన సుమంత్ ప్రభాస్ టాలెంట్‌ని అభినందించాల్సిందే. దర్శకత్వానికే కాదు నటుడిగా కూడా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక హీరో స్నేహితులుగా దుర్గ, బాలీగా నటించిన మౌర్య, మణిలు కూడా చాలా సహజంగా నటించారు. మరదలు మౌనికగా సార్య లక్ష్మణ్, సిటీ నుంచి అమ్మమ్మ వాళ్ల ఇంటికొచ్చిన యువతి బబ్బీగా సిరా రాశి తమ పాత్రలకు న్యాయం చేశారు. అంజిమామ, మురళీధర్‌గౌడ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కల్యాణ్ నాయక్ అందించిన సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగా వస్తాయే తప్ప ఎక్కడా ఇరికించినట్లు అనిపించవు. నేపథ్య సంగీతం కూడా బాగుంది. గోరేటి వెంకన్న ‘గల్లీ చిన్నది’పాట స్పెషల్ అట్రాక్షన్. శ్యామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలను చక్కగా తెరపై చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. చాయ్ బిస్కెట్,లహిరి ఫిలింస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నంతంగా ఉన్నాయి. -
మహేశ్ మాటలు సంతోషాన్నిచ్చాయి
‘‘మహేశ్‌బాబుగారు ‘మేమ్ ఫేమస్’ సినిమా చూసి గొప్పగా మాట్లాడటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ మూవీ విడుదల కాకముందే సుమంత్ ప్రభాస్‌తో మరో సినిమా చేయాలని మహేశ్‌గారు ముందుకు రావడం మజా అనిపించింది.. ఆయన ధైర్యానికి హ్యాట్సాఫ్’’ అన్నారు నిర్మాత అనురాగ్ రెడ్డి. సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘మా గురించి మహేశ్ బాబుగారి ట్వీట్ చదువుతున్నపుడు నమ్మలేకపోయాను. నా తర్వాతి సినిమాని అనురాగ్, శరత్గార్లతో కలసి మహేశ్‌గారు నిర్మిస్తామని చెప్పడం అద్భుతం అనిపించింది’’ అన్నారు. ‘‘మా సినిమా ప్రీమియర్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. కొత్తవారితో చేసిన సినిమాకి ఇంత మంచి రెస్పా¯Œ ్స రావడానికి కారణమైన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు శరత్ చంద్ర. ‘‘మహేశ్ బాబుగారి మాటలు గొప్ప స్ఫూర్తిని ఇచ్చాయి’’ అన్నారు చంద్రు మనోహరన్. -
కొత్తవాళ్లు ఇంతమంచి చిత్రాన్ని తీశారంటే నమ్మలేకపోతున్నా: మహేశ్‌బాబు
సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఇప్పటికే వినూత్నమైన ప్రచారంతో ఈ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయింది. టాలీవుడ్ యంగ్ హీరోలందరూ ఈ సినిమా ప్రచారంలో పాలుపంచుకున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శించింది చిత్రబృందం. సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ మహేశ్‌బాబు ట్వీట్ చేశాడు. (చదవండి: ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలివే!) ‘మేమ్ ఫేమస్ చిత్రం అద్భుతంగా ఉంది. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు వాళ్ల పాత్రకు న్యాయం చేశారు. ముఖ్యంగా సుమంత్ ప్రభాస్ తన మల్టీ టాలెంట్‌తో సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. విజువల్స్, మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. ఈ మంచి చిత్రాన్ని తెరకెక్కించిన వారంతా కొత్తవాళ్లు అంటే నమ్మలేకపోతున్నాను’ అని మహేశ్ ట్వీట్ చేశాడు. తమ సినిమాను మహేశ్‌బాబు ప్రశంసించడం పట్ల మేమ్ ఫేమస్ టీమ్ సంతోషం వ్యక్తం చేసింది. చిత్ర నిర్మాతలు మహేశ్‌బాబుకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. అంతేకాదు ‘థ్యాంక్యూ మహేశ్‌బాబు అంటూ ఆ ట్వీట్‌ని పోస్టర్‌పై వేసి ప్రచారం చేసుకుంటుంది. మొత్తంగా మహేశ్ ట్వీట్‌తో ‘మేమ్ ఫేమస్’ చిత్రంపై మరింత అంచనాలు పెరిగాయి. Just watched #MemFamous! Brilliant film!! ❤️❤️ Blown away by the performances of each and every actor in the film, especially writer, director and actor @SumanthPrabha_s - what a talent! The visuals, background score and all the crafts sit perfectly. Can’t believe a bunch of… — Mahesh Babu (@urstrulyMahesh) May 25, 2023 -
అందుకే సుమంత్ ప్రభాస్ అని పేరు పెట్టుకున్నా : ‘మేమ్ ఫేమస్’ హీరో
‘‘తప్పు, ఒప్పు.. ఇలా ఏం చేసినా ఊర్లో ఫోకస్, ఫేమస్ కావాలనే ఆలోచన ఉన్న యువకుల కథే ‘మేమ్ ఫేమస్’. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది’’ అని సుమంత్ ప్రభాస్ అన్నారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. (చదవండి: నేను బయటికి వచ్చానంటే కారణం నరేశ్: పవిత్రా లోకేష్ ) ఈ సందర్భంగా సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘నా పేరు సుమంత్ రెడ్డి. ప్రభాస్‌గారికి ఫ్యాన్‌ని. అందుకే సుమంత్ ప్రభాస్ అని పెట్టుకున్నాను. డిగ్రీ పాసయ్యాక ఎస్ఐ ఉద్యోగానికి ప్రిపేర్ కావాలనుకున్నాను. డిగ్రీ చదువుతున్నప్పుడు కాలేజీలో అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఒక షార్ట్ ఫిల్మ్ తీశాం.. అది నచ్చడంతో ఒక ఫిల్మ్ స్కూల్ వాళ్లు మాకు కంటెంట్ క్రియేట్ చేయమని కెమెరాలు స్పాన్సర్ చేయడంతో ‘పిల్ల పిల్లగాడు’ అనే వెబ్ సిరీస్ చేశాం. అది నచ్చడంతో అనురాగ్, శరత్ అన్న పిలిచి, వెబ్ సిరీస్ చేద్దామన్నారు. నేను సినిమా చేద్దామన్నాను. కథ రెడీ చేయమన్నారు. ఆ తర్వాత ‘మేమ్ ఫేమస్’ కథని వారికి చెప్పాను.. నచ్చడంతో నన్నే డైరెక్షన్ చేయమన్నారు. లీడ్ రోల్‌కి తగ్గ యువకుడు కుదరకపోవడంతో నేనే నటించాను. నా తర్వాతి సినిమా కూడా చాయ్ బిస్కెట్ బ్యానర్లోనే ఉంటుంది’’ అన్నారు. -
‘మేమ్ ఫేమస్’పై సెన్సార్ ప్రశంసలు!
కొన్ని సినిమాలు విడుదలకు ముందే పాజిటివ్ బజ్‌ని క్రియేట్ చేసుకుంటాయి. అలాంటి వాటిలో ‘మేమ్ ఫేమస్’ చిత్రం ఒకటి. సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రమిది. శరత్, అనురాగ్ రెడ్డి, చంద్రు మనోహరన్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదల కాబోతుంది. చిన్న సినిమానే అయినా.. వినూత్నమైన ప్రచారంతో భారీ హైప్‌ని క్రియేట్ చేసుకుంది. (చదవండి: బ్రహ్మానందం ఇంట పెళ్లిసందడి.. ఘనంగా కొడుకు నిశ్చితార్థం) తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ని పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేస్తూ ప్రశంసలు కురిపించారు. సినిమా బాగుందని కితాబు ఇచ్చారు. ‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినప్పటికీ.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయి. ఎమోషనల్ సీన్స్ అందరిని ఆకట్టుకుంటాయి. ప్రతి ఒక్కరికి ఈ చిత్రం నచ్చుతుంది’అని చిత్ర యూనిట్ పేర్కొంది.


