ఆల్బమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్.. 'మేమ్ ఫేమస్' సినిమాతో హీరో, దర్శకుడిగా హిట్ అందుకున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు 'గోదారి గట్టుపైన' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రిలీజ్ ఎప్పుడనేది ఇప్పుడు వెల్లడించలేదు కానీ తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: విడాకులు తీసుకుని నాలుగేళ్లు.. మళ్లీ ప్రేమలో పడ్డ 'ఉరి' నటి)
గోదావరి బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఓ క్యూట్ ప్రేమకథ ఇదని తెలుస్తోంది. దీనికి తోడు ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో చేసే కామెడీ ఉండనే ఉందని టీజర్‌తో క్లారిటీ ఇచ్చారు. సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ హీరోహీరోయిన్లు కాగా సుదర్శన్, రాజ్ కసిరెడ్డి లాంటి కమెడియన్స్ ఉన్నారు. బహుశా వేసవిలో థియేటర్లలో రిలీజ్ చేస్తారేమో? అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ తీసి పేరు తెచ్చుకున్న సుభాష్ చంద్ర.. ఈ చిత్రంతో సినిమా దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
(ఇదీ చదవండి: 'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్)


